Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
బర్గర్‌ను నోరు బాగా తెరిచి తింటున్నారా.. ఈ ట్రిక్స్‌తో ఈజీగా తినేస్తారు.!
పిల్లల నుంచి పెద్దల వరకు బర్గర్‌ను ఇష్టంగా తింటుంటారు. చీజ్, వెజ్, నాన్ వెజ్, ఎగ్, పనీర్ ఇలా పలు రకాల బర్గర్‌లను వారి అభిరుచికి అనుగుణంగా లైక్ చేస్తుంటారు. అయితే వాటిని తినడం ఒక సవాల్ అనే చెప్పవచ్చు. బర్గర్ తరచూ తింటూ ఉన్నా.. తిన్న ప్రతిసారీ లోపలి స్టఫ్ బయటకి పడిపోవడం లేదా బర్గర్ విరిగిపోవడం వంటివి జరుగుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి చెఫ్స్ కొన్ని టిప్స్ చెబుతున్నారు.

చాలా మందికి బర్గర్‌ను ఎలా తినాలో తెలియదు. బర్గర్ తినేటప్పుడు నోరు బాగా తెరిచి తినాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు సాఫ్ట్ బన్‌ల మధ్య ఇంచు మందంలో స్టఫ్ పెట్టడం వల్ల ఎత్తుగా ఉండటంతో నోరు ఎక్కువగా తెరవాలి. దీంతో నలుగురిలో తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగానూ అనిపిస్తుంది. ఇంకా మధ్యమధ్యలో లోపలి చీజ్, స్టఫ్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది ఇంకా అసౌకర్యంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇకపై ఇలా జరగకుండా బర్గర్‌ను కంప్లీట్‌గా నీట్‌గా ఎంజాయ్ చేయాలంటే చెఫ్స్ కొన్ని టిప్స్ చెబుతున్నారు.
బర్గర్‌ను సరైన పద్ధతిలో తింటే దాని టేస్ట్‌తో పాటు ప్రతి బైట్‌ను ఎంజాయ్ చేయొచ్చని చెఫ్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో బర్గర్‌ను ముందు సరిగా పట్టుకోవడం, ఈజీ ట్రిక్స్ పాటించడం అవసరం. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బర్గర్‌ను కట్ చేసి తినడం
బర్గర్ రౌండ్‌గా ఉంటుందని తెలిసిందే. దీని వల్ల దానికి చివరలు ఉండకపోవడంతో తినేటప్పుడు నోటికి అటూ ఇటూ అంటుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ పరిష్కారం అయ్యేందుకు బర్గర్‌ను ముందుగా రెండు భాగాలుగా కత్తిరిస్తే ఈజీగా ఉంటుంది. ఫోర్క్, చాకు సాయంతో బర్గర్‌ను రెండు సమభాగాలుగా చేయడం ద్వారా తినేటప్పుడు సౌకర్యంగా ఉంటుంది.
వేళ్లతో పట్టుకోవడం…
చాలా మందికి బర్గర్‌ను ఎలా పట్టకోవాలో తెలియదు. దీంతో బర్గర్‌పై ఒత్తిడి పెరిగి తినేటప్పుడు చీజ్ కారిపోతుంది. అందులోని కూరగాయ ముక్కలు బయటకు వచ్చేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ముందుగా బర్గర్‌ను తలకిందులుగా చేయాలి. తర్వాత చేతి మూడు వేళ్లను పైన వైపు, మిగతా రెండు వేళ్ల(బొటనవేలు, చిటికిన వేలు)ను కింది వైపు పట్టుకోవాలి. ఇలా రెండు చేతులతో బర్గర్‌ను పట్టుకోవాలి. దీంతో స్టఫ్ బయటకు రాకుండా ప్రతి బైట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
ఇలా చేయడం ద్వారా బర్గర్ విడిపోకుండా ఉంటుంది. అంతే కాకుండా నోటిని బాగా వెడల్పుగా తెరవాల్సిన పని కూడా ఉండదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తినడం ద్వారా పెదవులకి అటూ ఇటూ అంటకుండా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇకపై బర్గర్ తినేటప్పుడు ఈ టిప్స్ ట్రై చేసి ప్రతి బైట్‌ను ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications
