Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
Playboy Cover Page: ప్లేబాయ్ కవర్ పేజీపై ఫ్రాన్స్ మంత్రి హాట్ ఫోజులు
ప్లేబాయ్ మ్యాగజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషుల కోసం ఉద్దేశించబడిన ఈ మ్యాగజైన్ లో శృంగారం గురించి, ఆడవారి గురించి ఉంటుంది. ఇందులో వచ్చే కంటెంట్ కూడా పెద్దవారికి మాత్రమే అనేలా ఉంటుంది. ఇందులో ప్రచురించే ఫోటోలు శృంగారభరితంగా ఉంటాయి.
ఈ అమెరికన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫ్రాన్స్ మహిళా మంత్రి మర్లీన్ షియప్పా ఫోటో రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కవర్ ఇమేజ్‌లో మంత్రి మర్లీన్ బోల్డ్‌గా ఉండటం పట్ల ఫ్రాన్స్ లో దుమారం చెలరేగుతోంది.

కవర్ పేజీపై ఫోటో మాత్రమే కాదు..:
ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోటోన్ కాదు.. ఆ పత్రికకు ఆమె 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఫ్రాన్స్ మంత్రి మర్లీన్ షియప్పా. మహిళలు, గే, అబార్షన్ హక్కుల గురించి ఆ ఇంటర్వ్యూలో మర్లీన్ చాలా విషయాలు మాట్లాడారు. ఆడవాళ్ల తమ శరీరాలతో ఏమైనా చేయవచ్చని, అది వారి హక్కు అని దానిని తాను సమర్థిస్తున్నా అని ఆమె అందులో చెప్పారు.
ఫ్రాన్స్ లో మహిళలు చాలా స్వేచ్ఛగా ఉంటారని, అది కొంత మందికి ఇబ్బందిగా అనిపించినా అందులో ఏమాత్రం మార్పు రాబోదని తెలిపారు. మహిళలు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నారు మర్లీన్. వారు ఏం కావాలనుకుంటే అది ఎక్కడైనా చేసే విధంగా ఉండాలని, తిరోగమనవాదులు, ఆత్మవంచకులు ఎంత విసిగించినా, ఫ్రాన్స్ మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
మర్లీన్ షియప్పా గురించి:
ఫెమినిస్టు మంత్రి మర్లీన్ షియప్పా వయస్సు 40 ఏళ్లు. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుండి మంత్రిగా చేస్తున్నారు. అయితే మాక్రన్ సర్కారు మంత్రిగా చేరిన తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్నారు.
పిలిచి మందలించిన ఫ్రాన్స్ ప్రధాని!:
ప్లేబాయ్ కవర్ పేజీపై మంత్రి మర్లీన్ షియప్పా కనిపించడం అది కాస్త వివాదం కావడంతో ఫ్రాన్స్ ప్రధాని ఎలిసాబెత్ బోర్నే.. మార్లీనెను పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉండటం, తినడానికి తిండిలేకపోవడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో మంత్రి మర్లీన్ ఇలాంటి ఫోటోలతో వివాదాన్ని రాజేయడంపై సొంత పార్టీ నుండే విమర్శలు వస్తున్నాయి.
స్త్రీవాద మంత్రి మర్లీన్ షియప్పా ప్రవర్తను ప్రస్తుత పరిస్థితికి ఏమంత మంచిది కాదని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా అంటున్నట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
దుస్తులు వేసుకునే ఉన్నా కదా:
ప్లేబాయ్ కవర్ పేజీపై తన ఫోటో రావడం అది కాస్త వివాదాస్పదం కావడంపై మర్లీన్ షియప్పా స్పందించారు. ఫోటో షూట్ కోసం తాను దుస్తులు ధరించే ఉన్నానని అన్నారు. మహిళలకు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలని మర్లీన్ అన్నారు. వారు ఏం కావాలనుకుంటే అది ఎక్కడైనా చేసేట్లు ఉండాలని చెప్పారు. ఫ్రాన్స్ లో మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications
