Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఏం పీక్కుంటావో పీక్కో..తగ్గేదే లే..ట్రంప్ కి ఇరాన్ మాస్ వార్నింగ్
కొద్ది రోజులుగా టారిఫ్ ల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తీసుకుంటున్న నిర్ణయాలు,మాట్లాడుతున్న మాటలు ప్రపంచంలోని చాలా దేశాలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. నా దారికి వస్తే సరి లేకుంటే తాట తీస్తా అంటూ ట్రంప్ రెచ్చిపోతున్నారు. మనదేశాన్ని కూడా ట్రంప్ వదల్లేదు. తమ ఉత్పత్తులపై భారత్ ఇష్ఠానుసారంగా అత్యధికంగా టారిఫ్ లు విధిస్తుందని,ప్రతీకార సుంకాల పేరుతో భారత్ ని కూడా వదల్లేదు. ఇక,కెనడా,చైనాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. టారిఫ్ లు మాత్రమే కాకుండా ఏకంగా గ్రీన్ లాండ్ దేశం అమెరికాని కలిపేసుకుంటామని,ఒప్పుకుంటే ఓకే లేకుండా సైనిక చర్య ద్వారా దానిని అమెరికాలో కలిపేసుకోడానికి ఏ మాత్రం తగ్గనని ట్రంప్ బహిరంగానే చెప్పారు. పొరుగుదేశమైన కెనడాని కూడా అమెరికాలో కలిపేస్తాను అంటూ ట్రంప్ రెచ్చిపోతున్నారు.
ట్రంప్ దెబ్బకు పలు దేశాలు దిగొస్తున్నాయి. ట్రంప్ తో కయ్యం కంటే సఖ్యత బెటర్ అని పలు దేశాలు తగ్గి వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మంగళవారం డొనాల్డ్ ట్రంప్ కి మాస్ వార్నింగ్ ఇచ్చారు. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో..అమెరికాతో ఇరాన్ చర్చలు జరిపే ప్రశక్తే లేదు అంటూ మసౌద్ పెజెష్కియాన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. "అమెరికా..ఇరాన్ కి ఇది ఫాలో కావాలి అది ఫాలో అవ్వాలి అంటూ ఆర్డర్లు ఇవ్వడం,బెదిరింపులకు ఇవ్వడం ఆమోదయోగ్యమైనది కాదు. అమెరికాతో కనీసం చర్చలు కూడా జరపను..అమెరికా నచ్చింది చేసుకోవచ్చు"అని పెజెష్కియాన్ చెప్పినట్లు ఇరాన్ స్టేట్ మీడియా రిపోర్ట్ చేసింది.

కొత్త న్యూక్లియర్ డీల్ మీద చర్చల్లో పాల్గొనమని ఇరాన్ ను కోరుతూ డొనాల్డ్ ట్రంప్ ఒక లేఖ రాసినట్లు వార్తలు వచ్చిన క్రమంలో శనివారం ఇరాన్ సుప్రీం లీటర్ అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌ను చర్చల పేరుతో బెదిరించలేవు ట్రంప్ అని అన్నారు.
ఇరాన్ ఒప్పందానికి బహిరంగతను వ్యక్తం చేస్తూనే డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఇరాన్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి వేరు చేసి దాని చమురు ఎగుమతులను సున్నాకి తగ్గించడానికి ప్రయోగించిన గరిష్ట ఒత్తిడి ప్రచారాన్ని తిరిగి అమలు చేశారు.
పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ
ఇరాన్ అణ్వాయుధ తయారీకి సిద్ధం అవుతుండగా.. ట్రంప్ దాన్ని అడ్డుకోవడానికి చర్యలు చేపట్టారు. ఇరాన్ ప్రభుత్వంపై గరిష్ఠ ఒత్తిడి పెంచేలా పెద్ద ఎత్తునే పావులు కదిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకురావడం, ఐరాస ఆంక్షల అమలుకు కూడా పిలుపును ఇచ్చారు. దీంతో ఆ దేశ కరెన్సీ విలువు తగ్గుతూ వస్తోంది. ట్రంప్ తన మొదటి టర్మ్ లోనే ఇరాన్ అణ్వాయుధ తయారీని అడ్డుకోవడమే లక్ష్యంగా తీసుకున్న చర్యలతో..ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. 2015లో ఒక డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 32,000 రియాల్స్‌గా ఉండేది. అయితే గతేడాది ఆ దేశ అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ బాధ్యతలు చేపట్టే సమయానికి దాని విలువ 5,84,000కు చేరుకుంది. గత ఆరు నెలలుగా మరింత కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ దాదాపు 10 లక్షల రియాల్స్‌కు చేరింది.
అమెరికా,భారత్ వాణిజ్య సంబంధాల్లో సర్దుబాట్లు
అమెరికా,భారత్ వాణిజ్య సంబంధాలపై కేంద్ర వాణిజ్యశాఖ సెక్రటరీ సెక్రటరీ సునీల్ భర్త్వాల్ మాట్లాడుతూ.. పరస్పరం ఆమోదయోగ్యమైన వాణిజ్య ఒప్పందం కోసం ఇరుదేశాలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సుంకాల విషయంలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకొని దీర్ఘకాలిక వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసే విధంగా ఇరు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. గత నెలలో అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ కూడా అక్కడ ట్రంప్ తో పాటు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్ - అమెరికా దేశాలు పరస్పరం అంగీకారమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే కుదుర్చుకుంటాయన్నారు.



Click it and Unblock the Notifications











