Latest Updates
-
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!
Vada Pav Girl : వడాపావ్ అమ్ముతూ లక్జరీ కారు కొన్న వడాపావ్ గర్ల్..!
వడా పావ్ అమ్మి లక్జరీ కారు కొన్న వడా పావ్ గర్ల్..
వడాపావ్ అని ఫాస్ట్ ఫుడ్ ముంబైలో చాలా ఫేమస్. నార్త్ ఇండయన్స్ ఈ ఐటమ్‌ను చాలా ఇష్టంగా తింటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మిరపకాయ బజ్జీలు ఎంత ఫేమస్సో ముంబైలో వడాపవ్ అంత పాపులర్. డిళ్లీలో ఈ వడాపావ్ అమ్ముతూ చంద్రిక గేరా దీక్షిత్ అనే మామూలు ఉద్యోగి 70 లక్షలు విలువ చేసే ఫోర్డ్ కారు కొనే స్థాయికి ఎదిగింది. ఆమె ఎవరు ఆ స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసుకుందాం.
చంద్రికా గేరా దీక్షిత్
చంద్రికా గేరా దీక్షిత్ ఓ గృహిణి, తల్లి, భార్య. మొదట్లో హల్దీరామ్స్ కంపెనీలో పనిచేసింది. ఆర్థిక సమస్యలు కుటుంబం చుట్టుముట్టాయ్. భర్త రాపిడో బైక్ సర్వీస్ లో పనిచేస్తాడు. ఇద్దరూ కలిసి ఎంత కష్టపడినా కుటుంబం గడవడం కష్టంగా మారింది. అప్పుడే ఆమె ఢిల్లీలో వడాపావ్ అమ్మాలని నిర్ణయించుకుంది. తానే స్వయంగా వడాపావ్ స్టాల్ పెట్టుకొని అమ్మడం ప్రారంభించింది.

వడాపావ్ వీడియో వైరల్
ఇన్స్‌టాగ్రామ్‌లో ఫుడ్ వ్లాగర్ల ద్వారా ఆమెకు చెందిన వడాపావ్ వీడియో వైరల్‌గా మారింది. ఢిల్లీలో ఉన్న చాలా మందికి ఆమె స్టాల్ ఎక్కడ ఉంది అనే ఐడియా రావడంతో ఆమె స్టాల్‌కు రద్దీ పెరిగింది. రాత్రికి రాత్రే వడాపావ్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆమె స్టాల్‌ను తొలగిస్తున్నట్టు ఆమె ఏడుస్తూ వేడుకున్న వీడియో మార్చ్ నెలలో వైరల్ కావడంతో సింపతీని బాగా సంపాదించుకుంది. రూ.35,000 కట్టినా స్టాల్ తొలగించమని వేధిస్తున్న వీడియో అందరినీ కలచి వేసింది.
ఇన్స్‌టాగ్రామ్ ద్వారా పాపులర్
ఇక ఇన్స్‌టాగ్రామ్, ఇన్‌ఫ్లుయెన్సర్ల సాయంతో తన వడాపావ్ స్టాల్‌కు పాపులారిటీని పెంచుకుంది. గత రెండు నెలల్లో అనేక మంది సోషల్ మీడియా స్టార్లను కలిసి వారికి వడాపావ్ తినిపించింది. కొందరు హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా ఆమె వడాపావ్‌ను రుచి చూశారు. బిల్‌గేట్స్‌తో ఫోటో దిగిన డాలీ చాయ్‌వాలా కూడా ఆమెకు సాయం చేయమని సోషల్ మీడియాలో ప్రజల్ని కోరుకున్నాడు.
ఈ వడాపావ్ గర్ల్‌ను చూసి అదే ఏరియాలో ఉన్న ఓ ఆంటీ ఆమెకు పోటీగా మరో వడాపావ్ స్టాల్‌ను పెట్టింది. వడాపావ్ వీడియో వైరల్ తరువాత ఢిల్లీలో చాలా మంది వడాపావ్ స్టాల్‌లు పెట్టుకున్నారని టాక్. అయితే తనకు భర్తే స్పూర్తి అని వడాపావ్ గర్ల్ అంటోంది. తనలాగే భర్త కూడా చాలా కష్టపడ్డాడని చెబుతోంది. ఏ పని, వ్యాపారం తమకు తక్కువకాదని ఢిల్లీ వీధుల్లో నిలబడి వ్యాపారం చేసుకుంటున్నందుకు గర్వంగా ఉందని చంద్రిక భర్త చెబుతున్నారు.
ఫోర్డ్ ముస్తంగ్ లక్జరీ కారు
ఫార్డ్ ముస్తంగ్ కారు ధర సుమారు రూ.74 లక్షలకు పైగా ఉంటుంది. ఓ రోజు అదే కారులో వడాపావ్ గర్ల్ దిగి వడాపావ్ అమ్మాడు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. కాంట్రవర్సీల నడుమ ఒక సందర్భంలో ఢిల్లీ పోలీసులు కూడా ఆమెను అరెస్ట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వారి వల్ల కొందరు చిరు వ్యాపారులకు లాభం మాత్రమే కాకుండా నెటిజెన్లకు మంచి ఫుడ్ ఎక్కడుందో తెలిసిపోతోంది. అయితే వీరిలో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. అటు చిరువ్యాపారులకు, ఇటు ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా తమ పాపులారిటీ కోసం సోషల్‌మీడియాలో అష్టకష్టాలు పడుతున్నారు.



Click it and Unblock the Notifications
