అనార్కలీ డ్రెస్ ఇలా ఉంటే అందరూ అందంగానే కనిపిస్తారు

వింటేజ్ స్టైల్..ఇప్పుడు ఇదో ఫ్యాషన్ సింబల్ గా మారిపోయింది. అందులో భాగంగానే ఎప్పుడో ‘మొఘల్ ఎ ఆజమ్'నాటి అనార్కలీలు ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ అయిపోయాయి. పండుగ, శుభకార్యం.. ఇలా సందర్భం ఏదైనా...సంప్రదాయ వేడుకల్లో చీర, లంగావోనీ కాకుండా అంతటి అందాన్ని తెచ్చి పెట్టేవంటే అనార్కలీ అనే చెప్పాలి. అనార్కలీలో పొడవాటి కుర్తాతో ఉండేవి కొన్నైతే, టాప్ మీద కోట్ తో వచ్చేవి మరికొన్ని...కావలనుకుంటే, ఈ కోట్ ను తీసేసి అనార్కలీని విడిగా కూడా వేసుకోవచ్చు. అయితే అనార్కలీల్లో ఎన్ని మోడళ్ళున్నా అన్నీ అందరికీ సూటవ్వవు. అందుకే ఎలాంటి శరీర ఆకృతికి ఎలాంటి అనార్కలీ ఎంచుకోవాలో చూద్దామా...

1. పొడుగ్గా ఉంటే..
* మీరు స్లిమ్ గా పొడుగ్గా ఉంటారా? మీరు చాలా లక్కీ అని చెప్పకోవచ్చు. ఎందుకంటే మీలాంటీ వాళ్లు అనార్కలీ ఎంచుకొనేటప్పుడు పెద్దగా రూల్స్ పాటించాల్సిన పనిలేదు. స్వతమాగా అనార్కలీలు ఇలాంటి వాళ్ళకోసమే డిజైన్ చేశారా అన్నట్లుగా ఉంటాయి. రంగుల్లో వైవిధ్యం ప్రదర్శిస్తే చాలు ఆకట్టుకునే అందం మీ సొంతమవుతుంది.
* పొడుగ్గా ఉండే వాళ్లు ఎక్కువ లేయర్స్, షైనింగ్ ఉండే అనార్కలీని ఎంచుకుంటే అది మీ పొడవుని మరింత హైలైట్ చేస్తుంది.
* మీరు మరీ పొడవు ఎక్కువగగా ఉంటే దాన్ని తగ్గించి చూపించడానికి అడ్డు గీతలున్న అనార్కలీని ఎంచుకుంటే మంచిది.

2. పొట్టిగా ఉన్నా పర్వాలేదు:
పొడువుగా ఉన్నవారికి అనార్కలీలు చక్కగా సూటవుతాయి. అన్నంతమాత్రన పొట్టిగా ఉన్నవారికి అస్సలు సూటవ్వవని కాదు...కాకపోతే మీ శరీర ఆకృతికి తగ్గట్టుగా ఉండే అనార్కలీని ఎంచుకుంటే సరిపోతుంది. పొట్టిగా ఉన్నవారికి అన్ని రకాలూ సూటవ్వవు. జాగ్రత్తగా ఎంచుకోకపోతే అనార్కలీ వేసుకున్న తర్వాత మీరు మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్లు అనార్కలీ ఉం
చుకోవడంలో కొన్ని టిప్స్ పాటిస్తే మంచిది.
*మీ పొట్టితనాన్ని మంచి నెక్ ఉన్న అనార్కలీ వేసుకొని కవర్ చేసుకోవచ్చు. దీని వల్ల అందరి దృష్టీ మీ నెక్ వైపే ఉంటుంది. కాబట్టి పొట్టిగా కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* పొట్టిగా ఉన్నవారు రెండు, మూడు రంగుల డిజైన్లను కాకుండా ఒకే రంగులో ఉన్న అనార్కలీని ఎంపిక చేసుకుంటే మంచిది. మెరుపులు కూడా సాధ్యమైనంత తక్కవుగా ఉండేలా చూసుకోవడం మంచిది.
* ఎత్తు తక్కువగా ఉండేవారికి ఫ్లోర్ లెంత్ అనార్కలీలు అంతగా నప్పవు. దీని వల్ల వారు ఇంకా పొట్టిగా కనిపిస్తారు. అందుకే ఇలాంటి వాళ్ళు మోకాళ్ల వరకూ లేదా అంత కంటే కొద్దిగా పొడవుగా ఉన్న అనార్కలీలు వేసుకుంటే బాగుంటుంది.
* పొట్టిగా ఉన్నవారు అనార్కలీ బోర్డర్ కూడా సన్నగా ఉన్నవే ఎంపియచేసుకోవాలి. లేకపోతే ఎత్త మరింత తగ్గినట్టు కనిపిస్తారు.
* ఎత్తు ఉన్నవారు మంచి ఫ్యాబ్రిక్స్ ను ఎంచుకోవడం వల్ల తమ ఎత్తును కవర్ చేసుకోవచ్చు. క్రేప్, జార్జెట్ తరహా ఫ్యాబ్రిక్స్ ఇలాంటి వారికి సూటవుతాయి. ఇలాంటివి వేసుకోవడం వల్ల అవి శరీరానికి అతుక్కోకుండా ఉండటమే కాదు...కొద్దిగా పొడుగ్గా కూడా కనిపించే అవకాశం ఉంటుంది.
* ఆకట్టుకునే అనార్కలీకి తోడు మంచి హై హీల్స్ ని కూడా జత చేస్తే అందరిలోనూ మీరే హైలైట్ అవుతారు.
*పొడుగు గీతలున్న అనార్కలీ వేసుకుంటే మీరు కూడా పొడుగ్గా కనిపించే అవకాశం ఉంటుంది.

