Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.!
వంకాయ కాంబినేషన్ కూరలు అంటే నో చెప్పడం కష్టమే. అంతలా ఈ వంకాయ వెరైటీలకు ఎవరైనా ఫేవరెట్ అయిపోవాల్సిందే.. అందుకే ఈ వీకెండ్లో శాకాహార ప్రియుల కోసం నోరూరించే వంకాయ పెరుగు పచ్చడిని ట్రై చేయండి.. మీ సండే స్పెషల్ డే ఫుడ్ మెమరబుల్‌గా ఉంటుంది.

వంకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
వంకాయలు- మీడియం సైజులో ఉన్న రెండు పెద్ద వంకాయలు
పసుపు- టీస్పూన్
కశ్మీరీ కారం- మూడు టీస్పూన్లు
ఉప్పు- టీస్పూన్ లేదా రుచికి సరిపడా
నూనె- ఐదు టీస్పూన్లు
తాజా పెరుగు- 400 గ్రాములు
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- ఎండుమిర్చి- రెండు
ఇంగువ- చిటెకెడు
ఉల్లిపాయ- ఒకటి
కారం- టీస్పూన్
ఉప్పు- అర టీస్పూన్
జీలకర్ర పొడి- టీస్పూన్
కొత్తిమీర- కొద్దిగా
ముందుగా వంకాయలను గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు నీళ్లలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి.
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ఈ వంకాయ ముక్కలకు పసుపు, కశ్మీరీ కారం, ఉప్పు, టీస్పూన్ నూనె వేసి కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఉంచడం ద్వారా కారం, ఉప్పు బాగా పడుతుంది.

ఇప్పుడు పెరుగును ఉండలు లేకుండా నీళ్లు పోయకుండా క్రీమీగా వచ్చేవరకు బాగా గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన తవా లాంటి పాన్ పెట్టుకుని దానిపైన కొద్దిగా నూనె అప్లై చేసి వేడి చేయాలి. వీటిపైన మ్యారినేట్ చేసిన వంకాయ ముక్కలను వేసి రెండు వైపులా నూనె అప్లై చేస్తూ కాల్చుకోవాలి.
వంకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పాన్‌ను పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరో పాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల వేసి కాగనివ్వాలి. ఇందులో ఆవాలు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
ఇందులో కొద్దిగా ఇంగువ వేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
ఇప్పుడు కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి మరోసారి కలిపి వేయించాలి.
క్రీమీగా ఉన్న పెరుగును తీసుకుని ముందుగా పాన్‌లో కొన్ని వేయించిన వంకాయ ముక్కలపైన పెరుగును అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మిగిలిన వంకాయ ముక్కలను పేర్చుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
అంతే సింపుల్‌గా ఉండే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. ఈ వీకెండ్లో తప్పక ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
