Latest Updates
-
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్!
Lal Bahadur Shastri Jayanti 2022: పొట్టివాడైనా గట్టి వాడు.. ఆయన గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
భారతదేశ వృద్ధికి లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కృషి అసమానమైనది. ఆయన పాలన కాలంలోనే హరిత విప్లవం, శ్వేత విప్లవం వంటి విప్లవాలు భారతదేశాన్ని ఆహార లోటు నుండి ఆహార మిగులు దేశంగా మార్చాయి.
Lal Bahadur Shastri Jayanti 2022: అక్టోబరు 2న, మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశం గాంధీ జయంతిని జరుపుకుంటుంది. అయితే భారతదేశ అభివృద్ధికి దోహదపడిన వ్యక్తి జయంతి కూడా అదే రోజు కావడం విశేషం. అయితే ఆయన జయంతి ఉత్సవాలు చాలా తక్కువగానే జరుగుతాయి. ఆయనే భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి.

భారతదేశ వృద్ధికి లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కృషి అసమానమైనది. అయితే 1962లో చైనాపై ఓడిపోయిన తర్వాత ఒక దేశం కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని పునరుజ్జీవింపజేసి, 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో విజయం సాధించేలా చేసిన వ్యక్తిని గౌరవంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పాలన కాలంలోనే హరిత విప్లవం, శ్వేత విప్లవం వంటి విప్లవాలు భారతదేశాన్ని ఆహార లోటు నుండి ఆహార మిగులు దేశంగా మార్చాయి.

లాల్ బహదూర్ శాస్త్రి గురించి కొన్ని వాస్తవాలు:
1. కాశీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంలో ఆయన స్కాలర్. అది విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆ వర్సిటీ లాల్ బహదూర్ కు 'శాస్త్రి' అనే బిరుదు ఇచ్చింది.
2. శాస్త్రి 3 నెలల వయసులో ఆయన తల్లి గంగానదిలో స్నానం చేస్తుండగా యానను కోల్పోయింది. పిల్లలు లేని ఒక గోరక్షకుడు శాస్త్రిని తన తల్లికి అప్పగించాడు.
3. స్కూల్ డేస్‌లో, శాస్త్రి తన దగ్గర పడవలో వెళ్లడానికి డబ్బు లేకపోవడంతో తలపై పుస్తకాన్ని కట్టుకుని రోజుకు రెండుసార్లు గంగానదిని ఈదేవారు.
4. ఉత్తరప్రదేశ్‌లో పోలీసు మంత్రిగా, లాఠీ ఛార్జ్‌కు బదులుగా గుంపును చెదరగొట్టడానికి నీటి జెట్‌లను ఉపయోగించిన మొదటి వ్యక్తి శాస్త్రి.
5. తన పెళ్లి సందర్భంగా, శాస్త్రి కట్నంలో భాగంగా ఖాదీ వస్త్రం మరియు రాట్నం తీసుకున్నారు.
6. శాస్త్రి తరచుగా ధోతీ-కుర్తాలో కనిపించేవారు కాబట్టి నెహ్రూ ఒకప్పుడు ఆయనను హాఫ్ సివిలైజ్డ్ అని పిలిచారు.
7. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు శాస్త్రి భార్యకు నెలకు రూ.50 పెన్షన్ వచ్చేది. శాస్త్రి భార్య డబ్బు నుండి 10 రూపాయలు పొదుపు చేసినట్లు ఒకసారి ఆయనకు తెలియజేసింది. ఆమెతో విసిగిపోయిన శాస్త్రి తన పింఛను తగ్గించి, పేదవారికి రూ. 10 ఇవ్వాలని సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీని అడిగారు.
8. ఒక డిపార్ట్‌మెంట్‌లో ఆయన కుమారుడికి అనవసరమైన ప్రమోషన్ ఇచ్చినందుకు, శాస్త్రి దానిని వెంటనే తిరిగి ఇచ్చేశాడు.
9. 2004లో ఆయన జయంతి సందర్భంగా RBI ఆయన జీవిత స్మారకార్థం ఆయన చిత్రపటం ఉన్న రూ.100 నాణేన్ని విడుదల చేసింది. ఆ రూ. 100 నాణెం చెలామణిలో లేదు. ఆర్డర్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది.
10. శాస్త్రి గుండె వైఫల్యం కారణంగా అప్పటి USSR యొక్క తాష్కెంట్‌లో 11 జనవరి 1966న మరణించారు. అయితే ఆయన మరణం పై ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి.
11. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు శాస్త్రి జైలుకు వెళ్లారు. కానీ, ఆయన వయస్సు అప్పటికి 17 ఏళ్లే కావడంతో మైనర్ అని వదిలిపెట్టారు.
12. స్వాతంత్య్రానంతరం రవాణా మంత్రిగా నియమితులైనప్పుడు, శాస్త్రి ప్రజా రవాణాలో మహిళా డ్రైవర్లు మరియు కండక్టర్ల సదుపాయాన్ని ప్రవేశపెట్టారు.
13. నెహ్రూ మరణానంతరం ఇందిరాగాంధీని తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇందిర నిరాకరించడంతో శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు.
14. పాల ఉత్పత్తిని పెంచడం కోసం శ్వేత విప్లవానికి నాంది పలికారు.
15. భారతదేశ ఆహార ఉత్పత్తిని ప్రోత్సహించడానికి హరిత విప్లవం అనే ఆలోచన చేసి దానిని అమలు చేశారు.



Click it and Unblock the Notifications