Latest Updates
-
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.! -
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.!
Jiah Khan Suicide Case: సూరజ్ పంచోలీ నిర్దోషి, జియాఖాన్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు
అప్పట్లో సంచలనం సృష్టించిన బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సూరజ్ పంచోలీని నిర్దోషిగా తేల్చింది. తనను దోషిగా గుర్తించేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని అందుకే నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.

లేఖ ఆధారంగా సూరజ్ అరెస్టు:
2013 జూన్ 3వ తేదీన బాలీవుడ్ నటి జియా ఖాన్ ముంబయిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత వారం రోజులకు పోలీసులు తన రాసినట్లుగా చెబుతున్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్ ఆధారంగా సూరజ్ పంచోలీని నిందితుడిగా గుర్తించి సెక్షన్ 306 కింద అరెస్టు చేశారు.
సూరజ్ పంచోలీకి జియాఖాన్‌కు మధ్య సంబంధం:
ఆదిత్య పంచోలీ, జరీనా వహాబ్ ల కుమారుడే సూరజ్ పంచోలీ. జియాఖాన్ కు సూరజ్ పంచోలీకి మధ్య సంబంధం ఉండేది. జియా ఖాన్ తో సూరజ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని జియాఖాన్ తల్లి రబియాఖాన్ పేర్కొంది. 2012 నుండే వారు డేటింగ్ లో ఉన్నారని చెప్పుకొచ్చింది.
జియాఖాన్‌ను ఆత్మహత్యకు అతడే కారణం:
జియాఖాన్ ఆత్మహత్యకు సూరజ్ పంచోలీయే కారణమని జియాఖాన్ తల్లి రబియా ఖాన్ ఆరోపించింది. 2013 అక్టోబరులో సీబీఐ విచారణ కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు జియాఖాన్ ఆత్మహత్య చేసుకోలేదని, తనని హత్య చేసి సూసైడ్ గా చిత్రీకరించారని ఆరోపించింది. జియాను సూరజ్ శారీరకంగా, మానసికంగా వేధించాడని, తీవ్రంగా హింసించేవాడని ఆరోపించింది. తను నరకం చూపించేవాడని చెప్పుకొచ్చింది.
రబియా ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసుల నుండి జియాఖాన్ మృతి కేసును బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు టేకప్ చేశారు. అప్పటి నుండి వారు విచారిస్తున్నారు. ఇవాళ విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు సూరజ్ పంచోలీని నిర్దోషిగా గుర్తించింది.
రబియా ఖాన్ చేసిన ఆరోపణలను సూరజ్ పంచోలీ ఖండిస్తూ వచ్చాడు. తానేమీ చేయలేదని చెప్పుకొచ్చాడు. జియా ఖాన్ ఆత్మహత్యకు తనకు సంబంధంలేదని వాదించాడు. చివరగా ఈరోజు తీర్పు రావడంతో తాను నిర్దోషిగా బయటకు వచ్చాడు.
జియాఖాన్ గురించి..:
* న్యూయార్క్ లో పుట్టి పెరిగింది జియా ఖాన్. ఇంగ్లీష్-అమెరికన్ నటిగా పేరు పొందింది. తన పేరును నఫిసా రిజ్వి ఖాన్ నుండి జియాఖాన్ గా మార్చుకుంది.
* అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన 'నిశబ్ద్' తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జియా ఖాన్. తాను మొత్తంగా చేసింది కేవలం మూడే చిత్రాలు. అయినప్పటికీ చాలా క్రేజ్ సంపాదించుకుంది.
* నిశబ్ద్ తో పాటు అమీర్ ఖాన్ నటించిన గజిని, హౌజ్‌ఫుల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.



Click it and Unblock the Notifications