3. బొద్దుగా ఉంటే:
లావుగా ఉన్నవారికి కూడా అన్ని రకాల అనార్కలీలు సూటవ్వవు. వీరు ఎలాంటివి వేసుకోవచ్చంటే
* బొద్దుగా ఉండే వాళ్లకి స్టిప్ గా, శరీరానికి అతుక్కొని ఉండే ఫ్యాబ్రిక్స్ సరిపడవు. ఇలాంటివి వేసుకోవడం వల్ల మీ శరీర ఆకారం ఇంకా లావుగా కనిపించే అవకాశం ఉంటుంది.
* సిల్క్, లెనిన్, జార్జెట్, పాలిస్టర్ ఫ్యాబ్రిక్ లతో చేసిన అనార్కలీలు లావుగా ఉన్నవారికి చక్కటి అందాన్ని తీసుకురావడమే కాదు...లావు కూడా తగ్గినట్టు కనిపిస్తారు.
* బొద్దుగా ఉండే వారు అడ్డంగా గీతలున్న లేదా ఎగుడు దిగుడుగా ఉండే ఎసిమెట్రిక్ డిజైన్లున్న డ్రస్సులను ఎంచుకోకపోవడం మంచిది.
* బొద్దుగా ఉండే వారు, కాస్త పొడవుగా ఉంటే వాళ్ల హైట్ ని బాగా కనిపించేలా చేసి లావును కవర్ చేసుకోవచ్చు. ఇదెలాగంటే...అనార్కలీ కుచ్చిళ్లు(కలీస)నడుము దగ్గరి నుంచి కాకుండా ఇంకా పైనుంచి ఉండేలా చూసుకోవడం వల్ల మీ నడుము మీదకు ఫోకస్ పకుండా పొడుగ్గా కనిపించేలా చేసుకోవచ్చు.
* ఇలాంటి వాళ్ళు స్లీవ్ లెస్, డీప్ నెక్ వెనక వీపు దగ్గర డిజైన్ ఉన్న అనార్కలీలు ఎంపికచేసుకోవడం మంచిది.
*ప్రింటెడ్ అనార్కలీ వేసుకోవాలనకుంటే చిన్నగా ఉన్న ప్రింట్స్ ని ఉపయోగించాలి. భారీగా ఉన్నవి ఇలాంటి వాళ్లకు నప్పవు.

Some valuable tips while choosing an anarkali suit

4. వేడుక బట్టి:
ఈ మద్య ఎంగేజ్ మెంట్, సంగీత్, మెహందీ, రిసెప్షన్ లాంటి పెళ్ళి వేడుకలకి వధువులు కూడా అనార్కలీ డ్రస్సుల్లో ముస్తాబవుతున్నారు. ఎవరి పెళ్లికైనా వెళ్లాలనుకుంటే కూనడా అమ్మాయిలు ఎక్కువగా అనార్కలీలనే ఎంచుకుంటున్నారు. ఇలాంటప్పుడు మీరు వెళ్ళే వేడుకను బట్టి రంగును ఎంచుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
* పెళ్లిళ్లకు ముదురు ఆకుపచ్చ, గులాబీ, బంగారు వర్ణం, పీచ్ కలర్స్ బాగుంటాయి. రిసెప్షన్ లాంటి వేడుకలకు ఎరుపు, నీలం రంగులు అదిరిపోతాయి.
* ఇక సంగీత్ లాంటి వేడుకలకు గులాబీ, ఎరుపు, బంగారు వర్ణాలు చక్కగా సూటవుతాయి. హల్థీలాంటి ఫంక్షన్ కు తెలుపు, క్రీమ్, పసుపు, లాంటి లేత రంగులును ఎంచుకుంటే బాగుంటుంది.
* ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దానికి తగ్గట్టుగా మంచి యాక్సెసరీలు కూడా ఉంటే ఫర్ఫెక్ట్ గా ుంటుంది.

చూశారుగా ఆకృతి బట్టి, సందర్భాన్ని బట్టి అనార్కలీ మోడల్ ని ఎలా ఎంచుకోవాలో.. ఈసారి అనార్కలీని కొనాలకుంటే పైన చెప్పిన సలహాల్ని అనుసరించి మంచి లుక్ మీ సొంతం చేసుకోండి...

Story first published: Saturday, November 29, 2014, 17:11 [IST]
Desktop Bottom Promotion