Latest Updates
-
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు!
ఈ వ్యక్తి ఇప్పటి వరకు అస్సలు తన ముఖాన్నే కడగలేదు మరియు జంతువుల పేడతో పొగ త్రాగుతాడు
రెండు రోజుల వరకు స్నానమే చేయకుండా ఉండటాన్ని మీరు ఎప్పుడైనా ఊహించుకున్నారా ? మరియు ఒకవేళ ఇలానే గనుక వ్యవహరించినట్లైతే, నలుగురిలో తిరిగినప్పుడు మీలో ఆత్మ విశ్వాసం ఉంటుందా ? ! ఈ ఆలోచన వినడానికే చాలా చండాలంగా ఉంది కదూ ! కానీ మీకు తెలుసా ఈ ప్రపంచంలో కొంతమంది ప్రజలు కొన్ని రోజులు మరియు కొన్ని నెలలు లేదా బహుశా కొన్ని సంవత్సరాల పాటు స్నానం చేయని వారు ఉన్నారు ? !!
80 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక పురుషుడు స్నానం చేసి 60 సంవత్సరాలవుతోంది ! అతను ఎప్పుడూ కనీసం ముఖం కూడా కడుక్కోడు. అంతే కాకుండా గర్వంగా జంతువుల పేడతో పొగ త్రాగుతూ గడిపేస్తున్నాడు !

ఈ వ్యక్తి తన పళ్ళు తోముకొని 20 సంవత్సరాలు దాటిపోయింది :
ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరు సంపాదించి, స్నానం చేసి 60 సంవత్సరాలు అవుతున్న ఈ వింత మనిషి పేరు ఏమౌ హాజీ. ఈయన యొక్క కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అతను అసలు ఎన్ని సంవత్సరాలు నుండి స్నానం చేయడం లేదంటే :
అతను చాలా సంవత్సరాల నుండి స్నానం చేయడం లేదు. అందుకు కారణం ఏమిటంటే పరిశుభ్రంగా ఉంటే తాను అనారోగ్యం భారిన పడతాడని గట్టిగా నమ్ముతున్నాడు. అతనికి ఇష్టమైన ఆహారం క్రుళ్ళిపోయిన ముళ్ల పంది ! ఇప్పుడు వింటున్నది అబద్ధమానో, హాస్యమనో భావించకండి, ఎందుకంటే ఈ వ్యక్తి నిజంగానే బ్రతికి ఉన్నాడు మరియు తాను జీవిస్తున్న జీవనం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, తన జీవితాన్ని సాగిస్తున్నాడు.

అతడు పొగ త్రాగుతాడు :
తనను తానూ ఉల్లాసపరుచుకోవడానికి మరియు విశ్రాంతి పొందడానికి ఈ వ్యక్తి జంతువుల ఎండిపోయిన పేడతో పొగ పీలుస్తాడు. అలా చేయడం ద్వారా తనలో ఒక తెలియని శక్తి వస్తుందట. తన ఆలోచనలను మొదలు పెట్టే ముందు ఒక పెద్ద పైపులో జంతువుల పేడను వేసి పొగ పీలుస్తూ ఆలోచన చేయడం మొదలు పెడతాడు.

అతను ఎంతగానో ఆనందపడతాడు :
అతను తన జీవిత మంత్రంగా భావించి అనుసరిస్తున్న జీవన శైలి మొత్తంగా చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే అతనికి స్వచ్ఛమైన మరియు తాజా ఆహరం లేదా నీరు నచ్చవు. వీటికి బదులుగా కుళ్ళిపోయిన ముళ్ళపంది యొక్క మాంసాన్ని ప్రతిరోజూ తింటాడు. మరియు ఎక్కడెక్కడో నిల్వ ఉన్న అపరిశుభ్రమైన నీటిని త్రాగటానికి ఇష్టపడతాడు. ఇతడు ఎంతో అపరిశుభ్రమైన ఆహార అలవాట్లు పాటిస్తున్నా మరియు అపరిశుభ్రమైన జీవన విధానాన్ని అలవరుచుకున్నా కూడా ఇతనిని పరీక్షించిన వైద్యులు ఇతడు ఇప్పటికి కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడని చెప్పారు ! దీంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

అతడి యొక్క వింత నమ్మకం ఏమిటంటే :
హాజీ అన్న పేరున్న ఈ వ్యక్తి తరచూ స్నానం చేయడానికి మరియు మొహం కడుక్కోవడానికి అస్సలు ఇష్టపడడు. అయితే బయటి ప్రపంచానికి బాగా కనపడటానికి కొద్దిగా కృషి చేస్తాడు మరియు ప్రాముఖ్యత కూడా ఇస్తాడు. అందులో భాగంగానే అప్పుడప్పుడు తన పెరిగిన గెడ్డాన్ని తక్కువ చేసుకోవడానికి ఏదైనా మంట కలిగి ఉన్న ప్రదేశం దగ్గరకు వెళ్లి, ఆ మంటలో ఆ గడ్డాన్ని కాలుస్తాడు.

అక్కడి స్థానికులు ఏమని చెబుతున్నారంటే :
ఇలా వింతగా ప్రవర్తిస్తున్న ఈ వ్యక్తి యుక్త వయస్సులో ఉన్నప్పుడు భావోద్వేగ విషయంలో ఎంతగానో దెబ్బతిన్నాడని మరియు తన ప్రేమలో విఫలం చెందాడని, అందువల్ల అతను తన మిగిలిన జీవితాన్ని ఇలా ఒంటరిగా, మూర్ఖంగా మరియు క్రూరంగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు అక్కడి స్థానికులు చెప్పుకొచ్చారు. అక్కడి ప్రజలు అప్పుడప్పుడు ఇతనిని రాతి విగ్రహంగా ఊహించుకునే వారు. ఎందుచేతనంటే ఇతని చర్మం అక్కడ చుట్టుపక్కల ఉన్న రాళ్ళ రంగుని పోలి ఉంటుంది.

పోగొట్టుకోవడానికి తన దగ్గర ఏమి లేదు :
అక్కడి గ్రామస్థులు ఇతడి పై కొద్దిగా శ్రద్ద వహించి, అతను కొద్దిగా బాగా బ్రతకడం కోసం చిన్న గదిని నిర్మించి ఇచ్చారు. ఇతడు ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నాడు. ఎంతో పెద్ద పెద్ద ఇళ్లల్లో సకల సౌకర్యాలు మరియు వెసులుబాట్లు ఉన్న ప్రజల కంటే ఈ చిన్న గదిలో ఉన్న తానే చాలా ఆనందంగా జీవిస్తున్నానని ఎందుకంటే, తన దగ్గర పోగొట్టుకోవడానికి ఏమి లేదని చెబుతుంటాడు ఈ వింత మనిషి !
ఇతని గురించి మీరు ఏమనుకుంటున్నారు ? మీ ఆలోచనలను క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మరచిపోకండి.



Click it and Unblock the Notifications