Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
పచ్చి మామిడికాయలను ఇంట్లోనే ఈజీగా ఇలా పండించుకోండి..ఎలాంటి రసాయనాలు అక్కర్లేదు
ఎండాకాలం ఎప్పుడొస్తదా..మామిడి పళ్లు ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురుచూసేటోళ్లు చాలామంది. మామిడికాయలతో జ్యూస్ లు,స్మూతీలు, కూరలు, పులుసు కూడా తయారుచేస్తుంటారు. అయితే సమ్మర్ సీజన్ ప్రారంభం నుంచే మార్కెట్లలో అనేక రకాల మామడి వెరైటీలు లభిస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు రసాయనాల ద్వారా పండించినవే ఉంటున్నాయి. దీంతో వాటిని తిని ఆనారోగ్యాల పాలవుతున్నారు కొందరు. అయితే రసాయనాల ద్వారా పండిచింన మామిడికాయలను తిని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకునే బదులు పచ్చి మామిడికాయలను తెచ్చుకొని నేచురల్ గానే వాటిని ఇంట్లో పండించుకోవడం ఉత్తమం. మీ ఇంట్లోనే ఈజీగా మామిడికాయలను ఎలా పండించుకోవాలో ఇక్కడ చూడండి.
-పచ్చి మామిడికాయలను ముందుగా శుభ్రమైన కాగితంలో చక్కగా చుట్టండి. ఇప్పుడు వాటిని గోనె సంచిలో ఉంచి ఆ సంచిని మీ మంచం కింద లేదా ఏదైనా టేబుల్ కింద, కాస్త వెచ్చగా ఉండే చోట పెట్టండి. మరింత తొందరగా పక్వానికి రావాలంటే ఆ సంచిపైన మరో సంచిని కప్పండి. ఈ వెచ్చదనం మామిడికాయలను త్వరగా మగ్గేలా చేస్తుంది.

-మామిడికాయలను ఒక పాలిథిన్ కవర్ లో వేసి గాలి చొరబడకుండా మూసివేయండి. ఆపై ఈ సంచిని మీ ఇంట్లోని పిండి డబ్బాలో ఉంచండి. పిండిలోని ఇథిలీన్ వాయువు ప్రభావంతో కొన్ని రోజుల్లోనే పచ్చి మామిడికాయలు పండుతాయి.
-పిండి డబ్బానే కాకుండా బియ్యం డబ్బా కూడా మామిడి పండ్లను మగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. బియ్యపు వెచ్చదనానికి మామిడికాయలు మూడు, నాలుగు రోజుల్లోనే మెత్తగా పక్వానికి వస్తాయి. అయితే మధ్యమధ్యలో తీసి చూస్తూ ఉండండి. కాయను వేళ్లతో నొక్కి చూస్తే మెత్తగా తగిలితే ఇక ఆస్వాదించడానికి సిద్ధమైనట్లే.
-పచ్చి మామిడికాయలను ఎండు గడ్డిలో లేదా వరిగడ్డిలో పెట్టడం ద్వారా కూడా పండించుకోవచ్చు. ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా వెదురు బుట్ట తీసుకుని అడుగున ఎండుగడ్డిని మందంగా పరవండి. వాటి మధ్యలో మామిడికాయలను ఉంచి, పైన మళ్ళీ గడ్డితో పూర్తిగా కప్పేయండి. ఈ డబ్బాను వెలుతురు లేని, కాస్త వెచ్చని ప్రదేశంలో ఉంచండి. రెండు రోజులకోసారి గమనిస్తూ ఉండండి. కొద్దిగా పండిన వాటిని ముందుగా తీసి రుచి చూడండి.
-ఒక శుభ్రమైన కాటన్ వస్త్రం పాత చీర లేదా ధోతి వంటివి తీసుకుని అందులో మామిడికాయలను పొదిగినట్లుగా చుట్టండి. దీనిని ఏదైనా పెట్టెలో లేదా పాత్రలో ఉంచి, వెలుతురు తగలనివ్వకండి. ఇలా చేస్తే అవి మూడు నాలుగు రోజుల్లోనే సహజంగా పక్వానికి వచ్చి, మధురమైన రుచిని అందిస్తాయి.



Click it and Unblock the Notifications