Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఒకప్పుడు ఆటో డ్రైవర్..నేడు వందల కోట్లు, ప్రపంచంలోనే ఖరీదైన కారుకి ఓనర్..ఎలా సాధ్యమైందంటే..
నేను అలా అవ్వాలి..ఇలా అవ్వాలి అని అందరూ కలలు కంటారు. అయితే వాటిని నిజం చేసుకునేది కొందరే. నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షతో తమ కలలను సాకారం చేసుకుకుంటారు కొందరు. అలాంటి కొందరిలో సత్యశంకర్ ఒకరు. పుట్టింది పేదరికంలో..పొట్ట కూటి కోసం ఆటో డ్రైవర్ గా మారాడు. కష్టపడటమే తెలిసిన విద్య. వీధి వీధి తిరుగుతూ ఆటో సార్..ఆటో మేడమ్ అని పిలుస్తుండేవాడు. ఆటో నడుపుతున్నా తనలోనే కలలను చంపుకోలేదు.
ఆటో నడుపుతూ రూపాయి రూపాయి కూడబెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు వందల కోట్లకు అధిపతి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో తిరుగుతున్నాడు. ఎంతటి కష్టమైనా పడటానికి సిద్దంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించాడు సత్య శంకర్. ఒక సాధారణ ఆటో డ్రైవర్ వందల కోట్లు ఎలా సంపాదించాడు, ఆటో డ్రైవర్ నుంచి రోల్స్ రాయిస్ కి ఓనర్ అయ్యేదాకా అతని ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.

ఆటో డ్రైవర్ టు అంబాసిడర్ ఓనర్
కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూరు సిటీలో వ్యవసాయ కుటుంబంలో సత్యశంకర్ జన్మించారు. తండ్రి వ్యవసాయం చేసేవాడు. అయితే ఆర్థిక పరిస్థితి చాలా దారుణం. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక డబ్బులు లేకపోవడంతో కాలేజీకి వెళ్లి చదువుకోలేకపోయాడు సత్య శంకర్. కుటుంబ పోషణ కోసం బ్యాంక్ లోన్ తీసుకొని ఆటో కొన్నాడు. 1980లలో బెంగళూరు వీధుల్లో ఆటో నడుపుతూ తన జీవిత ప్రస్థానాన్ని సత్య శంకర్ ప్రారంభించారు. అయితే పేదరికరం తనని చుట్టుముట్టినా ఉన్నతమైన జీవితాన్ని గడపాలనే తపన మాత్రం సత్య శంకర్ గుండెల్లో రగులుతూనే ఉంది. రాత్రింబవళ్లు కష్టపడి ఆటో నడపగా వచ్చిన డబ్బులను కొంచెం ఇంటికి పంపుతూ కుటుంబానికి సాయంగా నిలుస్తూనే..మరోవైపు తన ఆటో మీద తీసుకున్న లోన్ ని తీర్చేయగలిగాడు. ఆ తర్వాత ఒక పాత అంబాసిడర్ కారు కొన్నాడు. సత్యశంకర్ తన విజయపథంలో వేసిన తొలి ముందడుగు ఇదే.
వ్యాపారంవైపు అడుగులు
కాలం గడుస్తున్న కొద్దీ వ్యాపారరంగంపై సత్యశంకర్ దృష్టి పెట్టాడు. 1987లో ఆటో పార్ట్స్ బిజినెస్ ప్రారంభించాడు సత్య శంకర్. ఆటోమెబైల్ గ్యారేజీలో టైర్లు అమ్మడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మరో చిన్న వ్యాపారం చేశాడు. 1994లో ప్రవీణ్ క్యాపిటల్ అనే పేరుతో ఆటో ఫినాన్స్ బిజినెస్ ప్రారంభించాడు. 2000లో SG కార్పొరేట్స్ అనే కంపెనీని ప్రారంభించాడు. బిందూ మినరల్ వాటర్ పేరుతో మినరల్ వాటర్ ని అమ్మేవాడు. 2002లో ఈ సంస్థ నుంచి వచ్చిన 'బిందూ ఫిజ్ జీరా మసాలా(Bindu Fizz Jeera Masala)' సోడా సూపర్ హిట్ అయింది. కొద్ది రోజుల్లోనే దేశంలో నెంబర్ 1 జీరా డ్రింక్ గా అది మారిపోయింది. అనతికాలంలోనే సత్య శంకర్ వ్యాపారం ఊహించని విధంగా వృద్ధి చెందింది.
ఇప్పుడు ఆయన రేంజ్ ఇది
ప్రస్తుతం సత్యశంకర్ స్థాపించిన SG గ్రూప్..పుత్తూరు కేంద్రంగా అనేక రంగాల్లో విస్తరించింది.. ఆటో ఫైనాన్స్, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్, ఫుడ్, డ్రింక్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఫ్రూట్స్ ప్రాసెసింగ్ వంటి విభిన్న రంగాల్లో SG కార్పొరేట్స్ కంపెనీ తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక టర్నోవర్ రూ.800 కోట్ల వరకు ఉంది. ఒకప్పుడు ఆటో నడిపిన సత్య శంకర్ ఇప్పుడు రూ.11 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో తిరుగుతున్నారు. ఈ కారు సత్యశంకర్ కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిందని సమాచారం.



Click it and Unblock the Notifications