Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
మహా ప్రళయం: జులై నెలలో సునామీ?..డేట్ కూడా చెప్పేసిన బాబా వంగా..
జూలై 2025.. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే ఓ భయంకరమైన తేదీ కానుందా? సునామీ వచ్చి వేల,లక్షల మంది మరణిస్తారా?బాబా వంగా..ఈ పేరు వినని వారు చాలా తక్కువ మందే ఉంటారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా చిన్న వయస్సులో ప్రమాదవశాత్తూ కంటిచూపు కోల్పోయింది. తర్వాత ఆమె తన జ్ణానదృష్టితో అనేక భవిష్యత్తు సంఘటనలను చూడగలిగిందని నమ్ముతారు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను,మానవాళికి సంభవించబోయే ప్రమాదాల గురించి బాబా వంగా చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి కూడా. బాబా వంగా అంచనాలకు తిరుగులేదు అని ప్రపంచం నమ్మింది.
న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై ఉగ్రదాడి, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ,రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా ఆమె చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. ఇప్పుడు బాబా వంగా మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యారు. జులై 5న సునామీ వస్తుందని వేసిన ఓ అంచనాతో ఆమె వార్తల్లో నిలిచింది. అయితే ఈ సునామీ అంచనా వేసింది బల్గేరియా బాబా వంగా కాదు..జాపాన్ బాబా వంగా.

సునామీ వస్తోంది
జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ యాంగా ఆర్టిస్ట్ రియో టట్సుకి(Ryo Tatskuki)ని జపాన్ బాబా వంగా అని పిలుస్తుటారు. ఈ జపాన్ బాబా వంగా తీన కామిక్ పుస్తకం 'ది ప్యూచర్ ఐ సా'లో జులై5,2025న జపాన్ లో సునామీ వస్తుందని అంచనా వేసింది. ఆమె రాసిన ఈ బుక్ 1999లో మొదటిసారి పబ్లిష్ అయ్యింది. అందులో రియో అనేక భవిష్యత్తు సంఘటలను తన దివ్య దృష్టితో చూసినట్లు తెలిపారు. ప్రారంభంలో ఈమెకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోయినా ఆమె అంచనాలు కొన్ని నిజమవడంతో ఆమె పాపులారిటీ పొందింది. ఈ జపాన్ బాబా వంగా అంచనాల్లో 1995 కోబ్ భూకంపం, గాయకుడు ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం, మార్చి 2011లో వచ్చిన తోహోకు భూకంపం, సునామీ ఉన్నాయి.. ఇవి 18,000 మందికి పైగా మరణాలకు కారణమయ్యాయి, ఫుకుషిమా అణు సంక్షోభానికి దారితీశాయి.
బాబా వంగా తన బుక్ లో జులై 2025 గురించి చెప్పిందిదే
రియో టట్సుకి తన పుస్తకం 2021 అప్ డేట్ వెర్షన్ లో జూలై 2025లో ఒక విపత్కర సంఘటన రాబోతుందని అంచనా వేసింది. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్రగర్భంలో చీలిక ఏర్పడుతుందని, ఆ ప్రళయఘోష నుంచి 2011లో జపాన్ ను అతలాకుతలం చేసిన సునామీ కంటే మూడు రెట్లు పెద్దదైన రాకాసి అలలు విరుచుకుపడతాయని ఆమె తన పుస్తకంలో రాసింది. అంతేకాకుండా సముద్రం మరుగుతోంది అంటూ ఆమె చేసిన వర్ణన భూగర్భంలో రగులుతున్న అగ్నిపర్వతాలకు, పెను భూకంపాలకు సంకేతమని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

జపాన్ ను నిజంగా సునామీ తాకితే అది పొరుగు దేశాలైన ఫిలిప్పీన్స్, తైవాన్, ఇండోనేషియా, నిత్యం అగ్నిపర్వతాలతో సతమతమయ్యే ఉత్తర మరియానా దీవులపైనా కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. జపాన్ బాబా వంగా ఈ అంచనా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది దీనిని నిజమని భావిస్తున్నారు, మరికొందరు దీనిని మూఢనమ్మకం అని అంటున్నారు. అయితే ఆమె గతంలో చేసిన అంచనాలు చాలా ఖచ్చితమైనవని నిరూపించబడ్డాయి.
జపాన్ టూర్ క్యాన్సిల్
జపాన్ బాబా వంగా అంచనాలు వైరల్ అవడంతో చాలామంది తమ జపాన్ టూర్ లను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్టైట్ టిక్కెట్లు,జాపాన్ కి టూర్ ప్యాకేజీలు బుక్ చేసకున్న చాలామంది తమ టూర్స్ క్యాన్సిల్ చేసుకుంటారు. జపాన్ కు పొంచి ఉన్న ముప్పు గురించిన ఆందోళనలు పర్యాటకుల ప్రణాళికలను తలకిందులు చేస్తున్నాయి. దీనితో టూర్ ఏజెన్సీల వ్యాపారం మందగించింది. హాంకాంగ్‌కు చెందిన WWPKG ఏజెన్సీ.. ఈస్టర్ సెలవుల కోసం జపాన్‌కు రావాల్సిన బుకింగ్‌లు 50శాతం తగ్గినట్లు ప్రకటించింది



Click it and Unblock the Notifications