పునర్జన్మ నిజమే!..మరణించిన 3 నెలలకే మళ్లీ పుట్టాడు..రియల్ స్టోరీ

మరణం తర్వాత జీవితం ఉందా? ఈ ప్రశ్న మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి మనల్ని వేధిస్తూనే ఉంది. ఈ ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు, తత్వవేత్తలు, సంస్కృతులు విభిన్న సమాధానాలు ఇచ్చాయి. వాటిలో అత్యంత ప్రాచీనమైన, విస్తృతమైన నమ్మకాలలో ఒకటి పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ అంటే మళ్లీ జన్మించడం. ఈ సిద్ధాంతం ప్రకారం జీవి భౌతిక శరీరం మరణించినప్పటికీ, దానిలోని ఆత్మ నశించదు. అది తన కర్మ ఫలాలను అనుభవించడానికి కొత్త శరీరాన్ని ధరించి ఈ లోకంలోకి తిరిగి వస్తుంది.

సైంటిస్టులు, తత్వవేత్తలు ఎన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించినా పునర్జన్మ అనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. అయితే కొన్ని సంఘటనలు మన నమ్మకాలను సవాలు చేస్తాయి, మన ఆలోచనలకు అందని నిజాలను కళ్ళ ముందు ఉంచుతాయి. అలాంటి ఒక అద్భుతమైన, సంచలనాత్మకమైన కథే ఆగ్రాకు చెందిన టిట్టూ సింగ్ పునర్జన్మ వృత్తాంతం. ఇది కేవలం కట్టుకథ కాదు..ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచిన నిజ జీవిత గాథ.

Is Reincarnation Real The Story of Titu Singh is the Ultimate Answer

డిసెంబర్ 12, 1983న ఆగ్రా సమీపంలోని ఒక గ్రామంలో తోరన్ సింగ్ (ముద్దుపేరు టిట్టూ) జన్మించాడు. తనకు 18 నెలల వయస్సు అప్పటి నుంచే టిట్టూ వింతగా మాట్లాడటం ప్రారంభించాడు. తాను ఇక్కడి వాడిని కాదని, తన పేరు టిట్టూ కాదని, సురేష్ వర్మ అని చెప్పేవాడు. నా భార్య పేరు ఉమ, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఆగ్రాలో నాకు సురేష్ రేడియో అనే దుకాణం ఉండేది అని పదే పదే చెప్పసాగాడు. మొదట్లో తల్లిదండ్రులు ఇది చిన్నపిల్లల ఊహ అని కొట్టిపారేశారు. కానీ టిట్టూ తన గతాన్ని మర్చిపోలేదు. టిట్టూకి 5-6 ఏళ్లు వచ్చేసరికి అతడికి గత జన్మ విషయాలన్నీ కంప్లీట్ గా గుర్తుకొచ్చేశాయి. తనను 1983 ఆగస్టు నెలలో తన కారులో వెళ్లుండగా కొందరు కారుని అడ్డగించి తనను తుపాకీతో కాల్చి చంపేశారని, బుల్లెట్ తన తల కుడి వైపున తగిలిందని వివరంగా చెప్పేవాడు. ఆశ్చర్యకరంగా టిట్టూ పుట్టినప్పటి నుంచే అతని తల కుడి వైపున, కణత దగ్గర ఒక పుట్టుమచ్చ ఉంది. అది అచ్చం బుల్లెట్ గాయంలా కనిపించడం అందరినీ షాక్ కు గురిచేసింది. సురేష్ వర్మ చనిపోయిన 3 నెలల తర్వాత డిజెంబర్ 12న దగ్గర్లోని మిలటరీ హాస్పిటల్ లో టిట్టూ జన్మించాడు.

టిట్టూ పట్టుదల రోజురోజుకు ఎక్కువకావడంతో అతని తండ్రికి అనుమానం మొదలైంది. కొడుకు చెప్పిన వివరాలను పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. టిట్టూ అన్నయ్యను ఆగ్రాలోని ఆ ప్రాంతానికి పంపించాడు. అక్క టిట్టూ చెప్పిన ప్లేస్ లో నిజంగానే సురేష్ రేడియో అనే దుకాణం ఉండటం చూసి అతను నివ్వెరపోయాడు. విచారించగా కొన్ని సంవత్సరాల క్రితం సురేష్ వర్మ అనే యజమానిని కాల్చి చంపారని స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకున్న సింగ్ కుటుంబం..టిట్టూను తీసుకుని1986లో సురేష్ వర్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ జరిగిన సంఘటనలు ఎవరికైనా ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి.

అక్కడ ఉన్న సురేష్ భార్య ఉమను, తన పిల్లలను వెంటనే గుర్తుపట్టాడు. ఇవి నా ఫోటోలు, ఇది నా భార్య అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. సురేష్ హత్యకు గురైన రోజు జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్టు వివరించాడు. తాను కారులో వస్తుండగా ఇద్దరు వ్యక్తులు తనను అడ్డగించి, కాల్చి చంపారని చెప్పాడు. ఆ ఇంట్లో చేసిన మార్పులను కూడా టిట్టూ ఖచ్చితంగా చెప్పాడు. నేను ఉన్నప్పుడు ఈ గది ఇలా ఉండేది కాదు అని చెప్పి, ఉమను ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా ఇంట్లో తాను ఒకచోట దాచిన బంగారు పెట్టె గురించి చెప్పి దానిని తీసి చూపించాడు. ఈ విషయం ఉమకు తప్ప మరెవరికీ తెలియదు.

ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం పునర్జన్మలపై పరిశోధన చేస్తున్న దేశ,విదేశాలకు చెందిన కొందరు సైంటిస్టుల వరకు చేరింది. వారు టిట్టూ గ్రామానికి చేరుకొని టిట్టూ కేసును లోతుగా అధ్యయనం చేశారు. టిట్టూ చెప్పిన వివరాలు, సురేష్ వర్మ జీవితం, మరణం గురించిన వాస్తవాలు నూటికి నూరు శాతం సరిపోలాయని నిర్ధారించారు. సురేష్ వర్మ పోస్ట్‌ మార్టం రిపోర్టులో బుల్లెట్ గాయం ఎక్కడైందో, అదే ప్రదేశంలో టిట్టూకు పుట్టుమచ్చ ఉండటం ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా నిలిచింది. టిట్టూ ఇచ్చిన సమాచారం ఆధారంగా సురేష్ వర్మ హత్య కేసులో నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తర్వాత టిట్టూ ఈ జన్మలో తను ఎవరికైతే జన్మించాడో వారి దగ్గరే ఉండి చదువుకొని అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు ఉమా కుటుంబాన్ని వెళ్లి కలిసి వస్తుంటాడు.

Desktop Bottom Promotion