Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
అక్షయ్ ఖన్నా కాదు, బాబీ డియోల్ కాదు..2025లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న విలన్ ఎవరో తెలుసా?
సినీ పరిశ్రమలో హీరోలదే పైచేయి కావడం సహజం. కానీ 2025 ముఖచిత్రం మారింది. ఈ ఏడాది హీరోల కంటే విలన్లే బాక్సాఫీస్ దగ్గర రెండింతలు గర్జించారు. 2025 సంవత్సరం ఆరంభం నుండే ఈ మార్పు స్పష్టంగా కనిపించింది.
చావా సినిమాలో ఔరంగజేబ్ గా అక్షయ్ ఖన్నా ప్రదర్శించిన క్రూరత్వం, ఇటీవల రిలీజ్ అయిన ధురంధర్ సినిమాలో ఆయన పండించిన విలనిజం ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, చర్చ మాత్రం విలన్ చుట్టూనే తిరిగింది.

విలనిజంలో కొత్త కోణాలు
కేవలం అక్షయ్ ఖన్నా మాత్రమే కాదు ఈ ఏడాది తెరపైకి వచ్చిన ప్రతినాయకులు తమదైన ముద్ర వేశారు. జాట్ సినిమాలో రణదీప్ హుడా పోషించిన రణతుంగ పాత్ర, రైడ్ 2లో రితేష్ దేశ్‌ముఖ్, కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్ లో రుక్మిణి వసంత్ నటన గూస్ బంప్స్ తెప్పించాయి.
ఇక యానిమల్ స్టార్ బాబీ డియోల్, బాలకృష్ణ డాకు మహారాజ్తో పాటు మరో భారీ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించారు. ఓటీటీలో ఫ్యామిలీ మ్యాన్ 3 ద్వారా జైదీప్ అహ్లావత్ కూడా తన సత్తా చాటారు.
అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏమిటంటే..అద్భుతమైన నటన కనబరిచిన అక్షయ్ ఖన్నా గానీ, బాబీ డియోల్ గానీ 2025లో అత్యధిక పారితోషికం తీసుకున్న విలన్లు కాదు. ఆ రికార్డును సొంతం చేసుకుంది ఒక భారతీయ గ్లోబల్ స్టార్.
వార్ 2
అతను మరెవరో కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. హృతిక్ రోషన్ హీరోగా, YRF స్పై యూనివర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వార్ 2 సినిమాలో తారక్ విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.
ప్రపంచవ్యాప్తంగా కేవలం 364.35 కోట్లు (గ్రాస్) మాత్రమే వసూలు చేసి బడ్జెట్ ను కూడా వెనక్కి తేలేక ఘోర పరాజయాన్ని చవిచూసింది. కథలో పట్టు లేకపోవడం, హీరో విలన్ మధ్య కెమిస్ట్రీ పండకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

అత్యధిక పారితోషికం తీసుకున్న విలన్
సినిమా ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ రెమ్యునరేషన్ మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 60 నుండి 70 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇది హీరో హృతిక్ రోషన్ తీసుకున్న 40-50 కోట్ల (లాభాల్లో వాటా మినహాయించి) కంటే ఎక్కువ కావడం విశేషం.
మిగతా విలన్లతో పోలిస్తే..
ఈ అంతరం ఎంత భారీగా ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 2025లో తమ నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన అక్షయ్ ఖన్నా చావా కోసం 2.5 కోట్లు, ధురంధర్ కోసం 3 కోట్లు మాత్రమే తీసుకున్నారు.
ఇక బాలయ్యతో పోటీపడిన బాబీ డియోల్ 4 కోట్లు అందుకున్నారు.
వీరితో పోలిస్తే ఎన్టీఆర్ పారితోషికం అనేక రెట్లు ఎక్కువ. మొత్తానికి సినిమా విజయం సాధించకపోయినా, 2025లో అత్యంత ఖరీదైన విలన్ గా జూనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.



Click it and Unblock the Notifications