Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
క్లాస్ రూమ్ లోని విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్..చెప్పుతో చితకబాదిన స్టూడెంట్..వీడియో చూడండి
గురుశిష్యుల బంధం ఎంతో పవిత్రమైనది. కానీ విద్యాబుద్ధులు నేర్పి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఒక గురువు దారి తప్పాడు. అందరూ చూస్తుండగానే, ఏకంగా క్లాస్ రూమ్ లోనే ఒక విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేశాడు.. ఈ ఊహించని పరిణామంతో అగ్గిమీద గుగ్గిలమైన ఆ విద్యార్థిని, తోటి విద్యార్థులతో కలిసి ఆ కీచక ప్రొఫెసర్‌కు దేహశుద్ధి చేసింది.
అసలేం జరిగిందంటే
కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అబ్దుల్ అనే వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే క్లాస్ కి వచ్చిన అబ్దుల్ పాఠాలు చెప్పాల్సిన సమయంలో విద్యార్థులందరి ముందు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

ఈ బ్యాచ్ విద్యార్థులు నాపై ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు. ఆ ప్రేమను నేను ఆపుకోలేకపోతున్నాను. అందుకే ఈ బ్యాచ్ లోనే నాకు అత్యంత ఇష్టమైన అమ్మాయికి ఇప్పుడే ప్రపోజ్ చేస్తున్నాను అంటూ ఒక విద్యార్థిని వైపు తిరిగి ఐ లవ్ యూ చెప్పాడు. అంతటితో ఆగకుండా, తన ఆనందాన్ని పంచుకోవడానికి విద్యార్థులందరికీ చాక్లెట్లు ఇస్తానంటూ ప్రకటించాడు. అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు ఇదంతా తమ స్మార్ట్ ఫోన్లలో రికార్డు చేశారు.
ఎదురుదాడికి దిగిన ప్రొఫెసర్.. నిలదీసిన విద్యార్థిని
ప్రొఫెసర్ ఊహించని ఈ ప్రవర్తనతో సదరు విద్యార్థిని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే తేరుకుని తీవ్ర ఆగ్రహంతో ఆ ప్రొఫెసర్ ను నిలదీసింది. ఈ విషయాన్ని ఇప్పుడే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ ప్రొఫెసర్ ఎదురుదాడికి దిగాడు.
నువ్వే నాకు ముందు లవ్ ప్రపోజ్ చేశావు. అందుకు నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యంగా ఉంది. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పలేదా? అంటూ ఆమెనే తిరిగి ప్రశ్నించాడు. దీంతో మరింత మండిపడిన ఆ అమ్మాయి నేను నీకు ఎప్పుడు చెప్పానో ఇప్పుడే నిరూపించు అంటూ గట్టిగా నిలదీసింది. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అబ్దుల్..ఈ విషయం గురించి రేపు మాట్లాడుతాను, ముందు చాక్లెట్లు తీసుకోండి అంటూ మెల్లగా క్లాస్ నుంచి జారుకునే ప్రయత్నం చేశాడు.
చెప్పుతో కొట్టి.. కారు వరకు వెంటాడి..
అయితే ఈ ఘటన క్షణాల్లో క్యాంపస్ అంతటా దావానలంలా వ్యాపించింది. ప్రొఫెసర్ వికృత చేష్టల గురించి తెలుసుకున్న విద్యార్థులంతా ఏకమయ్యారు. క్లాసు నుంచి తప్పించుకుని వెళ్తున్న అబ్దుల్ ను అడ్డగించారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న ఆ బాధితురాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, తన కాలి చెప్పు తీసి అందరి ముందే ఆ ప్రొఫెసర్ ను చెంపదెబ్బ కొట్టింది. ఆ వెంటనే తోటి విద్యార్థులు కూడా అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు.
క్యాంపస్ లో కారు దగ్గర వరకు ఆయనను వెంటాడి చితకబాదారు. విద్యార్థుల దెబ్బలకు గాయపడిన అబ్దుల్ అతికష్టం మీద ప్రాణాలతో పరారయ్యాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.
కాలేజీ యాజమాన్యం ప్రొఫెసర్ అబ్దుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడిన ప్రొఫెసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
