Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
భూమిపై నేరుగా నరకానికి వెళ్లే దారులు ఇవే.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాలు!
ఈ భూ ప్రపంచం అంతా రహస్యాలతో నిండి ఉంటుంది. ఎన్నో అద్భుతమై వింతలు, విశేషాలు, శక్తులు ఈ భూమిపై దాగి ఉన్నాయి. ఎన్నో రహస్యాలు నెలవైన ఈ భూమిపై కొన్ని ప్రదేశాలు శాస్త్రవేత్తలకు సైతం మిస్టరీగానే మిగిలాయి. ఆ ప్రదేశాలను నరకానికి ద్వారాలుగా చెబుతుంటారు. ఆయా ప్రదేశాలకు వెళ్తే కచ్చితంగా మరణిస్తారని చెబుతుంటారు. ఇంతకీ ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయి? వాటికి నరకానికి దారులు అని ఎందుకు పేరొచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గెహెన్నా
పురాతన జెరూసలెంలో గెహెన్నా అనే లోయ ఉంది. ఈ లోయను నరకానికి ద్వారంగా చెప్పుకుంటారు. ఎందుకంటే పురాతన కాలంలో అమ్మోనైట్ మతస్థుల దేవుడైన మోలోచ్‌ను శాంతింపజేయడానికి పసి పిల్లలను బలి ఇచ్చేవారట. అలాగే గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగని వారి ఆత్మలను ఇందులో పడేసేవారని చెబుతుంటారు. అందుకే ఈ ప్రదేశంలో ఎవరు వెళ్లినా చనిపోతారని పేర్కొంటుంటారు. అందుకే దీనిని నరకానికి ద్వారంగా పిలుస్తున్నారు.

ప్లూటోస్ గేట్
టర్కీలోని పురాతన నగరమైన హిరాపోలీస్‌లో ప్లూటోస్ గేట్ అనే ఒక గుహ ఉండేది. ఈ గుహను ఇప్పటికీ నరకానికి ద్వారంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ గుహలోకి ఎవరు ప్రవేశించినా క్షణాల్లోనే చనిపోతారట. ఇది ఒక రకమైన గ్యాస్ ఛాంబర్. దీనిని నరకానికి దారి అని చెబుతుంటారు.
హెక్లా అగ్ని పర్వతం
ఐస్‌లాండ్‌లో ఓ అగ్ని పర్వతం ఉంటుంది. దానిని కూడా నరకానికి ద్వారాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఎందుకంటే 1104వ సంవత్సరంలో ఇది విస్ఫోటనం చెందింది. ఆ విస్ఫోటనం కారణంగా భారీగా నష్టం వాటిల్లింది. మొత్తం ఐస్‌లాండ్ సగభాగం మొత్తాన్ని బూడిద, రాళ్లతో నింపేసింది. దీంతో పాటు భారీగా మనుషులు చనిపోయారు. అప్పటి నుంచి దీనిని నాకారానికి ద్వారంగా చెప్పుకుంటున్నారు.
రాతి సమాధి
బెలిజ్‌లో ఓ రాతి సమాధి ఉంది. దానిని 'కేవ్ ఆఫ్ స్టోన్ సమాధి' అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ చాలా మంది మృత దేహాలు కనుగొనబడ్డాయి. నాలుగు సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చనిపోయి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న అస్థిపంజరాలు దర్శనమిచ్చాయి. అప్పటి నుంచి ఈ ప్రదేశం చాలా భయానకంగా ఉందని, నాకారానికి ఇదే ద్వారమని ప్రసిద్ధి చెందింది.
సెయింట్ పాట్రిక్స్
ఐర్లాండ్‌లోని లాగ్ డుగ్నే వద్ద ఉన్న పవిత్రమైన మతస్థలమే సెయింట్ పాట్రిక్స్. పురాతన కాలంలో ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి తమ పాపాలు కడుక్కునే వారని చెబుతుంటారు. తమ పాపాలను పోగొట్టుకోవడానికి ఆ ప్రదేశంలో కఠినమైన శిక్షలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, నరకంలో ఉండే అన్ని శిక్షలు వీరికి విధించేవారని చెబుతుంటారు. అందుకే దీనిని నరకానికి ద్వారంగా చెప్పుకుంటారు.



Click it and Unblock the Notifications
