Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రపంచంలో అత్యంత తెలివైనవాళ్లు పుడుతుంది ఏ దేశంలోనో తెలుసా
ఈ రోజుల్లో తెలివితక్కువ వాళ్లు ఏ నూటికో కోటికో ఒకరు ఉంటారు. ఈ కంప్యూటర్ యుగంలో అందరూ మేధావులే. మనిషికి మరణం ఉంటుందికానీ తెలివిలతేటలకు మరణం ఉండదు అంటుంటారు. ఆర్యభట్ట, సర్ సీవీ రామన్, శ్రీనివాస రామానుజన్, అల్బర్ట్ ఐన్ స్టీన్, న్యూటన్, స్టీఫెన్ హాకింగ్ వంటి చాలామంది భౌతికంగా మరణించినా కూడా వారి ఇన్నోవేషన్స్, ఐడియాస్ కారణంగా ఎన్ని శతాబ్దాలు గడిచినా వారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అయితే ప్రపంచంలో ఎక్కువగా తెలివైనవాళ్లు ఏ దేశంలో ఉంటారో తెలుసా?
ఎక్కువమంది మేధావులను అందించే దేశం ఇదే
సాధారణంగా చాలామంది అమెరికా, రష్యా, ఇండియా, చైనా దేశాలలో ఎక్కువమంది మేధావులు ఉంటారని అనుకుంటారు. అయితే ఈ దేశాలేవీ ఎక్కువమంది మేధావులను అందించలేవంట. ఏసియాలోని జపాన్ దేశం అత్యధికమంది మేధావులను ప్రపంచానికి అందిస్తుందని, వీరికి ఐక్యూ ఎక్కువగా ఉంటుందని ఫిన్లాండ్ కి చెందిన విక్ట్కామ్ ఇంక్ అనే సంస్థ బయటపెట్టిన రిపోర్ట్ తెలియజేస్తుంది. ఐక్యూ ఎక్కువ ఉంటే వారిని బాగా తెలివైనవారిగా పరిగణిస్తారు.

జపాన్ వాళ్లకు ఇతర దేశాల వాళ్లతో పోల్చితే అత్యంత క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుందట. జపాన్ టెక్నాలజీ చాలా అడ్వాన్డ్ అని మనం నిరంత చెప్పుకుంటూనే ఉంటాం. అమెరికా, చైనా కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీని జపాన్ కలిగి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతేకాకుండా స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో జపాన్ వాళ్లని మించినవాళ్లు ఉండరని అంటుంటారు. అంతేకాకుండా ఎక్కువకాలం జీవించేవాళ్లలో కూడా జపాన్ వాళ్లు ముందుంటారు. ప్రపంచంలోనే 100 ఏళ్లు పైబడినవాళ్లు ఎక్కువమంది ఉన్న దేశం కూడా ఇదే కావడం విశేషం. అయితే జపాన్ లో గత కొంతకాలంగా జపాన్ తగ్గిపోతున్న నేపథ్యంలో పిలల్ని ఎక్కువమందిని కంటే ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తామని జపాన్ ప్రభుత్వం కూడా ఆఫర్లు ప్రకటిస్తోన్న విషయం తెలిసిందే.
విక్ట్కామ్ ఇంక్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచం మొత్తంలో ఆసియా దేశాల్లోనే ఎక్కువ ఐక్యూ లెవల్స్ ఉన్నవాళ్లు ఉన్నారు. హంగేరీ, ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియాలో కూడా అత్యధిక ఐక్యూ లెవల్స్ కలిటిన వ్యక్తులు ఉన్నారని రిపోర్ట్ తెలిపింది.



Click it and Unblock the Notifications