Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం..మీ ఫ్రెండ్స్, బంధువులకు బెస్ట్ ఉగాది విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇలా..
తెలుగు వారి తొలి పండుగ ఉగాది. ఈ రోజునే సృష్టి ఆరంభమైన రోజు అని చెబుతారు. 2026లో వచ్చే ఉగాది (పరాభవ నామ సంవత్సరం) సరికొత్త ఆశలకు, ఆశయాలకు ప్రతీక. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగతో వసంత రుతువు ప్రారంభమవుతుంది. చెట్లు చిగురించి, ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది.
గురువారం(మార్చి 19,2026)ఉగాది పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు ఆకట్టుకునే ఉగాది విషెస్ ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.

సాంప్రదాయ ఉగాది శుభాకాంక్షలు
-ఈ ఉగాది మీ జీవితంలో సరికొత్త ఆశలను చిగురింపజేయాలని కోరుకుంటూ..నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.
-షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి.. మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందమయంగా ఉండాలని ఆశిస్తూ ఉగాది 2026 శుభాకాంక్షలు.
-మామిడి తోరణాలు, కోయిల కిలకిలలు మీ ఇంట సిరుల పండుగను తేవాలి. హ్యాపీ ఉగాది 2026.
-శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది.
-జీవితమనే ఉగాది పచ్చడిలో బాధలనే చేదు తగ్గి, సంతోషమనే తీపి పెరగాలని ఆశిస్తూ.. ఉగాది శుభాకాంక్షలు.
-మీ ప్రతి అడుగులో విజయం, ప్రతి ఆలోచనలో ఆనందం తోడుండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
-చిగురించే ఆశలకు, వికసించే వసంతానికి స్వాగతం పలుకుతూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
-ఈ ఉగాది మీ కలలన్నీ సాకారం చేసి, మీ లక్ష్యాలను చేరేలా దీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
-వేపపువ్వు చేదును మాయం చేస్తూ, బెల్లం తీపి మీ బంధాలను మరింత బలోపేతం చేయాలి. ఉగాది శుభాకాంక్షలు.
-కాలం మారుతుంది, రుతువులు మారుతాయి, కానీ మీ చిరునవ్వు ఎప్పుడూ చెదరకూడదు. హ్యాపీ ఉగాది 2026.
-ప్రకృతి పులకరించే ఈ వేళ.. మీ హృదయం సంతోషంతో ఉప్పొంగాలి. శ్రీ ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లు
-కొత్త సంవత్సరం..కొత్త ఆశలు..అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
-నా స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.
-జీవితం అంటే అన్ని రుచులు కలిసిన ఉగాది పచ్చడి. దాన్ని ఆస్వాదిద్దాం.
-మీ ఇంట ఆనందాల వసంతం వికసించాలి. హ్యాపీ ఉగాది 2026.
-పాత బాధలు మర్చిపోదాం, కొత్త ఆశలతో అడుగులేద్దాం. ఉగాది శుభాకాంక్షలు.
-కోయిల పాటలు, మామిడి తోరణాలు... ఉగాది వచ్చేసింది. అందరికీ శుభాకాంక్షలు.
-ఉగాది పచ్చడిలాగే ఈ ఏడాది మీ జీవితం అన్ని రంగులు, రుచులతో నిండిపోవాలి. హ్యాపీ ఉగాది 2026.
-బెల్లం అంత తీపి స్నేహాలు ఎప్పటికీ మీతో ఉండాలని కోరుకుంటూ..హ్యాపీ ఉగాది.
-చిగురిస్తున్న ప్రకృతికి స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-నా వాట్సాప్ మిత్రులందరికీ పేరుపేరునా షడ్రుచుల ఉగాది శుభాకాంక్షలు.

ఉగాది స్ఫూర్తిదాయకమైన కోట్స్
-కష్టం రాకుండా జీవితం నేర్పదు, బాధ పడకుండా సంతోషం విలువ తెలియదు. ఈ సత్యాన్ని తెలిపేదే ఉగాది పచ్చడి.
-రాలిన ఆకుల స్థానంలో కొత్త చిగురులు వచ్చినట్టే.. నిరాశలను వదిలేసి కొత్త ఆశలతో ప్రయాణం మొదలుపెట్టు.హ్యాపీ ఉగాది 2026.
-షడ్రుచులు లేనిదే ఉగాది లేదు, కష్టసుఖాలు లేనిదే జీవితం లేదు. హ్యాపీ ఉగాది.
-తీపిని ఆస్వాదించినట్లే, చేదును కూడా చిరునవ్వుతో స్వీకరించగలగడమే నిజమైన గెలుపు. ఉగాది శుభాకాంక్షలు
-విజయం ఉగాది పచ్చడిలాంటిది. ఎన్నో రకాల కష్టాల (రుచుల) కలయికే ఆ విజయపు అసలు రుచి.
-నీ కలలు మామిడి పిందెల్లా పుట్టి, పచ్చడిలాంటి అనుభవాలతో పరిపక్వం చెంది, మధురమైన పండ్లుగా మారాలి.
ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం ఉగాది విషెస్
-బంధాలకు విలువనిచ్చే నా కుటుంబ సభ్యులందరికీ శ్రీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.
-కలిసి పంచుకున్న నవ్వులు, కన్నీళ్లు.. అన్నీ ఈ ఉగాది పచ్చడిలాగే మన బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేశాయి. హ్యాపీ ఉగాది.
-నా సంతోషానికి కారణమైన మీ అందరికీ వసంత రుతువు సాక్షిగా ఉగాది శుభాకాంక్షలు.
-అమ్మానాన్నల ఆశీస్సులు, దేవుని దయ ఎల్లప్పుడూ మన కుటుంబంపై ఉండాలని ప్రార్థిస్తూ.. ఉగాది శుభాకాంక్షలు.
-దూరాన ఉన్నా నా మనసుకు దగ్గరగా ఉన్న స్నేహితులందరికీ, షడ్రుచుల పండుగ శుభాకాంక్షలు.
-ఈ ఉగాది 2026 మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరంగా నిలిచిపోవాలని ఆశిస్తూ..అందరికీ హ్యాపీ ఉగాది.



Click it and Unblock the Notifications