Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Vizag Street Foods: హలో ఫుడ్ లవర్స్! వైజాగ్‌కు వెళ్తే ఈ స్ట్రీట్ ఫుడ్స్ తినకుండా అస్సలే రావొద్దు
ఎన్ని హోటల్లు, రెస్టారెంట్లు ఉన్నా.. రోడ్డు పక్కన తోపుడు బండిపై దొరికే బజ్జీ టేస్టు ఎక్కడా దొరకదు. ఇప్పుడు వైజాగ్ లో దొరికే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ ఏంటో.. అవి ఎక్కడెక్కడ దొరుకుతాయో ఓ లుక్కేద్దాం.
మన తెలుగోళ్లు ఆహార ప్రియులు. మంచి రుచికర ఆహారం కోసం ఎంత దూరమైనా వెళ్లిపోతారు. మన వైజాగ్ విషయానికే వస్తే..
ఇక్కడ తినడానికి ఎన్నో రకలా వెరైటీలు లభిస్తాయి. వందల కొద్దీ కేఫ్ లు, రెస్టారెంట్లు, హోటళ్లు, మల్టీ క్యూజిన్లు.. అందులో రకరకాల వంటకాలు లభిస్తాయి.

ఎన్ని హోటల్లు, రెస్టారెంట్లు ఉన్నా.. రోడ్డు పక్కన తోపుడు బండిపై దొరికే బజ్జీ టేస్టు ఎక్కడా దొరకదు. స్ట్రీట్ ఫుడ్స్ అంటేనే నాలుక లాగేస్తుంది చాలా మందికి. దాని రుచి అమోఘం. ఇంట్లో అన్ని రకాల పదార్థాలు వేసి ఎంత పర్ఫెక్ట్ గా చేద్దామనుకున్నా ఆ టేస్టు మాత్రం రాదు. ఇప్పుడు వైజాగ్ లో దొరికే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ ఏంటో.. అవి ఎక్కడెక్కడ దొరుకుతాయో ఓ లుక్కేద్దాం.
గోదావరి స్పెషల్ భజ్జీ & మిక్చ్సర్స్:
వైజాగ్ లో మాత్రమే కాదు ఎక్కడైనా సరే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అంటే మొదట గుర్తుకు వచ్చేది మిర్చి భజ్జీ. వైజాగ్ చిన్న వాల్తేరు రోడ్డులో కోటక్ సలేసియన్ స్కూల్ సమీపంలో గోదావరి స్పెషల్ భజ్జీ & మిక్చ్సర్స్ ఉంటుంది. ఇక్కడ రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి.
ఒక్కో ఆహార పదార్థం టేస్టు అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి భజ్జీలు ఉల్లిపాయతో కలిపి తింటే ఆహా అనిపించాల్సిందే. ఇక్కడ టొమాటో భజ్జీ, వంకాయ భజ్జీ, ఎగ్ భజ్జీ కూడా చాలా ఫేమస్
ఫైవ్ ఫ్లేవర్స్ పానీ పూరీ:
పానీ పూరీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం అయిందంటే చాలు అమ్మాయిలు ఎగబడి తింటుంటారు పానీ పూరీ. ఆలూ మిక్స్ తో కరకరలాడే గోల్ గప్పా, చిక్కని పానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. వైజాగ్ లోని లాసన్స్ బే కాలనీలో ఈ స్టాల్ ఉంటుంది.
హాట్ పానీ పూరీ:
టీటీడీ కళ్యాణమండపం, ఎంవీపీ కాలనీకి సమీపంలో ఉన్న ఈ స్టాల్ వద్ద నోరూరించే పానీ పూరీలు తినవచ్చు. ఇక్కడి పానీ పూరీలు అంటే చాలా మందికి ఫేవరెట్. మీరు వెళ్లాలనుకుంటే మాత్రం లైన్ లో నిల్చొవాల్సి రావొచ్చు గుర్తుంచుకోండి.
ఆలూ పకోడీ:
ఎంవీపీ కాలనీలో లెన్స్ కార్ట్ ఆపోజిట్ లో ఉంటుంది ఈ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పాయింట్. ఇక్కడ దొరికే క్రిస్పీ, గోల్డెన్ ఆలూ పకోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ఈ స్టాల్ వద్ద పకోడీ ఘుమఘుమలు కుదురుగా నిల్చోనివ్వవు. ఇక్కడ మిర్చీ భజ్జీలు, పునుగులు కూడా చాలా రుచిగా ఉంటాయి. చిక్కటి చట్నీ తో నంచుకు తింటే అద్భుతః అనాల్సిందే.
చికెన్ 555:
ఆర్కే బీచ్ సైడ్ లేన్ లో ఉంటుంది చికెన్ 555. టీ టైమ్ స్నాక్స్ కు ఫేమస్ పాయింట్ ఇది. చికెన్ 555 లో చికెన్ స్ట్రిప్స్ ను డీప్ ఫ్రై చేసి, వాటిని సాస్ లలో వేయించి తయారు చేస్తారు. ఈ సిగ్నేచర్ డిష్ మాత్రమే కాకుండా ఇక్కడ ఫ్రైడ్ రైస్, మంచూరియా కూడా అద్భుతంగా ఉంటాయి. మీరూ ఒకసారి టేస్టు చూడండి.



Click it and Unblock the Notifications
