Latest Updates
-
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026
మరణం గురించి మీకు తెలియని నిజాలు
మనుషులకు అన్నింటికంటే.. ఎక్కువగా మరణం అంటే భయం. ఎప్పుడు ఎలా.. మనగడ కోల్పోవాల్సి వస్తోందో అని ప్రతి క్షణం భయపడుతూ ఉంటారు. దీనికి బలహీనత
ఒకరకమైన కారణమైతే.. రిలేషన్స్ మరో బలమైన కారణం. బంధుత్వాలు, బాంధవ్యాల మధ్యలో చిక్కుకున్న మనుషులకు... ఈ జీవితంపై ఎక్కువ ఆశగా ఉంటుంది. అందరితో గడపాలని, అన్నీ విశేషాలు చూడాలని కుతూహలంగా జీవితం ఎంజాయ్ చేస్తుంటారు.
కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన, అలవాట్లు ఎలా ఉంటాయి ?
కానీ పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. మరణం ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేనది. కానీ నిత్యం ఎంతో మంది మనకు తెలియకుండానే చనిపోతూ ఉంటారు. మన ఇంట్లో ఒక బిడ్డ పుడితే.. ఈ ప్రపంచంలో ఎన్ని వేల మంది చనిపోతుంటారు మనం ఊహించనిది కాదు. సంతోషాలు, సంపదలు, సర్వసుఖాలు, దుఖాలు, ఆలోచనలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, అన్యోన్యతలు, అనురాగాలు నింపిన జీవితం చివరికి అంతం కావాల్సిందే. అందరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే.. చావు గురించి చాలా నిజాలు ఉన్నాయి. ఆశ్చర్యం, భయం, పాపం అనిపించే.. ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మరణం గురించి మీకు తెలియని నిజాలేంటో ఒక్కసారి చూద్దాం..

*మనుషుల పుట్టుక మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారో మీకు తెలుసా ? మానవ చరిత్రలో ఇప్పటివరకు 100 బిలియన్ కంటే ఎక్కువ మంది చనిపోయారట.
*ప్రపంచవ్యాప్తంగా.. పేదరికం కారణంగా.. రోజుకి 20 వేల మంది చిన్నారులు చనిపోతున్నారు.
*మీరు పుట్టిన రోజు వేడుకగా.. చాలా గ్రాండ్ గా.. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీకు షాకింగ్ ఏంటో తెలుసా ? మీ పుట్టినరోజు నాడు దాదాపు 153,000 మంది చనిపోతున్నారు.
*ఇండియాలో ప్రతి గంటకు ఒక మహిళ చనిపోతోంది. ఎందుకో తెలుసా ? వరకట్నం లేదా దానికి సంబంధించిన కారణాల వల్ల చనిపోతోంది.
*కుడిచేతి వాటం వాళ్ల కంటే.. ఎడమ చేతి వాటం అలవాటు ఉన్న వాళ్లు 3 సంవత్సరాల ముందే చనిపోతారట.
*డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదమని ఎంత చెప్పినా.. జనాల్లో మార్పు రాదు. ఇందుకు ఉదాహరణే ఇది. అమెరికాలో ప్రతి గంటకూ ఒక వ్యక్తి మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల చనిపోతున్నాడు.

మీరు మరణించబోతున్నరని తెలిపే లక్షణాలు
*ఆత్మహత్య మహాపాపం, నేరమని ఎంత వారించినా.. మార్పు కనిపించడం లేదు. ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు.
*టెర్రరిజం కంటే.. బాత్ టబ్ లో జారి పడి చనిపోయే ఛాన్స్ లే ఎక్కువగా ఉన్నాయి.
*ప్రతి 90 సెకన్లకు ఒక మహిళ చనిపోతోంది. అది కూడా గర్భిణీగా ఉన్న సమయంలో లేదా.. డెలివరీ సమయంలో చనిపోతున్నవాళ్లే ఎక్కువ.
*నిద్రపోతూ.. బెడ్ పై నుంచి కింద పడి సంవత్సరానికి 600 మంది అమెరికన్స్ చనిపోతున్నారు.
*మనుషులు చనిపోయిన మూడు రోజులకే ఎంజైమ్స్.. శరీరాన్ని తినడం ప్రారంభిస్తాయి.
*మనం పుట్టేటప్పుడు 270 ఎముకలతో పుడితే.. చనిపోయేటప్పుడు 206 ఎముకలు ఉంటాయి.
*8 మందిలో ఒకరి మరణం గాలి కాలుష్యం వల్లే జరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
*సంవత్సరానికి 12 మంది మనుషులను షార్క్స్ చంపేస్తున్నాయి. అయితే గంటకు 11 వేల 417 షార్క్స్ ని మనుషులు చంపేస్తున్నారు.



Click it and Unblock the Notifications











