Latest Updates
-
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
భారత్ కు రావొద్దు జీవితం మారిపోతుంది..అమెరికా టూరిస్ట్ వీడియో వైరల్..సూపర్ అంటున్న నెటిజన్లు
ఇండియాకు వెళ్లవద్దంటూ ఓ అమెరికా టూరిస్ట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ రీల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. క్రిస్టేస్ ఫిష్కేర్ అనే అమెరికా టూరిస్ట్ జూన్ 15న తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్లు ఈ వీడియోకు వస్తున్నాయి. అయితే నెటిజన్లు అంతపెద్దగా ఈ వీడియోపై ఎందుకు స్పందిస్తున్నారు? భారత్ కు వెళ్లవద్దని క్రిస్టేన్ ఎందుకు సూచించిందో వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
అమెరికాలోని కొలరాడోకు చెందిన క్రిస్టేన్ ఫిస్కేర్ గత కొన్నాళ్లుగా తన భర్త,నలుగురు పిల్లలతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారు. స్కై ఫిష్ డెవలప్ మెంట్ అనే పేరుతో వీరు ఓ ఐటీ కంపెనీ రన్ చేస్తున్నారు. అయితే జూన్ 15న క్రిస్టేన్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ రీల్ చేశారు. "నా మాట వినండి.. భారతదేశానికి వెళ్లకండి ఎందుకంటే అది మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. మీరు అద్భుతమైన వ్యక్తులను కలుస్తారు, కొన్ని అద్భుతమైన ఫుడ్స్ ని తింటారు కొన్ని అద్భుతమైన దృశ్యాలను చూస్తారు.. ఇంత గొప్ప సంస్కృతి, చరిత్రను అనుభవిస్తారు. మీరు ఎప్పటికీ తిరిగి వెళ్లాలని అనుకోకపోవచ్చు. భారతదేశం ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది.. అది మీ హృదయాన్ని కూడా తీసుకోవచ్చు. ఎంత అందమైన, జీవితాన్ని మార్చే ప్రదేశం. ఇక్కడ ఉండటం చాలా ఇష్టం. నేను నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాను వెనక్కి తిరిగి చూడలేదు" అని రాసి ఓ లవ్ సింబల్ తో ఆమె తన రీల్ ని షేర్ చేసింది.

భారతదేశానికి వెళ్లవద్దు అని క్యాప్షన్ లో ఉపయోగిస్తూ దానికి విరుద్ధంగా అర్థం చెప్పడానికి ప్రయత్నించడం ద్వారా రివర్స్ సైకాలజీని ఉపయోగించంది. ఇది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం..నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తిరిగి వెళ్ళిపోవాలని అనుకోలేదు అని మరొక ఫారిన్ టూరిట్ కామెంట్ చేయగా..భారత్ అన్నా,భారత ప్రజలు అన్నా తనకు చాలా ప్రేమ అని మరో ఫారిన్ టూరిస్ట్ కామెంట్ చేశారు.
2018లో మొదటిసారి భారత్ ను సందర్శించానని,3 నెలలు ఇండియాలో ఉండి తిరిగెళ్లిపోతుంటే నాకు ఏడుపొచ్చిందంటూ మరో విదేశీ టూరిస్ట్ కామెంట్ చేశారు. 2019లో కేరళలో ఓ ప్లేస్ కొనుగోలు చేసి 2021 నుంచి భారత్ లోనే నివాసం ఉంటున్నట్లు తెలిపారు.
మరో వీడియోలో ఇలా
అయితే ఇండియా గురించి జూన్ 22న క్రిస్టేస్ ఫిష్కేర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన మరో వీడియో కూడా వైరల్ గా మారింది. అమెరికాలో సగటు జీవితం గడపడం కంటే భారత్ లో అసాధారణ జీవితాన్ని గడపడాన్నే తాను ఎంచుకున్నట్లు క్రిస్టేన్ తెలిపారు. తాము 4 సంవత్సరాల క్రితం తమ కుటుంబంలో భారతదేశానికి తరలివచ్చామని, దాని గురించి కొంచెం కూడా చింతించలేదుని ఆమె రాసింది. గత 4 సంవత్సరాలలో తాను కొంతమంది అద్భుతమైన వ్యక్తులను కలిసినట్ల, కొన్ని అద్భుతమైన ప్రదేశాలను చూసినట్లు ఆమె చెప్పారు. భారతదేశం తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిందని ఆమె తెలిపారు.



Click it and Unblock the Notifications
