ఒకప్పుడు రోడ్లపై బెలూన్స్ అమ్మేవాడు..తర్వాత దేశాన్నే కొనేంత సంపాదించాడు..రియల్ సక్సెస్ అంటే ఇదే

నీ కోరిక బలమైనది,నిజాయితీతో కూడినది అయితే అది ఖచ్చింగా నెరవేరుతుంది,ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది అని మన పెద్దలు తరుచూ చెబుతుంటారు. తనలోనే ఓ బలమైన కోరిక ఉంచుకొని పరిస్థితులు తనకు అనుకూలంగా లేకున్నా వాటిని అనుకూలంగా మర్చుకుంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినవాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్లలో మాప్పిళ్లై ఒకరు. ఒకప్పుడు రోడ్ల మీద బెలూన్స్ అమ్మిన మాప్పిళ్లై..ఆ తర్వాత వేల కోట్లు సంపాదించడమే కాకుండా ఆయన పెట్టిన కంపెనీ వినని,తెలియని ఇళ్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు.

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

1922లో కేరళ రాష్ట్రంలో సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో కే మమ్మన్ మాప్పిళ్లై(K.M. Mammen Mappillai)జన్మించారు. వీరి కుటుంబం అప్పట్లో ఓ న్యూస్ పేపర్, ఓ బ్యాంక్ ని కూడా రన్ చేసేది. అయితే హాయిగా సాగిపోతున్న వ్యాపారం తల్లకిందులైంది. బ్యాంకు,న్యూస్ పేపర్ ని అప్పటి ట్రావెన్ కోర్ రాజ్య అధికారులు సీజ్ చేశారు. మాప్పిళ్లై తండ్రిని రెండేళ్లు జైళ్లో పెట్టారు. ఆ సమయంలో మాప్పిళ్లై చెన్నైలో డిగ్రీ చదువుతుండేవాడు.

From Toy Balloons to Billions The Incredible Journey of MRF s K M Mammen Mappillai

నేలపై పడుకొని

తండ్రి జైలు పాలవడం,కుటుంబ ఆస్తులు సీజ్ అవడంతో మాప్పిళ్లై జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి..చెన్నైలోని తన కాలేజీలో నేలపై పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ కష్టాలన్నీ అధిగమించాలి అని మనసులో మాప్పిళ్లై బలంగా అనుకుంటుండేవాడు. కష్టాల మధ్యనే డిగ్రని పూర్తి చేశాడు.

రోడ్లపై బెలూన్స్ అమ్మేవాడు

చదువు పూర్తయ్యాక చేతిలో రోడ్లపై టాయ్ బెలూన్స్(బొమ్మల బుడగలు)అమ్మడం మొదలుపెట్టాడు. దీంతో కొద్ది మొత్తంలో డబ్బులు సంపాదించేవాడు. అయితే బిజినెస్ ఐడియాలతో నిండిపోయిన మాప్పిళ్లై తన బ్రెయిన్ కి పదునుపెట్టి 1946లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలోనే ఓ చిన్న టాయ్ బెలూన్ తయారీ యూనిట్ తో తన పారిశ్రామిక జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత కాలంలో 1952 నాటికి ఇదే కంపెనీ MRFగా అవతరించింది. 1952లో MRF ట్రెడ్ రబ్బరు తయారీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఓ విదేశీ కంపెనీ రబ్బరును రీ ట్రేడింగ్ ఫ్లాంట్ కు సప్లై చేస్తుందని తెలుకున్న మాప్పిళ్లై కంపెనీ ట్రెడ్ రబ్బరు తయారీలోకి అడుగుపెట్టింది. ఈ కంపెనీ అరిగిపోయిన టైర్ ను రీసైక్లింగ్ చేసింది. అంటే పాత టైర్లకు కొత్త లైఫ్ ఇవ్వడం అన్నమాట. ఈ వ్యూహాత్మక నిర్ణయం కంపెనీని రబ్బరు రంగంలో ప్రముఖ స్థానంలో నిలబెట్టింది.

1956 నాటికి MRF బారత ట్రెడ్ రబ్బరు మార్కెట్ లో 50 శాతం వాటా కలిగి ఉంది. టాయ్ బెలూన్ తయారీ సంస్థ నుంచి వచ్చే ఆదాయమంత మాప్పిళ్లై ట్రెడ్ రబ్బరు తయారీలో పెట్టుబడి పెట్టాడు. ఆ టైంలో ట్రెడ్ రబ్బరు తయారీలో MRF ఏకైక భారతీయ కంపెనీ. MRF గట్టి పోటీ కారణంగా ట్రెడ్ రబ్బరు తయారీలో పాల్గొన్న అనేక విదేశీ కంపెనీలు భారత్ వదిళెల్లాయి.

గేమ్ ఛేంజర్

ఈ వ్యాపారం సక్సెస్ అయిన తర్వాత కొత్త టైర్లు తయారుచేడానికి ఫ్యాక్టరీ పెట్టాడు. అయితే MRF దగ్గర టైర్లను తయారుచేయడానికి కావాల్సిన టెక్నాలజీ లేదు. దీంతో ఓ అమెరికా కంపెనీలో టైఅప్ అయి తిరువొట్టియూర్ లోని పైలట్ ఫ్లాంట్ నుంచి దాని మొదటి టైర్ ని ప్రారంభించింది. ఈ ప్లాంట్ ఓపెనింగ్ కి ప్రధాని హోదాలో జవహర్ లాల్ నెహ్రూ వచ్చారు. 1967 నాటికి అమెరికాకు టైర్లను ఎగుమతి చుసిన ఫస్ట్ భారతీయ కంపెనీగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా MRF టైర్లు ఫేమస్ అయ్యాయి. బొమ్మ బెలూన్లు ఉత్పత్తి చేసే చిన్న షెడ్ నుంచి టైర్ల తయారీ పవర్ హౌస్ గా కంపెనీ పరిణామం మాప్పిళ్లై దూరదృష్టి,వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శం. 1992లో మాప్పిళ్లై భారత అత్యున్నత పౌరపురస్కార పద్మశ్రీని అందుకున్నారు.

క్రికెట్ తో కనెక్షన్

MRF భారతీ ఇళ్లలో సుపరిచితమైన బ్రాండ్ గా మారడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే..అనేకమంది క్రికెట్ దిగ్గజాలు MRF టైర్లకు చేసిన ప్రమోషనే. ఈ బ్రాండ్ లక్షలాదిమంది వీటికి కనెక్ట్ అవ్వడానికి, అంతర్జాతీయ గుర్తింపు పొందడంలో సహాయపడింది. 2003లో మాప్పిళ్లై మరణించారు. ఆయన కంపెనీ మార్కెట్ విలువ నేడు రూ. 59,334 కోట్ల పైనే ఉంది.

Desktop Bottom Promotion