Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
వారానికి 90 గంటల పని: ఇన్ఫోసిస్ లో దారుణ పరిస్థితులు..సంచలన నిజాలు బయట పెట్టిన ఉద్యోగి
ఉద్యోగుల పని గంటలపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణంగా ఎల్ ఎండీ టీ కంపెనీ చైర్మన్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలే. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా పనిచేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. నెటిజన్లతో పాటు ప్రముఖ కంపెనీల అధినేతలు, సెలబ్రిటీలు కూడా సుబ్రమణ్యం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వస్తున్నాయి.
ఉద్యోగుల పనిగంటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ సమయంలో పూణేలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో సిస్టం ఇంజినీర్ గా పనిచేసే భూపేంద్ర విశ్వకర్మ తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. భూపేంద్ర తన రాజీనామాకు చెప్పిన కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఉద్యోగం లేనప్పటికీ ఇన్ఫోసిస్ సంస్థను విడిచిపెట్టడానికి గల కారణాలను లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా భూపేంద్ర తెలియజేశారు.

ఇన్ఫోసిస్ పై భూపేంద్ర చేసిన ఆరోపణలివే
హైక్ లేని ప్రమోషన్, టాక్సిక్ క్లైంట్ కల్చర్, పని విషయంలో సీనియర్లు ప్రశంసించినా జీతాలు పెరగకపోవడం, ఆన్ సైట్ పంపేవాళ్లని మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లాడే బాధ ఆధారంగా ఎంపిక చేస్తున్నారని,హైరింగ్ జరపకుండా ఉన్న ఉద్యోగులపై ఎక్కువ వర్క్ లోడ్ వేస్తున్నారంటూ లింక్డ్‌ఇన్ పోస్ట్ లో భూపేంద్ర తెలిపారు. సిస్టమ్ ఇంజనీర్ నుండి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్ గా ప్రమోషన్ పొందిన తర్వాత కూడా ఇన్ఫోసిస్ లో ఆర్థిక వృద్ధి లేకపోవడంతో తాను ఇబ్బంది పడ్డానని భూపేంద్ర తెలిపారు. ఎంత కష్టపడుతున్నా కూడా మూడు సంవత్సరాలుగా జీతం పెంపు లేదని వాపోయాడు.
అట్రిషన్ కారణంగా తన టీమ్ లో ఉండేవాళ్ల సంఖ్య 50 నుండి 30కి తగ్గించబడిందని.. కొత్త వాళ్లని నియమించుకోకుండా ఉన్న ఉద్యోగులమీదనే అదనపు పనిభారాన్ని యాజమాన్యం పెట్టిందని..ఈ అధిక భారం మోస్తున్నా కూడా ఎటువంటి పరిహారం లేదా గుర్తింపు లేదని భూపేంద్ర వాపోయాడు.
ఆ ప్రమాదం తప్పదు
ప్రాథమిక సమస్యలను నిర్లక్ష్యం చేసే కార్యాలయంలో ఉండటం కంటే తన ఆత్మగౌరవం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు భూపేంద్ర తన పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఇటువంటి విషపూరితమైన పద్ధతులు అదుపు లేకుండా కొనసాగితే సంస్థలు తమ ప్రతిభను మాత్రమే కాకుండా తమ విశ్వసనీయతను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని భూపేంద్ర తన పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఈ ఆందోళనలను పరిష్కరించాలని ఆయన కార్పొరేట్ దిగ్గజాలను కోరారు.



Click it and Unblock the Notifications