Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆర్థిక సమస్యలు తొలగాలన్నా, రాకుండా చేసుకోవాలన్నా.. ఈ పనులు అస్సలే చేయొద్దు, జాగ్రత్త సుమీ!
ఆర్థిక సమస్యలు, పేదరికానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలన్నా, తగ్గించుకోవాలన్నా అనేక కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలా అని కేవలం డబ్బు విషయంలో అనవసర ఖర్చులు, వాటిని తగ్గించుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారేమో.
అలా తగ్గించుకున్నా కొన్ని సందర్భాల్లో అనేక అప్పులు చేయాల్సి వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఇందుకు ముఖ్య కారణం లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురికావడం. లేదంటే ఇంట్లో నుంచి లక్ష్మీ దేవి వెళ్లిపోవడం.

మామూలుగా ఇంట్లో చేసే కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇదే మనకు అనేక ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రతిరోజూ మనం చేసే ఈ తప్పులు ఇంటి ఆర్థిక పరిస్థితిని మరింత దిగాజార్చుతుంది. ఈ కారణంగా అలాంటి తప్పులు చేయవద్దు. అయితే ఆ తప్పులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పొద్దెక్కినా పడుకోకూడదు:
సూర్యోదయానికి ముందు లేదా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం చాలా మంచిది. వేకువజామునే నిద్ర లేవడం వల్ల మనలో సానుకూలత పెరుగుతుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. ఫలితంగా అనేక ఆర్థి సమస్యలు చుట్టుముడతాయి.
నీరు వృథా చేస్తే డబ్బు కూడా వృథానే:
అలాగే చాలా మంది ట్యాప్ ను సరిగ్గా ఆపేయరు. ఫలితంగా నీరు వృథాగా పోతుంది. అయితే ఆ నీరు ఎలా కారిపోతుందో ఇంట్లోని డబ్బు కూడా అదే రీతిలో ఖర్చయిపోతుందట.
ఆరోజుల్లో జుట్టు, గోర్లు కత్తిరించకూడదు:
కొంతమందికి ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం వంటివి చేస్తుంటారు. కానీ ఇలా చేయడం లక్ష్మీదేవికి అస్సలే ఇష్టం ఉండదట. ముఖ్యంగా గురువారం, ఏకాదశి వ్రతం .విష్ణుమూర్తికి ఇష్టమైన రోజులు. ఈ రోజుల్లో కనుక లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తే అనేక అప్పుల పాలవుతారు.
పనియేయని గడియారం ప్రమాదకరం:
ప్రతీ ఒక్కరి ఇంట్లో గడియారం ఉండడం చాలా అరుదైన విషయం. అయితే అవి అప్పుడప్పుడు ఆగిపోతాయి. దాని వల్ల కూడా అనేక నష్టాలు వస్తాయట. గడియారం సరిగ్గా పనిచేస్తేనే ఇంటికి మంచిదట. పని చేయని లేదా తప్పుడు గడియారాన్ని ఇంట్లో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు అధికం అవుతాయట.
అలాంటివి అస్సలే వాడకూడదు:
చాలా మంది డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం ఇష్టం లేక తెగిపోయిన చెప్పులకు పిన్నీసులు పెట్టుకొని మరీ వేసుకుంటూ ఉంటారు. కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాగే చినిగిపోయిన బట్టలను కూడా ధరించకూడదట. ఇంట్లో కూడా ఇలాంటి వాటిని ఉంచుకోకూడదట.
ఇంట్లో సాలె పురుగులు అయ్యాయంటే:
అలాగే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దుమ్ము, ధూళి లేదా సాలె పురుగులు ఎక్కువగా ఉంటే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అలాంటి ఇంట్లో నివసించే వాళ్లు ధనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి అశుభ వస్తువులు ఇంట్లో ఉంటే అశుభమే కాకుండా దరిద్రం కూడా ఏర్పడుతుంది.
దీపారాధన చేయకపోవడం మంచిది కాదు:
ఇలాగే హిందువులు ఇంట్లో దేవుడికి దీపం పెట్టకుండా ఉండడం, ఎలాంటి మంత్రాలు పఠించకుండా ఉండడం వంటివి చేయడం మంచిది కాదు. ఇంట్లో కచ్చితంగా వారానికి రెండు, మూడు రోజులు అయినా సరే దీపం పెట్టాల్సిందే. ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో దీపం పెట్టడం వల్ల ఇంట్లోని ధన సమస్యలు తొలగిపోతాయని అంటుంటారు. అలాంటి ఇళ్లనే లక్ష్మీ దేవి ఇష్టపడుతుందని చెబుతుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications