Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
లైఫ్ లో ఎప్పటికీ మారని.. మనో ధైర్యాన్ని నింపే థింగ్స్
లైఫ్ ని లవ్లీగా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎప్పుడూ హ్యాపీగా గడపాలని ప్రార్థిస్తూ ఉంటారు. కావాల్సినవన్నీ అందుకోవాలని.. లక్ష్యాలను అలవోకగా జయించాలని.. అందరికంటే గొప్పగా జీవించాలని.. కలలు కంటూ ఉంటారు.
READ MORE: వధువుకి వన్నె తెచ్చే ఇండియన్ కల్చర్
పుట్టుకతో మొదలయ్యే జీవితంలో ఎన్నో కష్టసుఖాలు, గెలుపోటములు, లాభనష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదురెళ్లి పోరాడాల్సి వస్తుంది. అప్పుడే జీవితంపై విజయం సాధించగలుగుతాం. నిద్ర లేచింది మొదలు.. మనం చూసే ప్రతి విషయం, అనుభవం నేర్పే ప్రతి అంశం సమాధానం లేని ప్రశ్నలే. అలాంటి వాటిలో సమయం, పుట్టుక అన్నీ ఆశ్చర్యం కలిగించేవే.

సయమాన్ని ఆపడం ఎవరి తరం కాదు
నిద్ర లేవడం, పడుకోవడం, తినడం, తాగడం అన్నీ సమయానికి జరిగిపోవాలి. మనం లేటుగా నిద్రలేచామని టైం ఆగదు. మనకు సక్సెస్ వచ్చేంతవరకు గడియారం ఆగదు. సో ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. అంతేకానీ టైంని ఆపడం ఎవరితరం కాని పని.

వయస్సు ఆపలేం
పుట్టిన తర్వాత వయసు పెరుగుతుంది. రోజులు గడిచే కొద్దీ వయసులో మార్పు రావాల్సింది. దాన్ని ఆపగలమా ? నెవర్.

తలరాతను తప్పించుకోలేం
కొంతమందికి జీవితం చాలా అందంగా ఉంటుంది. మరికొంతమందికి చాలా నిరుత్సాహంగా ఉంటుంది. కొంతమంది జీవితం ఎలా ఉంటే.. అలా సర్దుకుపోతూ ఉంటారు. అంతేకదా.. తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దాన్ని తప్పించుకోవడం ఎవరితరమూ కాదు.

పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు
ప్రతి ఒక్కరికి సమస్యలుంటాయి. కొంతమంది బయటపడతారు.. కొంతమంది బయటపడరు. సమస్య వచ్చిందని పారిపోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. చింతించకుండా.. పరిష్కారం కోసం ఆలోచించాలి.

కీ లేని లాక్ ఉండదు
లాక్ ఉంది అంటే దానికి కీ తప్పనిసరిగా ఉండాలి కదా. అలానే.. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే.. దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది.

నెగటివ్ మైండ్ తో పాజిటివ్ జీవితంలో బతకలేవు
పాజిటివ్ ఆటిట్యూడ్ జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతుంది. ఏ విషయాన్నైనా.. పాజిటివ్ దృక్పధంలో ఆలోచించాలి. నెగటివ్ గా ఫీలయినంత సేపూ జీవితం నెగటివ్ గానే ఉంటుంది.

గుడ్డు హెన్ గా మారాలంటే.. 21 రోజులు
దేనికైనా సమయం రావాలి. గుడ్డు హెన్ గా మారాలంటే 21 రోజులు పడుతుంది. దీన్ని మార్చలేం. ఇది ఎప్పటికి అలానే జరుగుతుంది.

బిడ్డ పురుడుపోసుకోవాలంటే 9 నెలలు
కడుపులో పిండం ఏర్పడిన తర్వాత.. బిడ్డ బయటకు రావాలంటే.. 9 నెలలు పడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. అందరికీ తెలిసిన విషయం.

ఓర్పు
గుడ్డుని బయట నుంచి గట్టిగా కొడితే జీవితం ముగిసిపోతుంది. అదే లోపలి నుంచి ఫోర్స్ చేస్తే.. జీవితం ప్రారంభమవుతుంది. గొప్ప విషయాలన్నీ లోపలి నుంచే ప్రారంభమవుతాయి. చిన్న విషయమే అయినా చాలా అర్థవంతంగా ఉంది.అంటే గుడ్డులో ఉన్న హెన్ సురక్షితంగా బయట పడాలంటే.. బయటనుంచి ఫోర్స్ చేయకూడదు.

సహనం
మనం కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది జీవితం.. ఎప్పుడు ఏది జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది. నీకు కావాలనుకున్న ప్రతీది సరైన సమయంలో నీ వద్దకు చేరుతుంది. అంతవరకు సహనంగా ఉండాలి. అంటే గుడ్డులో ఉన్న హెన్ సురక్షితంగా పడాలంటే.. బయటనుంచి ఫోర్స్ చేయకూడదు.

బాణం
జీవితం బాణం లాంటిది. బాణాన్ని వెనక్కి లాగినప్పుడు ముందుకు దూసుకుపోతుంది. జీవితం కూడా అంతే.. కష్టాలతో వెనక్కి నెడుతుంది అంటే.. మున్ముందు పెద్ద విజయాలున్నాయని అర్థం. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు బయపడకుండా.. ధైర్యంతో ఎదురెల్లాలి.

కష్టే ఫలి
ఏదైనా మనం వేసే అడుగుని బట్టి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఏది చేయాలన్నా ముందుగా ఆలోచించాలి.. తర్వాత నమ్మకం కుదుర్చుకోవాలి. ఆ తర్వాత కలలు కనాలి. చివరగా.. కలలు నిజం చేసుకోవడానికి ధైర్యంగా అడుగు ముందుకేయాలి.



Click it and Unblock the Notifications