Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
తల్లి శవం పక్కన ఏడాది చిన్నారి పాల కోసం..కంట తడి పెట్టించే ఘటన..!
తల్లి చనిపోయిందని తెలియక పాల కోసం ఆమె శవంపై పడి ఏడ్చిన బాలుడు... కంట తడి పెట్టించే ఘటన ఇది..!
గుండె పిండేసే దృశ్యం. అమ్మ చనిపోయిందని తెలీని ఓ పసికూన పాలు తాగడానికి ప్రయత్నిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Image Courtesy - DAILY MAIL UK
చుట్టూ రక్తపు మడుగు... అందులో పడి ఉన్న మహిళ మృతదేహం... రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఆ మృతదేహానికి ఆనుకుని గుండెలవిసేలా రోదిస్తున్నాడు ఏడాది బాలుడు... తల్లి చనిపోయిందని అతనికి తెలియదు. ఆకలైందేమో పాలు తాగుదామని తల్లి కోసం ఏడుస్తున్నాడు అతను.

Image Courtesy - KTN News
అయినా.. ఎంతకీ తల్లి లేవదేం.. పాలివ్వదేం.. అన్నట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆ బాలుడు. ఈ దృశ్యాలను చూసిన వారి హృదయాలు కలుక్కుమన్నాయి. ప్రతి ఒక్కరి గుండెను ఈ సంఘటన పిండేసింది. ఈ హృదయ విదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని దమోహ్ అనే ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కనే ఈ నెల 24వ తేదీన ఉదయం ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

Image Courtesy - Cover Asia News
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మహిళ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేశారు. అయితే అలా తీసే క్రమంలో ఆమె కొడుకైన ఏడాది బాలుడు ఆమె పక్కనే గుక్క పట్టి ఏడ్వడం ప్రారంభించాడు.

Image Courtesy - Cover Asia News
తల్లి చనిపోయిందని, ఇక తిరిగి రాదని ఆ పసికందుకు తెలియదు. అయినా... ఆకలవుతుందని తల్లి పాలు తాగుదామని ఆమె ఛాతీపైకి వచ్చి ఆనుకున్నాడు. దీంతో అతని వేదనను చూసిన స్థానికులకు హృదయం కలచి వేసింది.

అయితే ఆ మహిళ రైలు నుంచి తప్పించుకోబోయి అది ఢీకొని మృతి చెందినట్టు కొందరు స్థానికులు చెబుతున్నారు.
అలా రైలు ఢీకొనే క్రమంలో తన చిన్నారికి ఏమీ కాకూడదని ఆ తల్లి తనను బలి తీసుకుందట. పసికందును బయటకు విసిరేసి తాను ప్రాణత్యాగం చేసిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే చనిపోయిన తల్లి మృతదేహం వద్ద ఆ బాలుడు అలా ఏడవడం అందరినీ కంట తడి పెట్టించింది. అయితే ఆమె వివరాలు మాత్రం తెలియలేదు. ఆ బాలున్ని అనాథ శరణాలయానికి పంపారు.



Click it and Unblock the Notifications