Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Manmohan singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..ఆఫీసులు,విద్యాసంస్థలకు నేడు సెలవు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని తన ఇంట్లోనే కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. వెంటనే ఎయిమ్స్ డాక్టర్లు ఆయనని అత్యవసర సేవా విభాగానికి తరలించి ట్రీట్మెంట్ అందిచినా ఫలితం లేకుండా పోయింది. హాస్పిటల్ కి వెళ్లిన కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు వైద్య అధికారులు తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని,వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా తెలంగాణలో ఇవాళ సెలవు దినంగా ప్రకటించారు.

ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇవాళ సెలవు దినంతో పాటుగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ నెల 25న క్రిస్మస్ కావడంతో సెలవు దినంగా,అలాగే 26న కూడా సెలవు ప్రకటించారు. ఇప్పుడు శుక్రవారం సెలవు ప్రకటించారు.
మన్మోహన్ సింగ్ ప్రస్తానం సాగిందిలా
1932 సెప్టెంబర్ 26నప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్.. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. 1972-76 ఆర్థికశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 1998-2004 మధ్యకాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా భారత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు నెలకొల్పారు. ప్రధానిగా రోజూ 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్తాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.



Click it and Unblock the Notifications