Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
మార్కెట్‌లో దొరికే నకిలీ కారం పొడిని ఎలా గుర్తించాలంటే,ఇంత సింపులా!
ప్రతి ఇంటి వంటగదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువు కారం. ఈ కారం లేకపోతే ఏ వంటకమూ రుచికరంగా ఉండదు. అసలు తినలేము కూడా. చాలా మంది ఈ కారం ఎంచుకునేటప్పుడు ప్రత్యేకమైన ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని కొంటుంటారు. కానీ ఈ ఆధునిక యుగంలో మార్కెట్‌లో చాలా నకిలీ కారం పొడులు వచ్చేశాయి. ఇవి రుచికరంగా అస్సలు ఉండవు. పైగా ఆరోగ్యానికి చాలా హానికరం కూడా.
తాజాగా పతంజలి కంపెనీకి చెందిన కారం పొడిని ఆ కంపెనీ వెనక్కి తీసుకుంది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు కారంపొడిని మార్కెట్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకోవాలని బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని సంస్థను ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ ఆదేశించింది. దీంతో నకిలీ కారంపొడి విషయం వెలుగులోకి వచ్చింది. అసలు మార్కెట్‌లో ఉండే నకిలీ కారం పొడిని ఎలా గుర్తించాలి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నకిలీ కారంపొడిని ఎలా గుర్తించాలి
ముందుగా కారం పౌడర్లలో సాధారణంగా ఏమి కలుపుతారో తెలుసుకోండి. చాలా మంది కారం పొడిలో ఎర్ర ఇటుక, ఎర్ర ఇసుక, కొన్ని చెక్కల పొడి, స్టార్చ్, సబ్బుపొడి కలుపుతున్నారు. ఇవి అచ్చం కారంపొడి రంగులోనే ఉంటాయి. దీంతో పాటు కారంపొడి పూర్తిగా ఎర్రటి రంగులో కనిపించడానికి కొని కృత్రిమ రంగును జోడిస్తారు. ఇవి కారం ఎర్రగా, అద్భుతమైనదిగా కనిపిస్తుంటుంది.
అయితే మీరు నకిలీ కారంపొడిని గుర్తించాలనుకుంటే.. ఒక గ్లాసులో నీరు నింపి, ఆపై కారం పొడిని చల్లండి. ఆ కారం పొడి పూర్తిగా నీళ్లలో కరిగిపోతే అది ఒరిజినల్‌గా నిర్థారించుకోవచ్చు. ఒకవేళ ఆ కారం పొడి నీటిలో కరగకపోతే.. అది నకిలీదని నిర్ధారించుకోవచ్చు. అందులో కలిపిన బియ్యం పొట్టు, ఇటుక, మరేదైనా వస్తువులు ఉంటే.. వాటిని చూడొచ్చు
అలాగే ఒక ప్లేట్‌లో కారం పొడి వేసి, ఆపై ఉప్పునీరు లేదా అయోడిన్ చుక్కలను చల్లండి. ఈ పరీక్షలో కారం పొడి నీలం రంగులోకి మారితే, అది నకిలీదని అర్థం. అలాగే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో ఉప్పు పొడి వేసి కలపాలి. తర్వాత దాని నీటిని తీసి చేతులకు రుద్దినప్పుడు నురగ వస్తే అందులో సబ్బుపొడి కలిపినట్లు అర్ధం చేసుకోవాలి. ఈ విధంగా మార్కెట్‌లో దొరికే నకిలీ పౌడర్లను గుర్తించొచ్చు.



Click it and Unblock the Notifications
