Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
జీ సినీ అవార్డ్స్ 2014 - పట్టు సడలని ప్రియాంకా చోప్రా !
అంగ సౌష్టవం, అదిరేటి లుక్ గల అంతర్జాతీయ సినీ భామ ప్రియాంక చోప్రా, జీ సినీ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ పై పూర్తి దేసీ లుక్ ఇచ్చింది. అచ్చమైన భారతీయ యువతిగా పేరుపడ్డ ప్రియాంక చోప్రా ఆకర్షణీయ చీర కట్టులో ఆడియన్సు ను మంత్ర ముగ్ధులను చేసింది. బంగారు, తెలుపు రంగులు కల సాంప్రదాయ చీర కట్టి ఆమె రెడ్ కార్పెట్ పై నడుస్తూంటే, ప్రదేశం అంతా వెలుగులు విరజిమ్మాయి.
జీ సినీ అవార్డ్స్ 2014 లో తాను దేసీ లుక్ లో కనపడాలనే ఆమె నిర్ణయం సరైనదని అనిపించింది. రెడ్ కార్పెట్ పై తెలుపు, బంగారు రంగులు కల ఆమె చీర ప్రేక్షకులకు మరపురాని అనుభూతులు పంచింది. తెల్లటి చీరపై మెరిసే బంగారు డిజైన్ లు ఆ చీర గోల్డెన్ వైట్ అనే భ్రమను కలిగించాయి. దట్టమైన నియాన్ ఇంకు బోర్డర్ లు మంచి స్టైలిష్ లుక్ ఇచ్చాయి. 2014 జీ సినీ అవార్డుల ప్రోగ్రాం లో ఇంటర్నేషనల్ సింగర్ గా గెలుపు పొందిన గ్రేట్ ప్రియాంక చోప్రా తాను కట్టిన చీరపై మాచ్ అయ్యే కేప్ స్లీవ్ గోల్డెన్ బ్లౌస్ ధరించింది. గౌన్ కేప్ స్లీవ్ లు బంగారు రంగులో దగా దగా మెరిసి పోయాయి.

జీ సినీ అవార్డ్స్ 2014
ప్రియాంక చోప్రా చీర కట్టు సైతం విభిన్న రీతి లో వుంది దానిపై కల బంగారు రంగు డిజైన్ లు మరింత మెరిసాయి. ఆమె గుండే సినిమా లోని పాత్రను ధరించిందా ? అని ఒక్క క్షణం అనిపించింది. అందమైన చీర కట్టు, పెద్ద నల్లని బొట్టు, చెవులకు బంగారు లోలకులు, తీర్చి దిద్దిన కన్నుల మేక్ అప్ ఇవన్నీ ఆమె రాబోయే చిత్రం లోవా అని అనిపిస్తోంది. మొత్తంగా ఈ నటీమణి ఈ ప్రదర్శనలో అందంగా మెరిసి పోతూ వుంటే, ఈ మాజీ ప్రపంచ సుందరి పై నుండి కన్నులు ఎలా మరల్చాలా అని అందరికి అనిపించింది.
ఎంతో కాలం తరవాత రెడ్ కార్పెట్ పై ఒక భారతీయ కట్టు బొట్టు కల సౌందర్యవతిని చూసాము. గతంలో ఫిలిం ఫేర్ అవార్డ్ ల ప్రదర్శనలో ఆమె నల్లని గౌను ధరించి ఎంతో సెక్సీ గా కనపడగా నేడు ఆమె అచ్చమైన భారతీయ మహిళా కట్టు బొట్టు తీరులో ప్రదర్శన ఇచ్చింది.



Click it and Unblock the Notifications
