Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Operation Sindoor: పాక్ పై యుద్ధం స్టార్ట్!..భారత పౌరులు వెంటనే ఇవి దగ్గర ఉంచుకోండి
జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ఈ దాడికి సూత్రధారి పాకిస్తాన్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిన భారత్..పాక్ పై మిలటరీ యాక్షన్ కి దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో తాజాగా పాకిస్తాన్ లో భారత్ లో ఉగ్రదాడులకు కుట్రపన్నుతున్నట్లు భావిస్తున్న 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు కలిసి ఈ మెరుపు దాడులను నిర్వహించాయి. భారత్ మెరుపు దాడుల్లో లష్కర్, జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్లు ధ్వంసం అయినట్లు సమాచారం. అయితే పాకిస్తాన్ జనం, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని భారత్ తెలిపింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది.
దేశవ్యాప్తంగా బుధవారం(మే 7) దేశంలోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ చేపట్టాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం లాంటి ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు లేదా శత్రు దాడి సమయంలో దేశ ప్రజలను అప్రమత్తం చేయడం, పౌర రక్షణ వ్యూహాలపై పౌరులకు శిక్షణ ఇవ్వడం,ఇప్పటికే ఉన్న బంకర్లను రెడీ చేయడం, భద్రతా సంస్థల సంసిద్ధతను పరీక్షించడం దీని లక్ష్యం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్,విశాఖపట్నం వంటి పలు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది.

మాక్ డ్రిల్ టైంలో ఏం చేయాలి
-మాక్ డ్రిల్ సమయంలో శత్రువుల దాడి గురించి అలర్ట్ చేయడానికి వైమానిక దాడి హెచ్చరిక సైరన్ లు మోగుతాయి. సైరన్ మోగిన వెంటనే ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోవాలి.
-ఇంట్లో లైట్లు,ఫ్యాన్లు అన్నీ ఆపేయాలి,కర్టెన్లు మూసేయాలి. బిల్డింగ్ మీదకూడా ఎలాంటి లైట్లు వెలగకూడదు.
-బిల్డింగ్ ల మీద ప్రకటనలకు సంబంధించిన లైట్లు కూడా ఆర్పేయాలి.
-కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మాక్ డ్రిల్ సైరన్ మోగితే..కారు హెడ్ లైట్ లీబీమ్ లో పెట్టాలి. కారు పక్కన పార్క్ చేసేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయకూడదు.
-బ్లాకౌట్ సమయంలో ఫోన్ కాల్ మాట్లాడొచ్చు కానీ ఒకవేళ ఆ సమయంలో మీరు జనం మధ్యలో ఉంటే ఫోన్ లైటింగ్ మాత్రం డిమ్ గా పెట్టాలి.
-మాక్ డ్రిల్ సమయంలో ఫార్మసీలు, హాస్పిటల్స్ అన్ని అత్యవసర సర్వీసులు తెరిచే ఉంటాయి.
ఇవి దగ్గర ఉంచుకోండి
కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ ప్రకారం అత్యవసర పరిస్థితుల కోసం పౌరులు మెడికల్ కిట్స్, టార్చ్, రేషన్, కొవ్వొత్తులు,నగదు తమ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. మొబైల్ సిగ్నల్స్ పోయే అవకాశం ఉంటుంది లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి నగదును దగ్గర ఉంచుకోవడం మంచిది.
5 దశబ్దాల తర్వాత
1971లో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో మన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతకంటే ముందు 1962లో భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు దేశంలోని కొన్ని చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు.



Click it and Unblock the Notifications