Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మన దేశంలోని అక్కడ ఒక్క పాము కూడా ఉండదు..ఏ రాష్ట్రమో తెలుసా!
భూ గ్రహం మీద పర్యావరణ వ్యవస్థను కాపాడటంలో పాములు ముఖ్యమైన పోషిస్తాయి. అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోనూ పాములు కనిపిస్తాయి. మహాసముద్రాలు,ఎడారులతో సహా వివిధ వాతావరణాలలో పాములు కనిపిస్తాయి. చాలా పాములు భూగర్భంలో, చెట్ల కొమ్మలపై కూడా కనిపిస్తాయి. అవి వివిధ పరిమాణాలు, రంగులలో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు పాముకాటుతో చనిపోతున్నారు. మనదేశంలో 2001-2020 మధ్య కాలంలో పాముకాటు కారణంగా 12 లక్షల మంది మరణించినట్లు ఓ రిపోర్ట్ చెబుతోంది.
మనదేశంలో పాము జాతులు,మనిషిని చంపగలిగేవి
ప్రపంచవ్యాప్తంగా 3900 కంటే ఎక్కువగా ఉన్న పాము జాతులలో కేవలం 600 మాత్రమే విషపూరితమైనవిగా గుర్తించబడ్డాయి. అయితే ఈ విషపూరిత పాముల్లో కూడా 200 మాత్రమే మానవుడిని చంపగలిగేంత పవర్ కలిగి ఉంటాయి. భారతదేశంలో 350 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. మనదేశంలో ముఖ్యంగా పల్లెటూర్లలోని పొలాల్లో పాములు ఎక్కువగా కనబడుతుంటాయి. చెట్లమీద పుట్లమీద నివసించే వీటికి మనవాళ్లు ఆహారం కూడా పెడుతుంటారు. పొలాల్లో పనికి వెళ్లే రైతులు తమ వెంట తీసుకెళ్లే భోజనం బాక్స్ లో నుంచి కొంత ఆహారాన్ని పాములు,పక్షలు కోసం వదిలిపెడుతుంటారు. అయితే మనదేశంలో అసలు పాములే లేని ప్రదేశం ఒకటుందని మీకు తెలుసా?

ఒక్క పాము కూడా ఉండదు
మనదేశంలోని కేరళ రాష్ట్రం పాములకు స్వర్గధామం. ఎందుకంటే దేశంలోనే అత్యధిక పాములు ఉన్న రాష్ట్రం ఇదే. అయితే అత్యధిక రకాల పాములు కనిపించే రాష్ట్రం కేరళ అయినప్పటికీ..కేరళ రాష్ట్రంలో భాగంగా ఉండే కేంద్రపాలిత ప్రాంతం అయిన లక్షద్వీప్ లో మాత్రం అసలు ఒక్క పాము కూడా ఉండదు. లక్షద్వీప్ భారతదేశం మొత్తంలో 'స్నేక్ ఫ్రీ(snake free)' ప్లేస్ గా గుర్తించబడింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ పాములే కాదు..కుక్కలు కూడా కనిపించవు.
సుముద్రపు ఆవుని చూడొచ్చు
అంతరించిపోతున్న కేటగిరిలో ఉన్న సిరేనియా లేదా 'సముద్రపు ఆవు'ని లక్షద్వీప్ లో చూడవచ్చు. లక్షద్వీప్..మొత్తం 36 చిన్న ద్వీపాలను కలిగి ఉంది. అయితే వీటిలో కేవలం 10 దీవులు మాత్రమే మానవ నివాసయోగ్యమైనవి. లక్షద్వీప్ మొత్తం జనాభా దాదాపు 64,000. 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న లక్షద్వీప్ జనాభాలో 96% మంది ముస్లిం మతానికి చెందినవారు.
చలికాలంలో జాగ్రత్త
చలికాలంలో పాములు చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వెచ్చదనం ఉండే ప్లేస్ ల కోసం వెతుక్కుంటాయి. ఈ క్రమంలో ఇళ్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చలికాలంలో పాము కాటుకు గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో తగిన జాగ్రత్తలు తీసుకొని పాములు ఇళ్లల్లోకి రాకుండా చూసుకోండి.



Click it and Unblock the Notifications