Latest Updates
-
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా!
ఈ రోజు గురు పౌర్ణమి.. మీ ప్రియమైన గురువులకు ఇలా విషెస్ తెలియజేయండి.!
హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఇదే రోజున మహాభారతం, పురాణాలను అందించిన వేదవ్యాస మహర్షి జన్మించగా.. ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామిని, షిరిడీ సాయిబాబాను, శ్రీకృష్ణుడితో పాటు మనకు విద్య నేర్పిన గురువులను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. వీరిని పూజించడం ద్వారా మనకు పుణ్య ఫలాలు అందుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

మన జీవితానికి దిశా నిర్దేశం చేయడంతో పాటు అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగులోకి నడిపించిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేయడానికి గురు పౌర్ణమి పవిత్రమైన సమయం. కేవలం ఆధ్యాత్మిక గురువులనే కాకుండా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, మనకు మార్గదర్శకంగా నిలిచిన వారిని గౌరవించుకోవచ్చు. వారి ఆశీర్వాదాలు తీసుకోవచ్చు.
జీవితానికి వెలుగునిచ్చే గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.

గురు పౌర్ణమి శుభాకాంక్షలు
- "గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాತ್ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు!"- ఈ శ్లోకం ద్వారా మీ గురువులకు విషెస్ తెలియజేయండి.
- "జీవితానికి సరైన మార్గం చూపి, నడిపించే ప్రతి గురువుకూ నమస్కారాలు. గురు పూర్ణిమ శుభాకాంక్షలు."- సులభంగా గౌరవంగా ఇలా విష్ చేయండి.
- "జ్ఞానాన్ని అందించి, అడుగుజాడలై నిలిచే గురుదేవుల ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ.. గురు పౌర్ణమి శుభాకాంక్షలు."
- "అంధకారం నుంచి వెలుగు దిశగా నడిపించే ప్రతి గురువుకు హృదయపూర్వక గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు ఇంకా చాలా మంది యువత జీవితాలకు ఆదర్శం కావాలి."
గురువుల కోసం ప్రత్యేకంగా సందేశాలు
- నా జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి, విజ్ఞానమనే కాంతిని నింపిన నా ప్రియమైన గురువుగారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు!
- నా జీవితానికి సరైన అర్థాన్ని ఇచ్చి సరైన మార్గంలో నడిపించినందుకు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతుడనై ఉంటాను. గురు పౌర్ణమి శుభాకాంక్షలు!
- నాలోని జ్ఞానానికి అక్షర రూపమిచ్చి, ఆశయాలకు రెక్కలిచ్చిన నా గురుదేవునికి.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు పాదాభివందనాలు తెలిజయేస్తున్నాను.
- కేవలం పుస్తక జ్ఞానమే కాదు జీవితంలో ఒక మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పిన దైవస్వరూపుడికి హ్యాపీ గురు పౌర్ణమి.!

వాట్సాప్ స్టేటస్, కోట్స్‌లో ఇలా తెలియజేయండి..
- "గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః.. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"- గురు పౌర్ణమి శుభాకాంక్షలు!
- గురువు అంటే కేవలం చదువు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు.. మనలోని ప్రతిభను గుర్తించి సమాజానికి మనల్ని ఒక ఉత్తమ పౌరుడిగా పరిచయం చేసే మార్గదర్శి.
- లౌకిక, ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు సరైన దిశా నిర్దేశం చేసే గురువులందరికీ శతకోటి ప్రణామాలు.
- గురువు అండ, మార్గదర్శకత్వం ఉంటే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. ఈ గురు పౌర్ణమి శుభ వేళ ఆ గురుదేవుని ఆశీస్సులు మీకు లభించాలని ఆకాంక్షిస్తున్నాను.



Click it and Unblock the Notifications
