Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Viral Video : దడ పుట్టిస్తున్న గ్యాంగ్ వార్..! వీడియో వైరల్..!
రోజురోజుకూ క్రైం విపరీతంగా పెరిగిపోతుంది. అభివృద్ధి చెందుతున్నా సరే మరి గతంలో కన్నా క్రైం రేట్లు ఎందుకు ఎక్కువవుతున్నాయ్. అభివృద్ధి అంటే నేరాల సంఖ్య పెరగడం కాదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఒక వీడియో సగటు సామాన్యుడిలో భయాన్ని పుట్టిస్తోంది. అర్ధరాత్రి సమయంలో కార్లలో కొందరు ఒకరిని ఒకరు కార్లతోనే మనుషులపై ఎక్కించుకుంటే, కార్లతో గుద్దుకుంటూ హల్ చల్ చేశారు. ఈ దృష్యం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. నెటిజన్లు దీనిపై సీరియస్‌గా స్పందిస్తున్నారు.
కర్నాటకలోని ఉడిపి టౌన్ మనకు తెలిసిందే. ఇది కర్నాటక సముద్ర తీరం వద్ద వుంటుంది. అక్కడ మే 18వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఓ దారుణం మొత్తం సోషల్ మీడియాలను షాక్‌కు గరిచేసింది. ఇప్పటికి మిలియన్ వ్యూస్‌ను ఈ వీడియో సొంతం చేసుకుంది. జరుగుతున్న ఘటనను దగ్గరలో వున్న అపార్ట్‌మెంట్ నుంచి ఎవరో ఒకరు మొబైల్‌లో రికార్డ్ చేశారు.
ఈ వాయ్‌లెన్స్‌లో రెండు స్విఫ్ట్ కార్లు పాల్గొన్నాయ్. మొదట ఒక కారు రివర్స్ గేరు వేసుకొని వెనక్కి వచ్చినప్పుడు వెనక వున్న కారు బ్యానెట్‌కు తాకింది. ఆ కారులోంచి ఇద్దరు వెంటనే కిందకు దిగి కొట్టుకున్నారు. అందులోవున్న ఒకరిపై కారును ఎక్కించడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయ్. ఈ దృష్యాలు చాలా భయానకంగా వున్నాయ్.
ఈ దారుణంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. జరిగిన స్థలంలో పోలీసుల నైట్ ప్యాట్రోలింగ్ ఎందుకు జరగలేదని ప్రశ్నిస్తున్నారు. ఉడిపి ప్రశాంతంగా వుంటుదందనుకున్నాం కానీ ఇంత వైలెంట్‌గా వుంటదనుకోవట్లేదని మరో యూసర్ కామెంట్ చేశారు. స్మార్మ్ట్ ఫోన్లు ఎక్కువగా వాడ్డం వల్లే ఇలా జరిగిందని ఒకరు. యువత ఎటు వెళ్తుంది అని, చట్టం ఉన్నా విలువలేదని ఇంకో యూసర్ రిప్లై ఇచ్చారు.

కర్నాటకలో క్రైం రేట్
కర్నాటకలో క్రైం రేట్ గతంలో కంటే 25 నుంచి 30 శాతం అమాంతంగా పెరిగిందని అంటున్నారు. మొత్తం 1,80,742 కేసులు నమోదయ్యాయ్. సీనియర్ సిటీజన్లపైన కూడా దాడులు తీవ్రమయ్యాయని అంటున్నారు. మహిళలపై జరిగే దాడుల్లో కర్నాటక రాష్ట్రం మూడవ స్థానంలో వుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
క్రమక్రమంగా బెంగళూరు క్రైం క్యాపిటల్‌గా మారుతోంది. కేవలం సైబర్ క్రైంలోనే రూ.432 కోట్లను ఒక సంవత్సరంలోనే దోచుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు చాలా ప్రశాంతంగా వుండే బెంగళూరు నగరం ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఎంతో మంది ఉగ్రవాదులను బెంగళూరులో పట్టుకున్నారు. బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లే ఈ క్రైంరేట్ పెరిగినట్లు కొందరు విమర్శిస్తున్నారు.
గ్యాంగ్‌వార్‌కు కారణాలు
గ్యాంగ్‌వార్‌లు ముఖ్యంగా ఆధిపత్యం కోసం వేచి చేసూ వుంటాయ్. యువత ప్రధానంగా ఈ గ్యాంగ్ వార్‌లో చేరడానికి పేదరికం, సింగిల్ పేరెంట్ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. కుటుంబాలు గ్యాంగ్‌లో వుండడం వల్ల కూడా వారి కుటుంబ సభ్యులు గ్యాంగ్ వార్‌లలో పాల్గొనడానికి ప్రధాన కారణాలుగా వుంటాయ్.
దేశంలోనే టాప్ మెట్రోపాలిటన్, ఐటీ సెంటర్‌గా వున్న కర్నాటక రాష్ట్రం ఇప్పుడు క్రైం రేట్‌లో టాప్ ర్యాంక్‌కు చేరుతుండడం ఆందోళనను కలిగిస్తోంది. సినిమాలు కూడా ఒక పక్క గ్యాంగ్‌వార్‌లతో నిండివుండడం కూడా రియల్ లైఫ్‌లో గ్యాంగ్ వార్‌లు మరింత పెరగడానికి కారణమౌతున్నాయ్.



Click it and Unblock the Notifications