Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కోట్ల వ్యాపారం వదిలి రోడ్ల మీద..శివ భక్తుడిగా మారిన జపాన్ కోటీశ్వరుడు..ఉత్తరాఖండ్ లో గత జన్మ రహస్యం!
జపాన్ లో పెద్ద వ్యాపారవేత్త..ఓ సారి ఇండియాకు వచ్చాడు..తమిళనాడు టూర్ లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న సమయంలో వేల ఏళ్ల క్రితం సిద్ధులు రచించిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా భవిష్యత్తు చెప్పబడే నాడీ జ్యోతిష్యం తారసడపడింది. ఓ జ్యోతిష్యుడిని కలిసాడు.. ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయాడు..తిరిగి జపాన్ పోయాడు..కోట్ల రూపాయల ఆస్తులన్నీ వదిలేసి ఇప్పుడు మళ్లీ ఇండియాకి వచ్చేసి కాషాయ వస్త్రాలు ధరించి శివ భక్తుడిగా మారిపోయాడు. అసలు అతను ఎవరు,జ్యోతిష్యుడు అతనికి ఏం చెప్పాడు..ఇండియాకు వచ్చి శివ భక్తుడుగా మారి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాడో పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
జపాన్ కి చెందిన హోషి టకాయుకి(41)తన 20 ఏళ్ల వయస్సులో ఓ సారి ఇండియా టూర్ కి వచ్చాడు. మొదటి నుంచి టకాయుకి భారతీయ సంప్రదాయాలు అన్నా భారతీయులు అన్నా ఇష్టం. ఇక్కడి గుళ్లు గోపురాలు అంటే ఆయనకు చాలా విశ్వాసం ఉండేది. అలా ఇండియా పర్యటనలో భాగంగా తమిళనాడులో పలు ఆలయాలను సందర్శించాడు. ఈ క్రమంలో అక్కడ ఓ జ్యోతిష్యుడుని కలిశాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు..నువ్వు గత జన్మలో హిమాలయాల్లో జీవించావు..హిందూ ఆధ్యాత్మికాన్ని ఫాలో అవడమే నీ గమ్యం అని టకాయుకికి చెప్పాడు. అదంతా విన్న టకాయుకి ఫస్ట్ షాక్ అయ్యాడు.

తన పర్యటన ముగిసిన తర్వాత తిరిగి జపాన్ వెళ్లాడు. టోక్యోలో పెద్ద వ్యాపారమే చేశాడు. టకాయుకికి టోక్యోలోనే 15 బ్యూటీ ప్రొడక్ట్ స్టోర్ ఉండేవి..ఇవన్నీ మంచి లాభాల్లో ఉన్నవే. అయితే జపాన్ వెళ్లిన కొన్నాళ్లకి టకాయుకికి ఓ కల వచ్చిందట. పూర్వజన్మలో ఉత్తరాఖండ్ లో నివసించినట్లు టకాయుకికి కలలో కనబడిందట. ఇక ఆ తర్వాత ఆయన ఓ నిర్ణయానికి వచ్చేశాడు. భారత్ వెళ్లి ఆధ్మాత్మిక జీవితాన్ని గడపాలని,తాను పూర్వజన్మలో నివసించిన ప్లేస్ లో ఇప్పుడు కూడా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
కొన్నేళ్ల క్రితం టోక్యోలోని తను ఉండే ఇంటిని పూర్తిస్థాయి శివుడి ఆలయంగా మార్చేశాడు.. మరో గుడిని కూడా నిర్మించాడు. తన పేరు కూడా బాల కుంభ గురుమునిగా మార్చేసుకున్నాడు. తన వ్యాపారాన్ని తన ఫాలోవర్స్ కి అప్పజెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది జులైలో ఇండియాకు తిరిగొచ్చిన టకాయుకి ఇటీవల కన్వర్ యాత్ర సందర్భంగా కాషాయ వస్త్రాలు ధరించి గంగాజలం పట్టుకొని తన 20 మంది అనుచరులతో కలిసి పాదయాత్ర చేశాడు. యాత్రలో భాగంగా కన్వారియాస్ కి డెహ్రాడూన్ లో 2 రోజుల పాటు ఫుడ్ క్యాంప్ కూడా నిర్వహించాడు.
తమిళనాడులోని పాండిచ్చేరిలో టకాయుకి 35 ఎకరాల ల్యాండ్ కొన్నట్లు ఆయన ఫ్రెండ్ ఒకరు చెప్పారు. అక్కడ పెద్ద శివాలయం కట్టాలనుకుంటున్నాడట. ఉత్తరాఖండ్ లో కూడా త్వరలో ఓ ఆశ్రమం నిర్మించాలని టకాయుకి ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్ కి తాను బాగా అటాచ్ అయిపోయానని,గత జన్మ తాలుకూ ఆనవాళ్లను వెతికే పనిలో ఉన్నట్లు టకాయుకి చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
