Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఈ నంబర్ ప్లేట్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టిన ఇండియన్.. అతను ఎవరో తెలుసా?
డబ్బులు ఖర్చు చేయాలంటే భారతీయుల తరువాతనే ఎవరైనా. ఎందుకంటే ఒక కారు కొంటె ఆ కారుకు లక్షలు విలువ చేసే నంబర్ ప్లేట్ తీసుకుంటారు. ఆ స్థాయిలో ఉంటుంది మన భారతీయుల ఖర్చులు. అయితే ఇది కొందరి విషయంలో మాత్రమే. అయితే దుబాయ్‌లో నివాసముంటున్న భారత దేశానికి చెందిన ఓ బిలియనీర్ అబూ సబా కేవలం కారు నంబర్ ప్లేట్ కోసం 80 కోట్లు ఖర్చు చేశాడు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భారతదేశంతో పాటు, దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయ బిలియనీర్లు వారి విలాసవంతమైన గృహాలు, అత్యంత ఖరీదైన కార్ల సేకరణలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అలానే దుబాయ్‌లో నివాసముంటున్న అబూ సబా అసలు పేరు బల్విందర్ సిన్హా. బల్విందర్ సిన్హా అనే బిలియనీర్‌కు అయిదు రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అందులో ఒక కారు రిజిస్ట్రేషన్‌కు అతను ఏకంగా 80 కోట్లు ఖర్చు చేశారట. ఇతను దుబాయ్‌లో 100 మిలియన్ డాలర్ల విలువ కలిగిన విలాసవంతమైన ఇంట్లో నివసిస్తారు.

ఇతనికి అయిదు రోల్స్ రాయిస్ కార్లతో పాటు ఇంకా ఎన్నో కార్లు కలిగి ఉన్నాయి. అందులో ఒక కారుకి 'D5' అనే నంబర్ కోసం ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో యావత్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. పైగా ఇండియాకు చెందిన ఔత్సాహికులు ఈ వార్త విని షాక్ అవుతున్నారు.
అబూ సబా కార్ కలెక్షన్స్
అబూ సబాకు విస్తారమైన కార్ల కలెక్షన్ ఉంది. అతని గ్యారేజ్‌లో రెండు రోల్స్ రాయిస్ కల్లినన్ SUVలు, రెండు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIలు ఉన్నాయి. దీంతో పాటు ఆకుపచ్చ రంగు కలిగిన బ్లాక్ బ్యాడ్జ్ కుల్లినాన్ కూడా ఉంది. దీంతో పాటు అనేక బెంజ్ కార్లు, ద్వితీయ శ్రేణి వాహనాలు కూడ లున్నాయి. నిజానికి చెప్పాలంటే అబూ సబూ వాహనాలకంటే ఆ వాహనాల రిజిస్ట్రేషన్లకు అతను ఖర్చు చేసిన మొత్తం, ఆ నంబర్ ప్లేట్ల ధర ఎక్కువ అని తెలుస్తోంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII స్పోర్ట్స్ కారు నంబర్ ప్లేట్ "T5"ని అతను 76 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారట.
ఈ మొత్తాన్ని ఏం చేస్తారంటే?
నంబర్ ప్లేట్ల కోసం వచ్చిన మొత్తాన్ని అక్కడి అధికారులు స్వచ్చంధ సంస్థలకు విరాళంగా ఇస్తారట. దీనికి "ఇది విజయం-విజయం క్షణం" అని చెపుతామని ఆయన పేర్కొంటున్నారు. అయితే తన గ్యారేజ్‌లో D5 ప్లేట్ కాకుండా, Mercedes-Benz G63 AMG "1" కలిగి ఉందని పేర్కొన్నారు. దీంతో పాటు "27" మరియు "49" కూడా ఉన్నాయి. తాను కొనుగోలు చేసిన మొదటి ఫ్యాన్సీ నంబర్ "48" అని వెల్లడించారు.
అబూ సబా ఎవరు?
అబూ సబా అలియాస్ బల్విందర్ సాహ్ని దుబాయ్‌లో నివసిస్తున్న ప్రముఖ భారతీయ బిలియనీర్‌లలో ఒకరు. 18 సంవత్సరాల వయస్సులో ఆయన తన మొదటి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అత్యంత లాభదాయకమైన కంపెనీలలో ఒకటైన రాజ్ సాహ్ని గ్రూప్(RSG గ్రూప్ ఆఫ్ కంపెనీస్) యజమాని నివేదికల ప్రకారం, అబూ సబా యొక్క సంపద 1.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది.



Click it and Unblock the Notifications