Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్‌విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.!
సాయంత్రం అనగానే స్నాక్స్ గుర్తొస్తాయి. చిరుతిళ్లుగా ఏదో ఒకటి కడుపులో పడేస్తేనే ఆ క్రేవింగ్స్ తగ్గి తృప్తి తీరుతుంది. అలా అని ఏది పడితే అది తినలేం. ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికి వెళ్లని వారికి ఇది పెద్ద సవాల్. అందుకే ఇంట్లోనే హెల్తీగా చేసుకుని తినడానికి ఇష్టపడతారు. ఇందుకు బెస్ట్ ఆప్షన్ ఎగ్ సలాడ్ శాండ్‌విచ్. జపనీస్ స్టైల్‌లో చేసే ఈ శాండ్‌విచ్.. రుచికి రుచి మాత్రమే కాదు.. ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేలా నోరూరిస్తూ ఉంటుంది. ఎగ్ సలాడ్ శాండ్‌విచ్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

ఎగ్ సలాడ్ శాండ్‌విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
మయొనైజ్- 200 గ్రాముల
రెడ్ చిల్లీ సాస్- టేబుల్
స్పూన్
కారం- టీస్పూన్
ఉప్పు- అర టీస్పూన్
మిరియాల పొడి- అర టీస్పూన్
గుడ్లు- ఆరు
ఉల్లిపాయ- ఒకటి
ఉల్లికాడలు- టీస్పూన్
మందపాటి బ్రెడ్ ముక్కలు- నాలుగు
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
ఎగ్ సలాడ్ శాండ్‌విచ్ తయారీ విధానం…
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.!
ముందుగా అరడజను గుడ్లను ఉడికించి పెట్టుకోవాలి. ఉడికి చల్లారిన తర్వాత పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌లో మయొనైజ్ వేసుకోవాలి. అందులో రెడ్ చిల్లీ సాస్, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి.
కట్ చేసిన గుడ్లలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఇందులో మయొనైజ్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. పై నుంచి కొన్ని ఉల్లిపాయ కాడలు వేసి మరోసారి కలపాలి.
ఇప్పుడు స్టవ్‌పైన బాణలి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో బ్రెడ్ ముక్కలను వేసి రెండు వైపులా క్రిస్పీగా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.

ఇలా ఒక్కొక్కటి కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్‌ను తీసుకుని దానిని మధ్యలోనుంచి విడదీసి ఆ గ్యాప్‌లో మయోనైజ్ ఎగ్ సలాడ్ మిశ్రమాన్ని తురుముకోవాలి.
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ఇలా అన్నిటిలో సలాడ్‌ను నింపుకొన్న తర్వాత పై నుంచి మరోసారి కొన్ని ఉల్లికాడలను చల్లుకోవాలి. అంతే జ్యూసీగా, క్రేమీగా, మిరియాల ఘాటుతో స్పైసీగా ఉండే ఎగ్ సలాడ్ శాండ్‌విచ్ రెడీ.
ప్రతి బైట్‌కి సాఫ్ట్‌గా, క్రంచీగా, జ్యూసీగా ఉంటూ సరికొత్త రుచితో ఈ ఎగ్ సలాడ్ శాండ్‌విచ్ మీ ఫేవరెట్ స్నాక్‌గా మారిపోతుందనడంలో సందేహం లేదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
