Latest Updates
-
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!
Kerala To Mecca: కేరళ నుంచి మక్కా వరకు పాదయాత్ర, 8,600 కిలోమీటర్లు, 370 రోజుల ప్రయాణం
ఏడాదికి పైగా పాదయాత్ర. ఏకంగా 8 వేల 600 కిలోమీటర్ల మేర నడక. ఒకటీ రెండూ కాదు ఏకంగా 6 దేశాలు దాటుకుని గమ్యస్థానానికి చేరిన కేరళ యువకుడు. సంవత్సరానికి పైగా నడుస్తూనే ఉన్నాడు. ఏకంగా 370 రోజులు నడిచి తను చేరాలనుకున్న పవిత్ర స్థలానికి చేరుకున్నాడు. యూట్యూబర్ అయిన షిహాబ్ గతేడాది తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు మక్కాకు చేరుకున్నాడు.

ముస్లింల అత్యంత పవిత్ర స్థలం సౌదీ అరేబియాలో ఉన్న మక్కా. ప్రతి ఏటా హజ్ యాత్ర పేరుతో ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకుంటారు. అల్లాహ్ కు వేడుకుంటారు. హజ్ యాత్రకు వెళ్లడం చాలా మంది ముస్లింల జీవిత లక్ష్యంగా ఉంటుంది. అందుకోసం జీవితాంతం కష్టపడుతుంటారు. అంతటి పుణ్య స్థలానికి ఏటా వేలాది మంది తమ తమ ప్రాంతాల నుంచి కాలినడకన వెళ్తుంటారు. అలా మన దేశం నుంచి షిహాబ్ చొత్తురు అనే కేరళ వ్యక్తి వెళ్లాడు.
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన షిహాబ్ గత సంవత్సరం జూన్ 2వ తేదీన కేరళ నుంచి తన మక్కా యాత్రను ప్రారంభించాడు. ఇండియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలను దాటుకుని మే రెండో వారంలో ఎట్టకేలకు సౌదీ అరేబియా చేరుకున్నాడు. స్వయానా యూట్యూబర్ అయిన షిహాబ్.. తన ప్రయాణ విశేషాలను ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఫాలోవర్లతో పంచుకుంటూనే ఉన్నాడు.
పాదయాత్ర సుఖంగా ఏం సాగలేదు:
కేరళ నుంచి ప్రయాణం ప్రారంభించిన షిహాబ్ జర్నీలో కష్టాలూ ఎదుర్కొన్నాడు. ఇండియాలో తన ప్రయాణం పూర్తిగా సాఫీగానే సాగింది. తన ప్రయాణ విశేషాలు చెబుతూ ఆయా ప్రాంతాల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగాడు. అయితే పాకిస్థాన్ సరిహద్దుల్లోని వాఘాకు చేరుకోన్నప్పటి నుంచి షిహాబ్ కు కష్టాలు ఎదురయ్యాయి.
వీసా లేకపోవడంతో పాకిస్థాన్ అధికారులు షిహాబ్ కు నో చెప్పేశారు. వాఘా బార్డర్ లోనే అడ్డుకున్నారు. అయితే వాఘాలోని ఒక స్కూల్ వద్ద నెలల పాటు ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు షిహాబ్ కు వీసా దక్కింది. ఆ తర్వాత పాకిస్థాన్ లోకి ఎంటరయ్యాడు. అనంతరం ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాల మీదుగా సౌదీ అరేబియా చేరుకున్నాడు.
తల్లితో పాటు ప్రార్థనలు:
సౌదీ అరేబియా చేరుకున్న అనంతరం ఇస్లామిక్ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం, పవిత్రత కలిగిన మదీనాతో 21 రోజుల పాటు గడిపాడు. ఆ తర్వాత మక్కాకు బయల్దేరాడు. మదీనా నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కాకు కేవలం 9 రోజుల్లో చేరుకున్నాడు. షిహాబ్ తల్లి మక్కాకు చేరుకున్న అనంతరం ఇద్దరు కలిసి హజ్ ప్రార్థనకు హాజరు కానున్నరట.



Click it and Unblock the Notifications
