Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Guru Gobind Singh Jayanti 2022: గురుగోవింద్ సింగ్ జయంతి 2022, తేదీ, సమయం, చరిత్ర, ప్రాముఖ్యత
గురు గోవింద్ సింగ్ సిక్కు మతానికి చెందిన పదో గురువు. గురు గోవింద్ సింగ్ జన్మదినం సిక్కు కమ్యూనిటీ ప్రజల్లో ముఖ్యమైన, పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఆయన 356 జయంతిని జరుపుకోనున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం గురు గోవింద్ సింగ్ శుక్ల పక్షం 1723 సంవత్ పౌషమాసంలో సప్తమి తిథి నాడు జన్మించారు. గురు గోవింద్ సింగ్ జయంతి డిసెంబర్ 29, 2022న జరుపుకోబోతున్నారు.

గురు గోవింద్ సింగ్ జయంతి తేదీ, సమయం:
సప్తమి తిథి ప్రారంభం - డిసెంబర్ 28, 2022 - 8.44PM
సప్తమి తిథి ముగింపు - డిసెంబర్ 29, 2022 - 7.17PM

గురుగోవింద్ సింగ్ జయంతి ప్రాముఖ్యత:
జూలియన్ క్యాలెండర్ ప్రకారం గురు గోవింద్ సింగ్ డిసెంబర్ 22, 1666న బీహార్‌లోని పాట్నాలో జన్మించారు. జూలియన్ క్యాలెండర్ వాడుకలో లేదు, ప్రస్తుతం దానిని ఎవరూ ఉపయోగించడం లేదు. గురు గోవింద్ సింగ్ తండ్రి గురు తేజ్ బహదూర్, తల్లి పేరు మాతా గుజ్రీ. 1675లో ఇస్లాం స్వీకరించలేదని ఔరంగజేబు గురు గోవింద్ సింగ్ తండ్రి అయిన గురు తేజ్ బహదూర్‌ను శిరచ్ఛేదం చేశాడని చరిత్ర చెబుతోంది. 1676లో గోవింద్ సింగ్‌ను 9 సంవత్సరాల వయస్సులో బైసాఖీ రోజున సిక్కుల పదో గురువుగా ప్రకటించారు.

గురు గోవింద్ సింగ్ జయంతి చరిత్ర:
గురు గోవింద్ సింగ్ జన్మించిన ప్రదేశం ఇప్పుడు తఖత్ శ్రీ హరిమందర్ జీ పాట్నా సాహిబ్. 1670లో ఆయన కుటుంబం మళ్లీ పంజాబ్‌కు తరలి వెళ్లింది. మార్చి 1672లో ఆయన కుటుంబం హిమాలయాల్లోని శివాలిక్ కొండల్లో ఉన్న చక్ నానకి అనే ప్రదేశానికి మారింది. చక్ నానకీని ఇప్పుడు ఆనంద్‌పూర్ సాహిబ్ అని పిలుస్తున్నారు. అక్కడ ఆయన తన విద్యను అభ్యసించారు. ఆయన పర్షియన్, సంస్కృత పాఠాలు నేర్చుకున్నారు. యోధుడిగా మారడానికి సైనిక నైపుణ్యాలను నేర్చుకున్నారు.
తర్వాత గురు గోవింద్ సింగ్ జీ ఖల్సా పంత్‌ను స్థాపించారు. గురు గోవింద్ సింగ్ పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో ఖల్సా కచ్చితంగా ఆధ్యాత్మిక క్రమశిక్షమను అనుసరించారు. మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు నిర్భయంగా పోరాడారు. గురు గోవింద్ సింగ్ అనేక సాహిత్యాలను రాసిన గొప్ప కవి. ఆయన 1708లో తన మరణానికి ముందు గురు గ్రంథ్ సాహిబ్‌ను శాశ్వత సిక్కు గురువుగా ప్రకటించారు. గురు గ్రంథ్ సాహిబ్ సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం.

గురుగోవింద్ సింగ్ జయంతి వేడుక:
గురు గోవింద్ సింగ్ జయంతి ప్రపంచవ్యాప్తంగా సిక్కు కమ్యూనిటీ ప్రజలు నివసించే చోట ఘనంగా జరుపుకుంటారు. సిక్కు ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరూ గురుద్వారాలకు వెళ్తుంటారు. అక్కడ జయంతి వేడుకలు చేస్తుంటారు. ఆయన బోధనలను అందరికీ వ్యాప్తి చేస్తారు. ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అందరికీ లంగర్లను పంపిణీ చేస్తారు. అన్ని గురుద్వారాలను దీపాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తారు. గురునానక్ వాణి కూడా వినిపిస్తారు. చాలా మంది సిక్కుల గురు గోవింద్ సింగ్ జయంతిని బాగా జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications