Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Happy Dhanteras 2025 Wishes: కుబేరుని కటాక్షం కలుగుగాక..ధనత్రయోదశి విషెస్ ను ఇలా చెప్పండి
దీపావళి పండుగ సంబరాలు ధన్ తేరాస్(ధన త్రయోదశి)నుంచి ప్రారంభమవుతాయి. 5 రోజుల దీపావళి పండుగ ఈ ఏడాది అక్టోబర్ 20న జరుపుకుంటుండగా..అక్టోబర్ 18న ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈసారి ధనత్రయోదశి శనివారం రావడంతో ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. కాబట్టి దీనిని శనిధనత్రయోదశిగా కూడా పిలుస్తారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడాన్ని ప్రజలు అదృష్టంగా భావిస్తారు. కేవలం ఆభరణాలే కాకుండా కొత్త వాహనాలు, ఇళ్లు,స్థలాలు,పొలాలు వంటి స్థిరాస్థులను కొనటానికి కూడా ధనత్రయోదశి సమయాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ధన్ తేరాస్ రోజున ఏది కొన్నా అది పదమూడు రెట్లు వృద్ధి చెందుతుందని ఒక నమ్మకం.
పురాణాల ప్రకారం దేవుళ్లు,రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేస్తున్నప్పుడు ఆరోగ్యానికి అధిపతి అయిన ధన్వంతరి స్వామి చేతిలో అమృత కలశంతో ఇదే రోజున ఉద్భవించాడు. అందుకే ఈ రోజున ధన్వంతరిని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్మకం. ఇదే రోజున కుబేరుడు, లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. శనివారం(అక్టోబరం 17) ధనత్రయోదశి సందర్భంగా మీ బంధువులు,స్నేహితులు, శ్రేయోభిలాషులకు విషెస్ ఎలా అందంగా చెప్పాలో ఇక్కడ చూడండి.

ధనత్రయోదశి విషెస్ ఇలా చెప్పండి
మీకు, మీ కుటుంబ సభ్యులకు ధన్ తేరాస్ శుభాకాంక్షలు.
లక్ష్మీ దేవి, కుబేరుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. ధన్ తేరాస్ శుభాకాంక్షలు.
ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జయంతి సందర్భంగా, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. ధన్ తేరాస్ శుభాకాంక్షలు.
ధనత్రయోదశి దీపకాంతులు మీ జీవితంలోని చీకట్లను తొలగించి, వెలుగును నింపాలని ఆశిస్తున్నాను.
ధన్వంతరి దేవుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, లక్ష్మీ దేవి మీకు అపారమైన సంపదను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నిజమైన సంపద బంగారం, వెండి కాదు..ఆరోగ్యం, ఆనందమే అసలైన ధనం. ఈ ధన్ తేరాస్ మీకు ఆ రెండింటినీ ప్రసాదించాలి.
ఈ పవిత్రమైన రోజున మీరు కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీ ఇంట్లో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను.
సిరిలక్ష్మి మీ ఇంట చేరాలి, కుబేరుడు మీ సంపదను పెంచాలి, ధన్వంతరి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఈ ధన్ తేరాస్ మీ జీవితాన్ని ఆనందమయం చేయాలి.
శ్రీ మహాలక్ష్మి కటాక్షం సదా మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ధనత్రయోదశి శుభాకాంక్షలు.
ఈ ధన్ తేరాస్ కు కొన్న బంగారం కన్నా మన బంధం విలువైనది. హ్యాపీ ధనత్రయోదశి 2025.
దీపాల వెలుగులతో మీ ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలి. ధన్ తేరాస్ శుభాకాంక్షలు.
ఈ ధన్ తేరాస్ మీ పూజలు ఫలించి, మీ ఇల్లు ధనలక్ష్మితో నిండిపోవాలని ఆశిస్తున్నాను.
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. మీకు ధన్వంతరి ఆశీస్సులు కలగాలి.
లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలి. ధంతేరాస్ శుభాకాంక్షలు.
మీ ప్రతి కోరిక నెరవేరాలని కోరుకుంటూ.. ధనత్రయోదశి శుభాకాంక్షలు.
ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, సుఖసంతోషాలతో మీ ఇల్లు ఎప్పుడూ కళకళలాడాలి. ధన్ తేరాస్ శుభాకాంక్షలు.
ఈ పండుగ రోజున మీ నవ్వులు బంగారంలా మెరవాలి. హ్యాపీ ధన్ తేరాస్ 2025.

ఈ ధన్ తేరాస్ మీ పెట్టుబడులకు శుభారంభం పలకాలి. మీకు, మీ బృందానికి ధనత్రయోదశి శుభాకాంక్షలు.
మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది, లాభాల బాటలో పయనించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ధనత్రయోదశి.
ప్రతి కొత్త కొనుగోలు ఒక కొత్త ఆశకు నాంది. ఈ ధనత్రయోదశి మీ జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేయాలి.
ఈ ధనత్రయోదశి నాడు ధన్వంతరి భగవానుడు మీ ఇంటికి వచ్చి అనారోగ్యాలను దూరం చేసి, ఆయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
ధనం వస్తుంది పోతుంది, కానీ ఆరోగ్యం ఎప్పటికీ మనతోనే ఉండాలి. హ్యాపీ ధన్ తేరాస్.
ఈ పండుగ కేవలం ధనలక్ష్మికే కాదు, ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరికి కూడా ప్రత్యేకం. మీకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి.
బంగారం కొనే ముందు, మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అదే అసలైన సంపద. హ్యాపీ ధనత్రయోదశి.



Click it and Unblock the Notifications
