Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Chanakya Neeti : ఈ పనులను చేయవద్దని చాణక్యుడు మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు..!!
ఒక మనిషి విజయం సాధించడానికి ఎలాగైతే కారణాలు వుంటాయ్. ఫెయిల్ అవడానికి కూడా అవే కారణాలు వుంటాయ్. ఫెయిల్ అయిన వాడికి చాలా మంది ఆలోచన లేదు అనుకుంటారు. ఫెయిల్ అయిన తరువాత ఎందుకు ఫెయిల్ అయ్యానని ఆలోచించని వాడికి ఆలోచన లేదని అర్థం. అందుకే చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక మనిషి చేయాల్సిన, చేయకూడని పనులేంటో మనకు చెప్పివున్నాడు. ఆయన రచనలు వేల సంవత్సరాల క్రితానికి చెందినవైనా అవి ఇప్పటికీ రెలవెంట్‌గా వుంటాయ్. చాణక్యుడి రచనలు మనకు బాగా అర్థం కావడానికి రాధాకృష్ణ పిళ్లై గారు మనకోసం ఆయన రచనలను సులభమైన భాషలోకి తీసుకొని వచ్చారు. ఒక మనిషి ఎలాంటి పనులు చేయోద్దని చాణక్యుడు చెప్పాడో తెలుసుకుందాం.

మనిషికి తన జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా ఆ సమయంలో తన నిజమైన గుణాన్ని వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని చెబుతారు. ఎలాగైతే ఒక గంధపు చెట్టును నరికేస్తే సుగంధం వెదజల్లుతుంది, ఏనుగుకు ఎంత వయసు వున్నా అది నీళ్లల్లో సరదాగా ఆడుకుంటూనే వుంటుంది. అలాగే మను ఎన్ని కష్టాలు వున్నా మనలోని గుణాన్ని మార్చుకోకూడదు. ప్రపంచంలోని ఎందరో గొప్పవ్యక్తులు ఎన్ని కష్టాల్లో వున్నా వేరే వాళ్లని అగౌరవపర్చరు. ఎప్పుడూ హుందా తనాన్నే మెయింటెయిన్ చేస్తూ వుంటాడు.
మనలోని అసలైన గుణాన్ని మనం తెలుసుకొని వాటిని మనం కాపాడుకోవాలి. మనలోని అసలైన గుణాన్ని మనం ఎప్పుడూ వదిలేయకూడదు. ఎప్పుడైతే కష్టాల్లో కూడా మన గుణాన్ని మనం కోల్పోకుండా వుంటామో. ఇంకా ఎక్కువ మనుషులను, ఎక్కువ అవకాశాలను దక్కించుకుంటాం.
వేరే మనుషులను ఎప్పుడూ గౌరవంతోనే చూడాలి. వారికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడంలో తప్పులేదు. మన బంధువులను మనం ఎప్పుడూ గౌరవపర్చకూడదు. అలా చేస్తే మన బంధువలతో పాటు వారికి సంబంధించిన వ్యక్తులు కూడా మనతో మాట్లాడకపోవచచు. చిన్న గొడవ అయినా చాలా మంది కోర్టు మెట్లెక్కుతున్నారు. కాబట్టి మాట్లాడేముందు చాలా జాగ్రత్తగా వుండాలి.
మనకు ఎన్నో రహస్యాలు వుంటాయ్. ఆ రహస్యాలను ఎవ్వరికీ చెప్పకుండా వుండాలి. ప్రాణ స్నేహితుడికి కూడా ఆ రహస్యాలను చెప్పవద్దు. మనతో వున్నట్టే వేరే వారితో వుండకపోవచ్చు, కాబట్టి మనం చెప్పిన రహస్యం వారు ఇతరులకు చెప్పవచ్చు. ప్రాణ స్నేహితులకు కూడా ఇలాంటి విషయాలను చెప్పవద్దు. వారి అవసరం వచ్చినప్పుడు మన రహస్యాలను బయట పెట్టవచ్చు. ఏ బంధం కూడా శాశ్వతం కాదని చాణక్యుడు చెబుతాడు.
మరీ ఎక్కువ నిజాయితీ, మరీ ఎక్కువ మంచితనం కాదని చాణక్యుడు మనకు చెబుతున్నాడు. జీవితంలో నిజాయితీతోపాటు ప్రాక్టికల్‌గా కూడా ఆలోచించాలి. ఎవరైతే ఎక్కువగా నీతిగా వుంటారో ప్రపంచం వారినే ఎక్కువ మోసం చేస్తుంది. నిలువు చెట్టునే ఎలాగైతే కొట్టేస్తారో అలాగే మంచి వారికే ఎక్కువ మోసాలు జరుగుతాయ్.
మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో కూడా మనకు తెలియాలి. నైతిక విలువులు లేని వాళ్లని, చెడు ఆలోచనలు వున్న వారిని మనం దగ్గరికి రానివ్వకూడదు. ఎందుకంటే వాళ్లతో స్నేహం చేస్తే వాళ్లు చేసే చెడు పనులకు మనం నష్టపోతాం. నీ గుణాన్ని నీ స్నేహితుల ద్వారా తెలుసుకోవచ్చని చెబుతారు, ఎవరితో స్నేహం చేస్తున్నామో మనకు కఛ్ఛితంగా తెలిసి వుండాలి.
సముద్రంలో వర్షం పడ్డం. బాగా వెలుగున్న చోట దీపం పెట్టడం. బాగా ధనవంతుడికి డబ్బు సాయాన్ని చేయడం. దీని వల్ల ఏ లాభం వుండదు. కాబట్టి సహాయం చేయాలనుకుంటే యోగ్యుడికి మాత్రమే చేయాలి. మీ సహాయం పొందవలసిన వాళ్లకే చేయాలి. ఎవరైతే అత్యంత అవసరంలో వున్నారో వారికే మీ సహాయం దక్కి తీరాలి.
కొంతమందిని ఎవరూ మార్చలేరు. మీరు ఎంత చెప్పినా వారు వినరు. వినకపోవడం వల్ల ఎలాంటి లాభం వుండదు. ఒక మూర్ఖుడికి మంచి చెప్పడమంటే ఒక పెద్ద రాయికి తల బాదుకోవడమే.
ఒక విద్యార్ధి ఎప్పుడు కూడా సుఖం కోసం చూడకూడదు. ఎవరైతే సుఖం కోసం పనిచేస్తారో వాళ్లు ఘ్నానాన్ని పెంచుకోవాలని అనుకోరు. ఏం తినాలి, ఎక్కడ నిద్రపోవాలి, ఎలాంటి పార్టీకి వెళ్లాలి. ఏం చదవాలి, ఏం నేర్చుకోవాలనే ఆలోచనలు వారికి వుండవు.



Click it and Unblock the Notifications