Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Karnataka Assembly Elections 2023: స్వామి మాతప్పులు క్షమించి. మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించు, ఇది లెక్క
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింట్ మొదలైయ్యింది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు కాకముందే బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు శనివారం ఉదయం ఆలయాలకు వెళ్లి తాము కచ్చితంగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించేలా ఆశీర్వదించండి స్వామి అంటూ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటకలోని పలు దేవాలయాలు శనివారం ఉదయం కిటకిటలాడాయి.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ టిక్కెట్లతో పాటు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2, 615 మంది పోటీ చేశారు. మూడు పార్టీల నాయకుల కంటే స్వతంత్ర పార్టీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి దైవభక్తి ఎక్కువగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ వారి కులదైవాన్ని పూజించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవవరాజ్ బోమ్మయ్ అనేక దేవాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
శనివారం ఉదయం కర్ణాటకలోని అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీకి చెందిన నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు కార్యాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటికే ఓటర్లు నాయకుల భవిష్యత్తును ఈవీఎంల్లో పెట్టేశారు. ఇప్పుడు ఎన్ని పూజలు, వ్రతాలు, హోమాలు చేసినా వారి భవిష్యత్తు మారే అవకాశం లేదు.
మా నాయకుడు గెలవాలని పలువురు కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేకంగా హోమాలు నిర్వహిస్తున్నారు. కొందరు నాయకులు అయితే ప్రత్యేక పూజలు చేసిన తరువాత గుడిలో పూజారి దగ్గర అడిగి ఇప్పించుకున్న నిమ్మకాయలు జోబుల్లో పెట్టుకుని కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్లిపోయారు. కర్ణాటకలోని కొందరు నాయకులకు నిమ్మకాయల జాతకాన్ని నమ్ముతారు.
సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎంలు సిద్దరామయ్య, జగదీష్ శెట్టర్, పలు పార్టీల నాయకులు వి. సోమన్న, గాలి జనార్దన్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి, లక్ష్మీ అరుణ, శ్రీరాములు, నిఖిల్ కుమారస్వామి, హెచ్ డీ. రేవణ్ణ, అశోక్, డీకే శివకుమార్, సురేష్ కుమార్, శరత్ గౌడ, ఎంటీబీ నాగరాజ్ తదితరులు శనివారం ఉదయం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఓటరు దేవుళ్లతో పాటు పైన ఉన్న భగవంతుడు కూడా మమ్మల్ని కరుణించాలని, మమ్మల్ని చల్లగా చూడాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.



Click it and Unblock the Notifications
