Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
Viral Video : ప్రయాణికులపై కుప్పకూలిన ఏయిర్‌పోర్ట్ పైకప్పు..! కారణమదే అంటున్న నిపుణులు..!
ఢిల్లీ ఏయిర్‌పోర్టు కూలిపోయిన దుర్ఘటనకు సంబంధించిన అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్‌గా మరింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చెందిన టెర్మినల్ 1 రూఫ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయ్. ప్రమాద విషయాన్ని అగ్నిమాపక సిబ్బంది తెలుసుకోగానే వారు రంగంలోకి దిగి సహాయ చర్యలను చేపట్టారు.సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు దుర్ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. రూఫల్ ఎక్కడ పడిందో ఆ ప్రాంతాన్ని మొత్తం సందర్శించారు. సహాయక చర్యలను ఆయన వేగవంతం చశారు. టర్మినల్ 1 దగ్గర వున్న ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఢిల్లీ రూఫ్ పడిడంతో మృతి చెందిన వారికి 20 లక్షల రూపాయలను పరిహారంగా ప్రకటించారు. గాయాలైన వారికి 3 లక్షల రూపాయలను సహాయంగా అందించారు. ప్రస్తుతం పరిస్థితి అంతా కంట్రోల్‌లోనే వుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఎవరైతే ఈ టర్మినల్ 1 వద్ద టికెట్ బుక్ చేసుకున్నారో వారందరికీ బుక్ చేసుకున్న టికెట్ చార్జీలను వెనక్కి ఇచ్చేస్తామని అంటున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
అయితే 2009లో ఈ పైకప్పును నిర్మించారని, దీనికి ప్రధాని మోడీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దుర్ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక వచ్చిన తరువాత చెబుతామన్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షాలు చాలా తీవ్రంగా పడుతున్నాయ్. పైకప్పు కూలడానికి కూడా ఇది ప్రధాన కరణమని అంటున్నారు. పైకప్పు కార్లపై పడ్డంతో కారులో వున్న ఒకరు మరణించారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయ్. శిథిలాల కింద చిక్కకున్న నలుగురిని అప్పటికప్పుడే బయటకు తీసి రక్షించారు. టర్మినల్ 1 నుంచి వెళ్లే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా బ్యాన్ చేశారు.

దీని పై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గాంధీ కాలంలో దీన్ని కట్టివుంటారని కామెంట్ చేస్తున్నారు. మరో వైపు ప్రధాని మోడీని అడిగితే నెహ్రూ కాలంలో కట్టివుంటారని అంటాడని మరో యూజర్ చమత్కరించాడు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయ్.



Click it and Unblock the Notifications
