Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
Allu Arjun,Madame Tussauds Dubai గంగోత్రి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తరువాత ఆర్య, బన్నీ, దేశముదురు, బద్రీనాథ్, రేసు గుర్రం, సరైనోడు ఇలా వరుసగా సినిమాలూ చేస్తూ ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ తరువాత ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు అభిమానులను సొంతం చేసుకున్నాడు.
పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్పా తగ్గేదే లే అంటూ వచ్చిన అల్లు అర్జున్ వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్పా సినిమాతో అల్లు అర్జున్ రైంజ్ పూర్తిగా మారిపోయింది. పుష్పా సినిమా అల్లు అర్జున్ తలరాతనే మార్చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు, పుష్పా నటనతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్ గురువారం మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో అయన విగ్రహాన్ని ఆయనే ఆవిష్కరించి ఆ మైనపు విగ్రహం పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దగ్గర నుంచి చూస్తే తప్పా అల్లు అర్జున్ కు, మైనపు విగ్రహానికి ఎలా తేడా కనిపించకపోవడంతో అల్లు అర్జున్ మురిసిపోతున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమాలో ఐకానిక్ ఫోజు అయిన తగ్గేదే లే అనే స్టిల్ లో అల్లు అర్జున్ మైనపు బొమ్మ తయారు చేశారు. అల్లు అర్జున్ మైనపు బొమ్మ రెడ్ జాకెట్, గ్రే ట్రౌజర్ లో రియాలిటికి చాలా దగ్గరగా కనిస్తుంది అయితే అచ్చం అలాంటి డ్రస్ వేసుకున్న అల్లు అర్జున్ అదే మైనపు విగ్రహం పక్కలో నిలబడి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

పుష్పా సినిమాతో దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మను ఆవిష్కరించి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని ఆయన అభిమానులు అంటున్నారు. మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చెయ్యడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇప్పుడు పుష్పా 2 సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. లండన్ లోని సిటీ సెంటర్ లో మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం ఉంది, ఈ మ్యూజియంకు దుబాయ్, సింగపూర్ లో శాఖలు ఉన్నాయి. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటివి ప్రతిఒక్క నటుడికి మైలురాయి అని, తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మ్యూజియం నిర్వహకులకు తాను థ్యాక్స్ చెబుతున్నానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.



Click it and Unblock the Notifications
