Latest Updates
-
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే!
Deepavali 2025 Wishes In Telugu: హ్యాపీ దీపావళి మచ్చా..మీ ఫ్రెండ్స్,బంధువులకు దీపావళి విషెస్ ఇలా చెప్పండి
Deepavali Wishes In Telugu: హిందువులు ముఖ్యంగా జరుపుకున్న పండుగల్లో దీపావళి ఒకటి. మనలోని అజ్ణానం అనే చీకటిని తొలగించి వెలుగులు నింపే పండుగగా దీపావళిని భావిస్తారు. దీపావళి పురాణాల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి సంహరించిన రోజుకు ప్రతీకారంగా తమ కష్టాలు తొలగిపోయాయన్న ఆనదంలో ప్రజలు దీపావళి జరుపుకుంటారు. రాముడు 14ఏళ్ల అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలికారు.
ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళి జరుపుకుంటున్నారు. ఈ దీపావళి సందర్భంగా మీ కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్, బంధువులు, శ్రయోభిలాషులకు దీపావళి విషెస్ ను ఎలా అందంగా చెప్పవచ్చో ఇక్కడ చూడండి.

దీపావళి విషెస్ ఇలా చెప్పుకోండి
-దీపావళి దీపాలు మీ జీవితంలో వెలుగులు నింపాలని, మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
-వెలుగుల పండుగ దీపావళి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ దివాలీ 2025.
-దీపకాంతుల వెలుగులో మీ కష్టాల చీకట్లు తొలగిపోయి, విజయాల వెలుగులు ప్రసరించాలని కోరుకుంటూ.. మీకు దీపావళి శుభాకాంక్షలు.
-టపాసుల శబ్దంతో మీలోని చెడు తొలగిపోవాలి, దీపాల వెలుగుతో మీ జీవితం ప్రకాశవంతం కావాలి. శోభాయమానమైన దీపావళి శుభాకాంక్షలు.
-ఈ దీపాల పండుగ మీ ఇంట నవ్వుల పువ్వులు పూయించాలని, సిరి సంపదలు కురిపించాలని కోరుకుంటూ.. హ్యాపీ దివాలీ 2025.

-లక్ష్మీదేవి కటాక్షంతో, సరస్వతీ దేవి ఆశీస్సులతో మీ జీవితం ఆనందమయం కావాలని ఆశిస్తున్నాను. దీపావళి శుభాకాంక్షలు.
-చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి. మీకు విజయ పరంపరలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. హ్యాపీ దివాలి.
-ఈ పవిత్రమైన పండుగ రోజున మీ ప్రతి కోరిక నెరవేరాలని, మీ ఇంట సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. దీపావళి శుభాకాంక్షలు.
-మట్టి ప్రమిదలోని దీపంలాగే, మీ జీవితం కూడా ప్రకాశవంతంగా వెలగాలని మనసారా కోరుకుంటూ... దీపావళి శుభాకాంక్షలు.
-మన కుటుంబ బంధం దీపావళి వెలుగుల వలె ఎప్పటికీ ప్రకాశవంతంగా ఉండాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
అమ్మ, నాన్న, అన్న, చెల్లి..ఇలా అందరితో కలిసి జరుపుకునే ఈ పండుగ మన అనుబంధాలను మరింత బలపరచాలి. హ్యాపీ దివాలీ.
టపాసుల మోతతో, దీపాల వెలుగులతో ఈ దీపావళిని అదరగొడదాం. హ్యాపీ దివాలీ రా.
మన స్నేహం దీపావళి కాకరపువ్వొత్తిలా ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. స్నేహితులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ఈ దీపావళికి నీ జీవితంలోని సమస్యలన్నీ చిచ్చుబుడ్డిలా కాలిపోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దివాలీ, ఫ్రెండ్.
జీవితమనే ఆకాశంలో నీవు ఎప్పుడూ వెలుగులు విరజిమ్మే తారాజువ్వవి కావాలి మిత్రమా.

-ఈ దీపావళికి మన గ్యాంగ్ అంతా కలిసి చేసే సందడి ఏ రేంజ్‌లో ఉండాలో తెలుసుగా? సిద్ధంగా ఉండు. హ్యాపీ దీపావళి.
-నీ లైఫ్‌లో ఎప్పుడూ చీకటి ఉండకూడదు, ఒకవేళ ఉన్నా టార్చ్ లైట్ వేసుకొని వచ్చే ఫ్రెండ్‌ని నేనున్నాగా. హ్యాపీ దీపావళి.
-కష్టాలు రాకెట్‌లా పైకి వెళ్లిపోవాలి, సంతోషాలు భూచక్రంలా నీ చుట్టూ తిరగాలి. విష్ యూ ఎ హ్యాపీ దివాలీ.
-నీ జీవితం దీపావళి స్వీట్ బాక్స్ లా తీయగా, రంగురంగుల మయంగా ఉండాలని కోరుకుంటున్నా.
-ఒక్క దీపం వేల చీకట్లను తరిమినట్టు, నీలోని ఆత్మవిశ్వాసం అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. హ్యాపీ దీపావళి 2025.
-మనలోని చెడు అనే నరకాసురుడిని జ్ఞానం అనే దీపంతో సంహరించడమే నిజమైన దీపావళి.
-దీపావళి అంటే కేవలం ఒకరోజు పండుగ కాదు, ప్రతిరోజూ వెలుగులమయంగా జీవించాలనే స్ఫూర్తి. హ్యాపీ దివాలి.
-శబ్ద కాలుష్యం కాదు, సంతోషాల శబ్దం చేద్దాం. పర్యావరణహిత దీపావళి జరుపుకుందాం. హ్యాపీ గ్రీన్ దివాలి.
-లక్ష్మీ , కుబేరుడి ఆశీస్సులతో మీరు సకల ఐశ్వర్యాలను అనుభవించాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి 2025.

-తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హ్యాపీ దీపావళి 2025.
-లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించుగాక, సరస్వతి మీతో పాటు రావుగాక, గణేశుడు మీ నివాసంలో నివసిస్తాడు, దుర్గాదేవి ఆశీస్సులతో మీ జీవితం వెలుగులతో నిండి ఉండుగాక. దీపావళి శుభాకాంక్షలు.
-బంగారం,వెండి ప్రత్యేకమైన వర్షం కురవాలి, ఇంట్లోని ఏ మూలలో సంపద ఖాళీగా ఉండకూడదు, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ ముఖంలో కాంతి ఉండాలి, మీరు నవ్వుతూ ఉండాలి. చుట్టూ ఆనందం ఉండాలి. హ్యాపీ దివాలి 2025.
-దీపాలు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండుగాక, మేము మిమ్మల్ని గుర్తుంచుకుంటూనే ఉంటాము మరియు మీరు మమ్మల్ని గుర్తుంచుకుంటూనే ఉంటారు, మేము బ్రతికి ఉన్నంత కాలం, మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని ఇదే మా ప్రార్థన.
-గణేశుడి నుండి జ్ఞానం అనే వరం, లక్ష్మీదేవి నుండి సంపద శ్రేయస్సు అనే బహుమతి మీకు లభించుగాక. ఈ దీపావళి మీకు ఆనందం, శ్రేయస్సు, గౌరవాన్ని తెస్తుంది. దీపావళి శుభాకాంక్షలు.
-దీపాల కాంతితో, ప్రియమైనవారి ప్రేమతో, పటాకుల శబ్దంతో ప్రపంచం ప్రతిధ్వనిస్తోంది, మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications











