Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
వారసత్వ రాజకీయాలతో లాభమా?..పాలిటిక్స్ లోకి రావాలంటే ఏ క్వాలిటీ ఉండాలి?
మనదేశంలో డబ్బు సంపాదనకు ఈజీగా ఉండే మార్గాలు రెండే. అందులో ఒకటి రాజకీయం రెండోది మతం. ఎవరు ఏది చెప్పినా వాస్తవ పరిస్థితులో అయితే నిజం ఇదే. ఓ సాధారణ ఉద్యోగి కొడుకు ఎంత కష్టపడి చదివినా లేదా ఎంతో కష్టపడి దేశాన్ని రక్షించాలని మిలటరీకి వెళ్లిన వ్యక్తి అయినా సరే వీళ్ల భవిష్యత్తుని నిర్ణయించేది రాజకీయ నేతలే. మనదేశంలో వాస్తవానికి రాజకీయాల్లోకి రావడానికి ఎలాంటి ప్రత్యేకమైన క్వాలీటీస్ అవసరం లేదు. కానీ మిగతా ఏ ఉద్యోగాలకైనా లేదా సర్వీస్ కైనా వారికి ప్రత్యేకమైన క్వాలీటీస్ ఉండి తీరాల్సిందే.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిపోయినా కూడా ఇప్పటికీ డెవలప్ మెంట్ విషయంలో మనం చాలా వెనుకబడే ఉన్నాం. మన తర్వాత సాతంత్యం పొందిన దేశాలు కూడా డెవలప్ మెంట్ లో దూసుకుపోతున్నాయి. దీనికి ప్రధానకారణం రాజకీయ వారసత్వం. రాజకీయ వారస్వంతో వచ్చిన వాళ్లందరూ దేశాన్ని దోచుకునేవాళ్లు అని చెప్పలేం. కొందరు మంచి చేయాలని వచ్చినవాళ్లు కూడా ఉంటారు కానీ మన అదృష్టం ఏంటంటే అలాంటోళ్లు ముగ్గురు నలుగురు కూడా లేకపోవడమే.

కొన్నేళ్ల క్రితం రాజకీయాలు అంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. అయితే అప్పట్లోనే రాజకీయం విలువ గుర్తించిన కొందరు మేధావుల ముసుగులో రాజకీయాల్లోకి చొరబడ్డారు. ఇక మొదలైంది అవినీతికి ఆరంభం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో రాజకీయ పదవుల్లో చొరబడ్డవాళ్ల వారసులే ఇప్పటికీ మన దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. వాళ్లు తప్ప శక్తివంతమైన నాయకులుగా ఎదిగినవాళ్లు ఎక్కోడో ఒకరిద్దరు తప్ప ఎవరూ కనబడరు.
ఓ సామాన్య కుటుంబంలో పుట్టి చిన్న ఉద్యోగం సంపాదించడానికి చాలా కష్టపడుతుంటారు లక్షలాది మంది యువకులు. ఓ ఉద్యోగం సంపాదించాలంటే సవాలక్ష ప్రశ్నలు అడిగి టార్చర్ పెడతారు. తీరా ఉద్యోగం ఇచ్చినా టార్గెట్ లు పెట్టి శారీరకంగా,మానసికంగా హింసకు గురిచేస్తుంది. అయితే తమ స్కిల్స్ తో చాలామంది వాటిని తట్టుకుంటారు అది వేరే విషయం. అదే రాజకీయాల్లో ఎమ్మెల్యేనో ఎంపీనో లేదా మరేదైనా పదవి పొందాలంటే ఏ క్వాలిఫికేషన్లు ఉన్నాయ్?కోట్ల రూపాయల డబ్బు,ఎదుటువారిని ఇస్టం వచ్చినట్లు తిట్టడం, మర్డర్స్ చేయించడం లేదా చేయడం, జైళ్లల్లో గడిపిరావడం వంటి క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు రాజకీయ నాయకుడైపోవచ్చు. అదే రాజకీయ నాయకుల కుమారులకైతే కేక్ వాక్. ఓ సారి ఓడిపోయినా మళ్లీ మళ్లీ పోటీ చేసేందుకు అవకాశాలు వస్తుంటాయి. గెలిస్తే పదవులు కూడా వస్తుంటాయి. ఓ సారి పదవిలోకి వచ్చాక మళ్లీ మళ్లీ అనే ఆశ ఆటోమేటిక్ గా వాళ్లలో మొదలవుతుంది. మనదేశానికి పట్టిన దరిద్రం ఇదే. పైగా రాజకీయ పార్టీలు డబ్బులు ఉండే నేతలనే మీకు ఇంట్రెస్ట్ లేకుంటే టిక్కెట్ మీ వారసుడికి ఇస్తాం అని ఆఫర్ చేస్తుంటాయి.
రాజకీయ నాయకుడు పుత్రులు ఏం చదివినా చదవకపోయినా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా కూడా ఈజీగా రోజు ఖర్చు పెట్టుకోవడానికి లక్షల రూపాయల డబ్బు చేతికి అందుతుంటది. వద్దన్నా రాజకీయాల్లో ,ఇతర పదవులు వస్తుంటాయి. ఏ అర్హత ఉందని అతనికి ఆ పదవి ఇచ్చారు అంటే సమాధానం చెప్పేటోళ్లు ఎవ్వరూ ఉండరు. అడిగిన ప్రశ్నకు సమాధనం చెప్పకుండా వాళ్లు అలా వీళ్లు ఇలా అంటూ టైం గడిపేస్తారు. అయితే అర్హతలు లేకుండా ఎవరికైనా ఏ పదవి అయినా ఎందుకు ఇవ్వాలి. ఏఐఎస్,ఐపీఎస్ఎఫ్ఎస్ వంటి దేశ అత్యున్న సర్వీసులకు ఎంపిక కావాలంటే ఏళ్ల తరబడి కష్టబడాలి. అదే రాజకీయ నాయకుడవ్వాలంటే మాత్రం ఎందుకు అర్హత ఉండకూదు.
తామేమి వారసత్వంలో రాలేదు ప్రజల ఆశీర్వాదం పొందే రాజకీయాల్లో కొనసాగుతున్నాం అంటూ కొందరు తెలివైన యువనేతలు కబుర్లు చెబుతుంటారు. అయితే మీకో లేదా నాకో ఫలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ ఇ్వవండి నాకు ఈ అర్హతలు ఉన్నాయ్ అని చెప్తే పార్టీలు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? పైగా ఎంత ఖర్చు పెట్టగలరు అని ఓపెన్ గా పార్టీలు అడిగేస్తుంటారు..డబ్బులు నా దగ్గర లేవు అంటే దొబ్బేయ్ అంటాయి పార్టీలు. ఏదో అప్పుడప్పుడు వాళ్లకి ఊడిగం చేసే ఒకరిద్దరి మొఖాన ఒక పదవి పడేసి జీవితాంతం వాళ్ల కాళ్ల దగ్గర కుక్కలా వాళ్లని కట్టేసుకుంటారు తప్ప వాళ్లు తనకన్నా ఇంకా ఎదగాలని అసలు కోరుకోరు. వాస్తవంలో కనబడుతున్న పరిస్థితి ఇదే మరి.
సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలంటే కష్టపడాలి అంటారు అయితే అలా కష్టపడితే ఎదిగేది కోటికి ఒక్కరు మాత్రమే అది కూడా వారికి లక్ ఉంటే తప్ప ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ముందు అవకాశం రావాలి కదా. కష్టపడితే అవకాశం వస్తుంది అంటారు అయితే అసలు దానికి ఏదైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? అసలు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా మొత్తం రాజకీయ వ్యవస్థలో సమూల ప్రక్షాళన రావాలంటే మనదేశంలో ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా ఎమ్మెల్పీ అవ్వాలన్నా కూడా ముందు ఖచ్చితంగా ఆర్మీలోకి వెళ్లి దేశ సేవ చేసి కొంతకాలం రావాలి. ఇలాంటి రూల్ పెడితే అప్పుడైనా వారిలో క్రమశిక్షణ, ఇంటిగ్రీటీ ఉండి రాజకీయాల్లో ఎలాంటి అవినీతి లేకుండా చేసి మన దేశాన్ని అమెరికా కంటే కేవలం ఐదేళ్లలోనే ముందుంచుతారు. ఇలా చేస్తే ప్రపంచ నెం.1 గా భారత్ ఎదుగుతుంది. అవినీతి అనే పేరు మనదేశంలో ఉండదు. ఎక్కడ చూసి డెవలప్ మెంట్ తో భారత్ వెలిగిపోతుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే దేశ పార్లమెంట్ కి దమ్ము ఉండాలి. మరి చూద్దాం. రాజకీయాల్లోకి రావాలి అంటే ముందు ఆర్మీలో పనిచేసిన అనుభవం ఉండాలి అని ఎవరైనా గైడ్ లైన్స్ పెడతారా అని ఆశగా ఎదురుచూద్దాం.



Click it and Unblock the Notifications











