Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పందెం కోళ్లు పెంచడానికి రోజుకు రూ.3500 కంటే ఎక్కువే, ఒక్కోదాని ధర లక్ష రూపాయలపైమాటే
ఈ పందెం కోళ్లను ఎలా పెంచుతారు, ఎలాంటి పౌష్టికాహారం అందిస్తారు, పందాలకు ఎలా సిద్ధం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి - కోడిపందేలు.. రెండింటిని వేరు చేసి చూడలేం. సంక్రాంతి వచ్చిందంటే పాత గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో కోడిపందేలు జోరుగా జరుగుతాయి. సంక్రాంతి వచ్చిందంటే పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి కాయ్ రాజా కాయ్ అంటూ జోరుగా పందాలు జరుగుతాయి. పౌరుషానికీ, రాజసానికీ పందెం కోళ్లను ప్రతీకగా భావిస్తారు. ఒకసారి పుంజు బరిలోకి దిగిందంటే చచ్చే వరకు పోరాడుతూనే ఉంటుంది. సంక్రాంతి వస్తుందంటే 6 నెలల ముందు నుండే పందెం కోళ్ల సిద్ధం చేస్తారు. వాటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పౌష్టికాహారం అందిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోళ్ల పందెలను చూడటానికి రాష్ట్ర నలుమూలల నుండి, వివిధ రాష్ట్రాల నుండి జనాలు వస్తారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా వేలాది టెంట్లు వెలుస్తాయి. ఇక్కడ కోడిపందాలు సంప్రదాయంగా నిర్వహిస్తారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతాల్లో కోడిపందాల్లో భాగంగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మూడు రోజుల సంక్రాంతి పండగ సందర్భంగా వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయి.
ఈ పందెం కోళ్లను ఎలా పెంచుతారు, ఎలాంటి పౌష్టికాహారం అందిస్తారు, పందాలకు ఎలా సిద్ధం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పందెం కోళ్లను ఎలా పెంచుతారు?
పందెం కోళ్లను పెంచడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. దానికెంతో శ్రమించాల్సి ఉంటుంది. ఈ పందెం కోళ్ల కఠినమైన శిక్షణ ఇస్తారు. రోజూ ఔషధ స్నానాల నుండి డ్రై ఫ్రూట్స్ వరకు, రూస్టర్లను వెటర్నరీ నిపుణుల పర్యవేక్షణలో పెంచుతారు. కొంత కాలం వరకు ఈ పందెం కోళ్లను పౌల్ట్రీ రైతులు పెంచేవారు. వ్యాధులు కారణంగా, ముఖ్యంగా వైరస్‌ల వల్ల ఈ పందెం కోళ్ల చనిపోయేవి. దాని వల్ల విపరీతమైన నష్టాల భరించలేక వారు పందెం కోళ్లను పెంచడాన్ని క్రమంగా తగ్గించారు.
గోదావరి, కృష్ణా జిల్లాల్లో రూస్టర్ బ్రీడింగ్ ఫార్మ్‌లు వెలిశాయి. అందులో కేవలం ఈ పందెం కోళ్లనే పెంచుతారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఔషధాలు, డ్రైఫూట్స్ ఇస్తారు. వాటి ఆరోగ్యం చూసేందుకు ఎప్పుడూ వెటర్నరీ నిపుణుడు అందుబాటులో ఉంటాడు.

పందెం కోళ్ల పెంపకం ఖర్చుతో కూడుకున్న పని:
* పందెం కోళ్ల పెంపకం విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని.
* రెండు పెట్టలు, ఒక కోడి పుంజు ఉండే నాణ్యమైన బ్రీడింగ్ కిట్ ధర సుమారు. 3.5 లక్షల వరకు ఉంటుంది.
* పందెం కోడిని మేపడానికి రోజుకు రూ.3 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
* పండగ సీజన్‌కు వచ్చేసరికి రోజు ఖర్చు రూ.4,500 వరకు పెరుగుతుంది.

పందెం కోళ్లకు ఎలాంటి ఆహారం పెడతారు?
* రోజూ 8 నుండి 10 బాదం పప్పులు
* పిస్తా, కాజు లాంటి డ్రైఫ్రూట్స్
* రోజూ 50 గ్రాముల మటన్ కీమా
* వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన 50 గ్రాముల డ్రై ఫ్రూట్ లడ్డూ
* ఒకటీ లేదా రెండు పౌల్ట్రీ గుడ్లు, నాటు కోడి గుడ్లు

పందెం కోళ్లకు శిక్షణ:
* పందెం కోళ్లకు రోజు 15 -20 నిమిషాలు స్విమ్మింగ్ చేయిస్తారు. దీని వల్ల కోడి యాక్టివ్‌గా తయారవుతుంది. ఎక్కువ సేపు పోరాడగలుగుతుంది. ఓవర్ వెయిట్ ఉంటే తగ్గుతుంది.
* కోళ్లలో బెదురు తగ్గడానికి రోజూ నీటితో మసాజ్ చేస్తుంటారు. దీని వల్ల వాటికి స్పర్శ అలవాటుగా మారి బెదరకుండా ఉంటాయి.
వేడి నీళ్ల పోత:
7, 8 రకాల వనమూలికలు నీటిలో వేసి మరిగించి ఆ నీటితో కోడికి స్నానం చేయిస్తారు. సంక్రాంతి రెండు మూడు నెలల ముందు నుండి ఇలా అప్పుడప్పుడు చేయిస్తారు. దీని వల్ల కోడికి ఒంటి నొప్పులు ఉంటే తొలగిపోతాయి. ఈ మెడికేటెడ్ స్నానంతో చర్మ సంబంధిత సమస్యలు ఉంటే పోతాయి.
శాఖాలు:
నీటిలో పసుపు, గల్లుప్పు నీటిలో కలుపుతారు. అవి చక్కగా కరిగిన తర్వాత ఆ నీటిని తడి గుడ్డతో కోడిని తుడుస్తారు. స్టవ్ పై పెనం పెట్టి అది వేడి అయిన తర్వాత తడిగుడ్డతో వెచ్చగా కోడిపుంజుపై రాస్తారు. ఈ పద్ధతిని శాఖాలు అంటారు.



Click it and Unblock the Notifications