Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
వచ్చే జన్మలో ఎలా పుడతారు..? గరుడ పురాణం ఏమి చెబుతోందంటే..!
భగవద్గీతలో శ్రీకృష్ణుడు పునర్జన్మ గురించి చెబుతాడు. పాత వస్త్రాలను తీసి కొత్త వస్త్రాలను ఎలాగైతే వేసుకుంటామో అలాగే పాత ఆత్మ కొత్త శరీరం లోపలికి వెళ్తుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయ్. అయితే ఆ పునర్జన్మ ఎలా వుంటుంది. ఎవరి కడుపున పుడతాం, ఎలా పుడతామని ప్రశ్నలు మనకు వస్తాయ్. చాలా మందిలో తమ పూర్వ జన్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా వుంటుంది. గత జన్మ గురించి తెలుసుకోవడానికి ఒక పద్ధతిని కూడా సూచించారు.
గరుడ పురాణంలో గత జన్మగురించి వివరించి వుంచింది. వీటితో పాటు మరణించిన తరువాత వారి పాపపుణ్యాలను బట్టి విధించే శిక్షల గురించి కూడా చెప్పబడి వుంది. ఈ జన్మలో చాలా మంది రకరకాల తప్పులు చేస్తుంటారు, చివర్లో దాన ధర్మాలు చేసి పాపం నుంచి తప్పించుకున్నాం అని అనుకుంటారు. కానీ అంత సులభంగా పాపాల నుంచి తప్పించుకోలేరని శాస్త్రం చెబుతోంది. ఈ పాపాలు మరణించిన తరువాత వచ్చే శరీరానికి ట్రాన్స్‌ఫర్ అవుతుందన్న సత్యం చాలా మందికి తెలియదు.
గరుడపురాణం ప్రకారం ఎవరి కర్మలను, పాపాలను బట్టి వారు వచ్చే జన్మలో కీటకాలుగా, జంతువులుగా, పక్షులుగా, చెట్టుగా పుట్టే అవకాశం వుందని తెలుస్తోంది. కొంతమంది పుట్టుకతోనే శారీరక లోపంతో, నపుంసుకులుగానో, వికలాంగులుగా పుడతారు. దీని వెనక కర్మఫలం వుందని పండితులు చెబుతున్నారు.

జీవుడు ఈ భూమిపై పుట్టిన తరువాత చేసే పాపాల వల్ల ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో స్పష్టం గరుడపురాణంలో చెప్పబడింది. వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి నరకానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తోందని కూడా చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ముందుగా తొడేలుగా, కుక్కగా, రాబంధువుగా, కాకిగా, చివర కొంగగా జన్మం ఎత్తాల్సి వస్తుంది. ఇలా ఎన్నో జన్మలు ఎత్తిన తరువా మానవ జన్మ వచ్చే అవకాశం వస్తుంది. ఎవరైతే అత్యాచారం చేస్తారో వారు వచ్చే జన్మలో నపుంసకులుగా పుడతారని శాస్త్రం చెబుతోంది.
గరుడ పురాణం ప్రకారం స్నేహితుడిని అవమానించే వాడు గాడిదగా పుడతాడు. అలా గాడిదగా జీవించినంత కాలం కష్టాలు పడాల్సి వస్తుంది. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు తాబేలుగా పుడతారు. తాబేలు సుమారు 200ల సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఆ శిక్ష అనుభవించాల్సి వుంటుందని గరుడ పురాణం చెబుతోంది.
యజమానిని మోసం చేసేవాడు, ఇబ్బంది పెట్టేవాడు కోతిగా పుడతారని శాస్త్రం చెబుతోంది. ఇక డబ్బులు తీసుకొని మోసం చేసేవారు పురుగులా పుడతారు. ఎవ్వరి మాటను లెక్కచేయకుండా బ్రతికేవాళ్లు వచ్చే జన్మలో తేలుగా పుడతారు. ఈ జన్మలో ఎవరైతే గౌరవం ఇవ్వరో వచ్చే జన్మలో వారికి గౌరవం దక్కదని గరుడ పురాణం చెబుతోంది.
గరుడపురాణం ప్రకారం వెండి వస్తువులను దొంగలించే వ్యక్తి పావురంగా పుడతారు. బట్టలు దొంగలించే వారు చిలకగా పుడతారు. సుగంధ ద్రవ్యాలని దొంగలించే వారు పుట్టుమచ్చలుగా పుడతారు. దొంగతనం కంటే ఎక్కువ నేరాలు చేసిన వారు చాలా బాధాకరమైన జన్మనెత్తుతాడు. హత్య చేసిన వారు గాడిదగా పుడతారు. ఆ తరువాత జింకగా, చేపగా, కుక్కగా, పులిగా మారి చివరకు మానవరూపాన్ని ధరిస్తాడు.
గరుడపురాణం ప్రకారం ఇతరుల మంచి కోసం ఆలోచించేవారు. మత గ్రంధాలు, మతంపై విశ్వాసం వున్నవారు, జంతువులను ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవారు, గురువు చెప్పిన మార్గంలో పయనించేవారు స్వర్గానికి వెళ్తారు. అక్కడ మోక్షం లభిస్తుందని గరుడ పురాణం చెబుతోంది.



Click it and Unblock the Notifications