Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
కన్నుల పండుగగా ప్రారంభమైన ఆస్కార్ అవార్డ్స్.!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఆస్కార్ అవార్డ్స్ వేడుక ఆదివారం కన్నుల పండుగగా లాస్ ఎంజిల్స్ లో ప్రారంభం అయ్యింది. ఆస్కార్ అవార్డుల ప్రధాన వేడుక ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి) అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిల్మ్ అవార్డులు ఎవరిని వరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారాన్ని ఏ పాట గెల్చుకుంటుందనే ఆసక్తిలో సంగీతాభిమానులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
వేడుకకు కౌంట్ డౌన్...

ఆస్కార్ అవార్డుల పండగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమైన ఆస్కార్ వేడుక కోసం కోట్లాది మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కోసం హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ రేసులో ఫ్రోజెన్ చిత్రంలోని లెట్ ఇట్ గో సాంగ్ మొదటి స్థానంలో ఉంది. ఇడినా మెన్‌జెల్ గానం చేసిన ఈ పాట యూ ట్యూబ్‌లో కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది. హాలీవుడ్ రిపోర్టర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మాథ్యూ బెల్లోని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును ఈ పాటే గెలుచుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
భారత్ తరపున ప్రముఖ సంగీతదర్శకుడు, గాయకుడు శంకర్ మహాదేవన్ గానం చేసిన ముఝ్‌సే హోగీ షురువాత్ గీతం కూడా హానెస్టీ ఆస్కార్స్ విభాగంలో నామినేట్ అయింది. మా గీతం ఆ స్కార్హానెస్టీ అవార్డుకు నామినేట్ అయింది. ఈ పాటకు ఓట్ చేయండి అంటూ మహదేవన్ గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం విధితమే.



Click it and Unblock the Notifications
