Latest Updates
-
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్!
మలం దానం చెయ్యండి, కష్టపడకుండా కోటీశ్వరులు అయిపోండి, షరతులు వర్థిస్తాయి
కలుషితం కాని, ఆరోగ్యకరమైన, వ్యాధి నిరోదక సూక్ష్మజీవులు ఉండే వారి నుంచి మలాన్ని ఓ కంపెనీ సేకరిస్తోంది. అలాంటి మలాన్ని దానం చేసే వ్యక్తులకు కంపెనీ కోట్లాది రూపాయలు చెల్లించడానికి సిద్దం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఒక్క శాంపిల్ కు సుమారు రూ. 41,000 ఇవ్వడానికి ఆ కంపెనీ సిద్దం అయ్యింది. రోజూ మల విసర్జన దానం చేసే వాళ్లకు కోట్లాది రూపాయలు ఇస్తామని ఆ కంపెనీ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
అమెరికా, కెనడాలో పని చేస్తున్న హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ ప్రపంచంలోని ఏ వ్యక్తి నుంచి అయిన మలం సేకరించడానికి సిద్దం అయ్యింది. వైద్యపరిశోదనలు, ముఖ్యమైన ప్రయోగాల కోసం మనుషుల మలాన్ని పరీక్షించాలని హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ ప్రయత్నిస్తున్నది. మలం దానం చేసే వాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని, మీ మలం మీరు ఫ్రీగా మాకు ఇవ్వనవసరం లేదని హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ తెలిపింది.

మేము అనుకున్న మలం మాకు చిక్కితే మీరు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నామని హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ ప్రకటించింది. మీరు మలవిసర్జన నమూనాలకు మాకు పంపించాలని ఆ కంపెనీ వెబ్ సైట్ లో మనవి చేసింది. అయితే ఆ కంపెనీ ఎంపిక చేసిన వారికి మాత్రమే నగదు చెల్లిస్తారు. ఎవరి మలం అయినా కంపెనీ ఎంపిక చేస్తే వాళ్లు కోటీశ్వరులు అయిపోవడం కచ్చితంగా జరుగుతుంది.
మలం పనికిరాదు అని అందరూ అనుకుంటారు. మలంకు ఇంత విలువ ఉందా అని ఇప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రత్యేక మైన బ్యాక్టీరియా ఉండే మలం కోంస హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ వందలు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చెయ్యడానికి సిద్దం అయ్యింది. మలంతో ప్రయోగాలు చేసి అనుకున్నది సాధించాలని ఆ కంపెనీ కోరుకుంటున్న బ్యాక్టీరియా ఉన్న మలం కోసం ప్రపంచం మొత్తం వెతుకుతోంది
పేగుల్లో ఉండే ఒకే రకమైన సూక్ష్మజీవులు ఉండే వారి నుంచి మలాన్ని సేకరిస్తున్న ఆ కంపెనీ ఆ మలంతో ప్రయోగాలు చేస్తోంది. సాదారణంగా పేగుల్లో వేలాది రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రైయిన్స్ ఉంటాయి. ఇలాంటివి పలు వ్యాధులకు రావడానికి కారణం అవుతాయి. గట్ బ్యాక్టీరియాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశంపై హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు.
ఇలాంటి ప్రయోగాలు చెయ్యడానికే హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ మానవులు మలాన్ని కోట్లాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేసి ప్రయోగాలు చేస్తోంది. ఒకసారి మలాన్ని దానం చేసే వారికి 500 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 41,000, ఏడాది పొడవునా ప్రతిరోజూ మల విసర్జన చేస్తే 180.000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 1.40 కోట్లు ఇవ్వడానికి హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ సిద్దం అయ్యింది.
ఒక వేళ ఆ సంస్థకు కావలసిన మలం చిక్కితే మాత్రం ఆ మలం దానం చేస్తున్న వ్యక్తులే ఎంత డబ్బు కావాలో డిమాండ్ చేసుకోవచ్చు అని ఆ కంపెనీ వారి అధికారిక వెబ్ సైట్ లో సమాచారం ఇచ్చింది. మొత్తం మీద ఆ కంపెనీకి కావలసిన మలం దానం చేసే వాళ్లు మాత్రం కోటీశ్వరులు అయిపోతారని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరికీ పనికిరాని మలం ఆ కంపెనీ కొనుగోలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మలం దానం చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆ కంపెనీ హామీ ఇచ్చింది.



Click it and Unblock the Notifications