Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కుంభమేళాలో మోనాలిసా ఎంత సంపాదించిందో తెలుసా? కేవలం పదిరోజుల్లోనే అన్ని కోట్లా?
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహా కుంభమేళాలో వైరల్ అయిన తేనె కళ్ల సుందరి మోనాలిసా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం ఒక్క ఫొటోతో ప్రపంచ వ్యాప్తంగా ఆమె ఫేమస్ అయ్యారు. తన వైపు ప్రపంచాన్నంతా తిప్పుకున్నారు. కుంభమేళాలో వ్యాపారం చేసేందుకు వచ్చిన ఆమెను.. కెమెరాలన్నీ చుట్టుముట్టడంతో, వ్యాపారం చేయలేక ఆమె తన సొంత గ్రామానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ అవడంతో.. ఆమె తనకంటూ ఓ సోషల్ మీడియా ఖాతాను సృష్టించుకుంది. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే కుంభమేళాలో ఉన్నన్ని రోజులు ఎంత సంపాదించింది అనేదాని గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

పది రోజుల్లో పది కోట్లు..
కుంభమేళాలో బాగా పాపులర్ అయిన మోనాలిసా భారీగా డబ్బులను సంపాదించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన మరో విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 10 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ఈ ఈవెంట్ ద్వారా ఆమెకు రూ.10 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ డబ్బు అతని కుటుంబానికి అందిందని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే దీనిపై అడిగిన ప్రశ్నకు మోనాలిసా సమాధానమిచ్చింది. 10 కోట్ల రూపాయలను పొందడంపై ఆమె వ్యాఖ్యానిస్తూ, 'నాకు ఇంత పెద్ద మొత్తం వచ్చి ఉంటే, నేను ఇంకా ఇక్కడ రుద్రాక్షి ఎందుకు అమ్ముతాను? మా కుటుంబంతో కలిసి చిన్న ఇంట్లో ఎందుకు ఉంటాను, నాకు అంత డబ్బు రాలేదు' అని తెలిపింది.
ఇండోర్ నుంచి
మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ఆమె ఇండోర్ నుంచి వచ్చారు. కానీ ఆమెను ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. గంటల్లోనే వైరల్‌గా మారింది. దీంతో ఆమెతో ఇంటర్వ్యూలు, సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఇది ఆమె వ్యాపారానికి భారీగా ఆటంకం కలిగించింది.
వీటన్నింటి మధ్య, ఆమె తన స్వస్థలమైన ఇండోర్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన X ఖాతాలో షేర్ చేసింది. నా కుటుంబం, నా భద్రత కోసం నేను ఇండోర్‌కు తిరిగి వచ్చేశాను. వీలైతే తదుపరి మహా కుంభానికి తిరిగి వస్తానని రాసుకొచ్చింది. గతంలో ఆమె దగ్గర రుద్రాక్షిలు, దండలు కొనుక్కోవడానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు సెల్ఫీల కోసమే వస్తుండటంతో ఆమెకు వ్యాపారంలో నష్టమే కాకుండా రక్షణ లేకుండా పోయింది. దీంతో ఆమె తన స్వస్థలానికి వెళ్లినట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications